BigTV English
Advertisement

22,000 kg cheese stolen: 22 వేల కిలోల జున్ను చోరీ.. చాలా ఈజీగా పనికానిచ్చిన దొంగలు..

22,000 kg cheese stolen: 22 వేల కిలోల జున్ను చోరీ.. చాలా ఈజీగా పనికానిచ్చిన దొంగలు..

22,000 kg cheese stolen| దొంగతనం, దోపిడీల ఘటనల గురించి తరుచూ వార్తలు వస్తూ ఉంటాయి. కానీ వాటిలో కొన్ని ఘటనలు చాలా షాకింగ్ గా ఉంటాయి. ఉదాహరణకు ఒక తాజా చోరీ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగా.. 22000 కిలోల జున్ను (చీజ్) ని దొంగలు చాలా సింపుల్ గా తీసుకెళ్లిపోయారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ?.. కానీ నిజంగా ఇలాగే జరిగింది. అది కూడా మన దేశంలో కాదు.. బ్రిటన్ లోని లండన్ నగరంలో.


పట్టపగలు జరిగిన ఈ అతిపెద్ద దోపిడీలో దొంగలు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. దొంగతనం చేయడానికి ఎటువంటి తాళాలు పగులగొట్టలేదు. ఎవరినీ కత్తులతో, తుపాకులతో బెదిరించలేదు. కేవలం వచ్చారు కావాల్సినంత చీజ్ తీసుకొని వెళ్లిపోయారు. ఇదేదో సినిమా సీన్ ను తలపించేలా దొంగతనం జరిగిపోయింది.

Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!


వివరాల్లోకి వెళితే.. లండన్ నగరంలోని నీల్స్ యార్డస్ డైరీ కంపెనీకి చెందిన గోడౌన్ నుంచి 22000 కేజీల చీజ్ (జున్ను) చోరికి గురైంది. దొంగతనం చేయడానికి వచ్చిన కొందరు మోసపూరితంగా తమను తాము కంపెనీతో బిజెనెస్ చేయడానికి వచ్చిన హోల్ సేల్ డీలర్లుగా పరిచయం చేసుకున్నారు. చీజ్ డీలర్ షిప్ గురించి కంపెనీ ఆఫీసులో మాట్లాడామని గోడౌన్ లో పనిచేసే అధికారులను నమ్మించారు. ఆ తరువాత గోడౌన్ లో ఉన్న మొత్తం చీజ్‌ని తీసుకొని పరారయ్యారు. వాళ్లు తీసుకెళ్లిన పనీర్ మొత్తం 22000 కేజీలుండగా.. దాని విలువ 3 లక్షల డాలర్లు (దాదాపు రూ.3 కోట్లు) అని సమాచారం.

అక్టోబర్ 21న జరిగిన చోరీ
లండన్ మెట్రోపాలిటిన్ పొలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సౌత వార్క్ ప్రాంతంలో నీల్స్ యార్డ్ డైరీ గోడౌన్ లో కొందరు వ్యక్తులు హుందాగా బట్టులు వేసుకొని వచ్చి.. గోడౌన్ లో పనిచేసే సిబ్బందికి నకిలీ పత్రాలు ఇచ్చారు. తాము కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పి.. నకిలీ పత్రాలు చూపించి వారి వద్ద ఉన్న చీజ్ మొత్తం కార్గో ట్రక్కులో ఎక్చించి తీసుకెళ్లిపోయారు. ఆ చీజ్ చాలా విలువైనది. ఎందుకంటే అది మిషన్ తో తయారు చేయలేదు. హ్యాండ్ మేడ్ చెడ్డార్ చీజ్. అంటే చేత్తో కష్టపడి తయారుచేసిన చీజ్.

ఈ చోరీ గురించి ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియా గ్రూపులలో తెగ పోస్ట్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. నీల్స్ యార్డ్ డైరీ ఒక ప్రముఖ కంపెనీ. ఆ కంపెనీ బ్రాండ్ చెడ్డార్ చీజ్ కు భలే డిమాండ్ ఉంటుంది. భారీ డిమాండ్ ఉండడంతో కంపెనీ చిన్న కంపెనీలైన, పిఛ్ ఫోర్క్, వెస్ట్ కోంబె, హాఫోడ్ ల నుంచి ముడి సరుకు తీసుకొని వారికి కమిషన్ ఇస్తుంది. తాజాగా జరిగిన భారీ దొంగతనం కారణంగా ఈ చిన్న కంపెనీలకు కమిషన్ లభించదేమో అని అనుమానాలు వ్యక్త మయ్యాయి. కానీ నీల్స్ యార్డ్ కంపెనీ మామూలు సంస్థ కాదు. తమకు ముడిసరుకు పంపిణీ చేసే అన్ని కంపెనీలకు బోనస్ ఇచ్చినట్లు తెలిసింది.

Related News

Chicago Clashes: ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై నిరసనలు.. చికాగోలో చిన్నారిపై పెప్పర్ స్ప్రే కొట్టిన పోలీసులు

Philippines: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ఫంగ్-వాంగ్‌ తుపాను.. స్పాట్‌లో 20 మంది

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Big Stories

×