BigTV English
Advertisement

Dogs In Bedroom: ఒకే బెడ్‌రూంలో 48 కుక్కలు.. ఓనర్ అరెస్ట్..ఎందుకంటే?

Dogs In Bedroom: ఒకే బెడ్‌రూంలో 48 కుక్కలు.. ఓనర్ అరెస్ట్..ఎందుకంటే?

Dogs In Bedroom| నోరులేని మూగజీవాల పట్ల కొందరూ కృూరంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి సైకో ఒకడు తన ఇంట్లో ఏకంగా 48 కుక్కలను బంధించిపెట్టాడు. ఇంట్లోని కిచెన్ లో లాకర్లలో, కప్ బోర్డ్ లలో బంధించి పెట్టాడు. వాటికి ఆహారం, వసతులు లేకుండా హింసించేవాడు. చాలా రోజుల పాటు ఇలాంటి పరిస్థితుల్లో జీవించిన ఆ కుక్కలు బలహీనంగా, మనుషులను చూస్తేనే భయపడిపోయేవిధంగా తయారయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అనిమల్ కంట్రోల్ అధికారులు వాటి యజమానిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. అతను వారి అబద్ధాలు చెప్పి పరారయ్యాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.


అమెరికాలోని న్యూయార్క్ నగరం క్వీన్స్‌ ప్రాంతంలో 37 ఏళ్ల ఇసాక్ యాడ్గరోవ్‌ నివసిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఒక బిల్డింగ్‌లోని ఒకే గది ఉన్న చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. అయితే ఆ అపార్ట్‌మెంట్‌లో అతను కుక్కలను పెంచుకుంటున్నాడు. కానీ కొని రోజులుగా అతని అపార్ట్ మెంట్ నుంచి దుర్వాసన వస్తుండడంతో పొరుగున నివసించే వారు అతడికి హెచ్చరించారు. అయినా ఇసాక్ వారి మాటలను నిర్లక్ష్యం చేశాడు. ఆ తరువాత ఇంట్లో నుంచి కుక్కల శబ్దాలు ఎక్కువగా వస్తుండడంతో ఇబ్బందులకు గురైన పొరుగింటివారు. ఇసాక్ గురంచి అనిమల్ కంట్రోల్ విభాగానికి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై అనిమల్ కంట్రోల్ అధికారులు ఇసాక్ నివసించే ఫ్లాట్ ని తెరిగి చూడగా.. అక్కడ గుంపులు గుంపులుగా కుక్కులు కనిపించాయి.

అవన్నీ అనారోగ్యంగా ఉన్నాయి. మొత్తం 48 బెల్జియన్ మాలినోయిస్ కుక్కలను దారుణ పరిస్థితుల్లో కనిపించాయి. ఆ కుక్కలను అంత కృూరంగా ఉంచినందుకు ఇసాక్‌ను ఎన్‌వైపీడీ యానిమల్ క్రుయెల్టి స్క్వాడ్ డిటెక్టివ్‌లు అదుపులోకి తీసుకున్నారు. ఇసాక్ నివసించే అపార్ట్‌మెంట్‌లో ఉన్న కుక్కలు సూర్యకాంతి, బయటి స్థలం లేకుండా, అపరిశుభ్రమైన, అమానవీయ వాతావరణంలో బతికాయని పీపుల్ మ్యాగజైన్ నివేదించింది.


క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ మెలిండా కాట్జ్ ప్రకారం.. ఇసాక్‌పై జంతులను నిర్లక్షంగా పెంచడం, వాటికి సరైన ఆహారం అందించకపోవడం వంటి మొత్తం 96 చిన్న నేరాల కింద అభియోగాలు నమోదయ్యాయి. ఇసాక్ ను ఆ బిల్డింగ్ నుంచి మే 28న ఖాళీ చేయించారు. ఎన్‌వైపీడీ, న్యూయార్క్ యానిమల్ కేర్ సెంటర్స్ బృందాలు ఏడవ అంతస్తులోని ఫ్లాట్‌కు చేరుకున్నప్పుడు, కుక్కలు కిచెన్ డ్రాయర్లు, క్లోసెట్లు, బోనుల్లో ఇరుక్కుని ఉన్న దృశ్యాలు కనిపించాయి. ఈ దృశ్యాలు చూసి షాక్ కు గురయ్యామని అధికారులు తెలిపారు.

కుక్కలు, వాటి చిన్న పిల్లలలు భయపడి, మనుషులకు కలివిడిగా ఉండలేకపోతున్నాయి. రెస్క్యూ బృందాలు రెండు రోజుల పాటు కుక్కలను తీసుకొని, సురక్షితంగా సంరక్షణ కేంద్రాలకు తరలించాయి. మూడు కుక్కలు తీవ్ర అనారోగ్యంతో ఉండటం వల్ల వాటిని మానవీయంగా చంపాల్సి వచ్చింది. మిగిలిన కుక్కలు సమీప షెల్టర్లలో ఆహారం, వైద్య సంరక్షణ పొందుతున్నాయి.

“ప్రతివాది డజన్ల కొద్దీ కుక్కలను అపరిశుభ్ర, దారుణ పరిస్థితుల్లో ఉంచాడు. అవి స్వేచ్ఛగా కదలలేక, చెత్త మధ్య బతికాయి. జంతువులు మాట్లాడలేవు, బలహీనంగా ఉంటాయి, వాటికి కనీస ఆదరణ, సంరక్షణ అవసరం,” అని మెలిండా కాట్జ్ అన్నారు.

Also Read: ఏఐతో వినాశనం.. ప్రపంచ జనాభా 10 కోట్లకు క్షీణిస్తుంది.. నిపుణుల వార్నింగ్

అయితే విచారణ మధ్యలో ఇసాక్ తప్పించుకొని పారిపోయాడు. కుక్కలను స్వచ్ఛందంగా అప్పగిస్తానని చెప్పి, అపార్ట్ మెంట్ ఖాళీ చేసి అదృశ్యమయ్యాడు. అతను దోషిగా తేలితే, ఒక సంవత్సరం జైలు శిక్ష పడవచ్చు.

Related News

Philippines: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ఫంగ్-వాంగ్‌ తుపాను.. స్పాట్‌లో 20 మంది

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

Big Stories

×