MS Dhoni : సాధారణంగా టీమిండియా కి చెందిన పలువురు స్టార్లకి సంబంధించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఆటగాళ్ల కెరీర్ దగ్గర నుంచి పర్సనల్ లైఫ్, హాబీస్, ఆదాయం వరకు దాదాపు ప్రతీ అంశం మీద గాసిప్స్ వైరల్ అవుతుంటాయి. వీటిలో ఎంత వాస్తవం ఉంది అనేది ప్లేయర్లు చెప్పేంత వరకు అస్సలు నమ్మలేము. అలా తనకు సంబంధించి ఏళ్ల పాటు జనాల నోళ్లలో నలిగిన ఓ విషయం మీద రియాక్ట్ అయ్యాడు మహేంద్ర సింగ్ ధోని. తాను ప్రతిరోజు 5 లీటర్ల పాలు తాగుతాను అంటూ వైరల్ అయింది. తాజాగా ఈ రూమర్ పై క్లారిటీ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ.
Also Read : Nicholas Pooran : బంతి తగిలి అభిమానికి గాయం.. పూరన్ చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే
ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి స్థానంలో కొనసాగుతోంది. కానీ ధోని మాత్రం ఆడిన ఇన్నింగ్స్ లో దుమ్ము రేపుతున్నాడు. తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీకు సంబంధించిన ఏదైనా ఓ పాపులర్ రూమర్ గురించి చెప్పమంటూ ధోనీ ని అడిగారు యాంకర్. అయితే దీనికి లెజెండరీ క్రికెటర్ ధోనీ స్పందిస్తూ.. డైలీ నేను 5 లీటర్ల పాలు తాగుతాను అనే రూమర్ చర్చనీయాంశంగా మారిందని తెలిపాడు. ప్రతీరోజు తాను పాలు తాగుతాననేది కరెక్ట్ అని.. కానీ అన్ని లీటర్లు మాత్రం తాగను అని స్పష్టం చేశాడు ధోనీ. డైలీ లీటర్ పాలు మాత్రమే తాగుతానని చెప్పాడు. అయితే ధోనీ తాగే లీటర్ పాల ధర రూ.200 వరకు ఉండనున్నట్టు సమాచారం.
ఇక వాషింగ్ మెషిన్ లో లస్సీ తయారు చేస్తాననే రూమర్ కూడా వినిపిస్తోంది. కానీ అస్సలు తాను లస్సీ నే తాగను అని క్లారిటీ ఇచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ MS ధోనీ. అతని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ( CSK Team) ఈ ఐపీఎల్ లో చెత్త ఆటతో అందరినీ నిరాశ పరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ లలో 2 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ పొజిషన్ లో కొనసాగుతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచినటువంటి చెన్నై జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఓపెనర్ల నుంచి మెరుగైన ప్రారంభాన్ని పొందడంలో చెన్నై సూపర్ కింగ్స్ విఫలం చెందుతోంది. ముఖ్యంగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో మిడిల్ ఓవర్లలో దాదాపు 7 ఓవర్లకు కేవలం 35 పరుగులు మాత్రమే చేయడం జట్టుకు తీవ్ర నస్టం కలిగింది. టీ20 క్రికెట్ ఇప్పుడు చాలా వేగంగా మారింది. మిడిల్ ఓవర్లలో కూడా జట్టు వేగంగా స్కోర్ చేయడం చాలా అవసరం. చెన్నై సూపర్ కింగ్స్ కి ఆ గేమ్ లో తగిన ఉద్దేశం కనిపించలేదు. ఒక ఆటను కోల్పోవచ్చు. కానీ పోరాడాలన్న ఉద్దేశం కూడా అవసరం అని అంబటి రాయుడు చెప్పుకొచ్చారు.