Pushpa 2: పుష్ప.. పుష్ప.. పుష్ప.. ఇప్పట్లో ఈ పేరు ఆగేలా కనిపించడం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. ఇక ఈ సినిమాలో సరసన రష్మిక మందన్న నటించగా.. కిస్సిక్ సాంగ్ లో అందాల శ్రీలీల మెరిసింది.
ఎన్నో అంచనాల నడుమ పుష్ప 2 డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్ నుంచే సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఇప్పటివరకు పుష్ప 2 రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1002 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప 2 రికార్డ్ ను క్రియేట్ చేసిన పుష్ప 2 .. ఇంకా వసూళ్ల వేటను తగ్గించలేదు.
Mega Family: అభిమానం కోసం అలాంటి పని చేసిన తండ్రీకొడుకులు.. నిజంగా గ్రేట్ కదా..!
రిలీజైన 11 వ రోజున కూడా ఈ సినిమా రూ.100+ కోట్లు రాబట్టిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఉదయం నుంచి పుష్ప 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్దమయ్యిందని వార్తలు వినిపించాయి. అయితే ఇందులో ఎంత నిజమో తెలియదు కానీ, మేకర్స్ మాత్రం.. ఓటీటీ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 లోని వీడియో సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు.
తాజాగా వస్తున్నాయి పీలింగ్స్ అంటూ సాగే సాంగ్ వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు పీలింగ్స్ సాంగ్ ను రిలీజ్ చేయలేదు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. మలయాళ ఫ్యాన్స్ మీద ఉన్న అభిమానంతో.. ఈ సాంగ్ లో మొదటి నాలుగు లైన్స్ మలయాళంలో ఉండాలని బన్నీ పట్టుపెట్టి పెట్టించినట్లు ఆయన తెలిపారు. ఆ లైన్స్ అర్ధం కాకపోయినా కూడా మ్యూజిక్ లో ఉన్న వైబ్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
Dacoit: అడివి శేష్ తో మృణాల్ రొమాన్స్.. ఎట్టకేలకు తెలిసిపోయింది.. ?
ఇక సాంగ్ అంతా ఒక ఎత్తు అయితే.. బన్నీ- రష్మిక డ్యాన్స్ మరో ఎత్తు. చంద్రబోస్ అందించిన లిరిక్స్ ..శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీ దాసు మెస్మరైజ్ వాయిస్ అదిరిపోయింది. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మునుపెన్నడూ కూడా రష్మికను ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేసినట్లు కూడా కనిపించలేదు. దీంతో పీలింగ్స్ సాంగ్ థియేటర్ ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడం చాలా రేర్. మరి ఈ సాంగ్ ను కనుక థియేటర్ లో మిస్ అయితే యూట్యూబ్ లో చూసేయండి.