Healthiest Fruit: ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా ఆపిల్, అరటిపండ్లు, దానిమ్మ వంటి పండ్లను కూడా తింటున్నారా ?. ఇటీవల శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో.. ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన పండును కనుగొన్నారు.
శాస్త్రవేత్తల ప్రకారం.. నిమ్మకాయ ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన పండు. అవును..ఇది నిజమేనట, నిమ్మకాయపై చేసిన పరిశోధనలో మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన అనేక పోషకాలు ఇందులో ఉంటాయని రుజువైంది. ఇటీవల అమెరికాలోని విలియం ప్యాటర్సన్ విశ్వవిద్యాలయంలో ఒక అద్భుతమైన అధ్యయనం జరిగింది. ఇందులో శాస్త్రవేత్తలు 41 రకాల ఆహార పదార్థాలపై పరిశోధన చేసి నిమ్మకాయ అత్యంత ఆరోగ్యకరమైన పండు అని కనుగొన్నారు.
నిమ్మకాయ ఎందుకు అంత ప్రత్యేకమైనది ?
నిమ్మకాయలో విటమిన్ సి, ఫైబర్ , ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి.ఇవన్నీ మన శరీరాన్ని అనేక తీవ్రమైన వ్యాధుల నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా శరీరానికి అవసరం అయిన పోషకాలను కూడా అందిస్తాయి.
తక్కువ కేలరీలు, పూర్తి పోషకాహారం:
నిమ్మకాయలో దాదాపు కేలరీలు ఉండవు. అంటే.. 100 కేలరీల నిమ్మకాయ మీ శరీర పోషక అవసరాలను 100% తీర్చగలదు. కాబట్టి మీరు ఏదైనా ఆరోగ్యకరంగా తినాలనుకున్నప్పుడు.. ఖచ్చితంగా మీ ఆహారంలో నిమ్మకాయ చేర్చుకోండి.
నిమ్మకాయ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఇది మీ రోగనిరోధక శక్తిని చాలా బలంగా చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ఇది జలుబు, దగ్గు నుండి మనల్ని రక్షిస్తుంది. అలాగే.. శరీరంలో ఐరన్‌ను సరిగ్గా గ్రహించడంలో సహాయపడుతుంది.
రక్తహీనత వంటి వ్యాధులను నివారిస్తుంది:
నిమ్మకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి గుండె జబ్బులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా మీరు నిమ్మకాయను క్రమం తప్పకుండా తింటే.. మీ జీర్ణవ్యవస్థ బలపడుతుంది. శరీరం నుండి మురికిని తొలగించే ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది.
మరో అద్భుతమైన విషయం ఏమిటంటే.. నిమ్మకాయ రుచిలో పుల్లగా ఉంటుంది. కానీ అది మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. ఆల్కలీన్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
నిమ్మకాయ pH స్థాయిని సమతుల్యం చేస్తుంది:
నిమ్మకాయ తినడం వల్ల అందులోని పోషకాలు మన శరీరంలోని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇది మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. నిమ్మకాయ సహజ pH బ్యాలెన్సర్‌గా పనిచేసే గుణాన్ని కలిగి ఉంది. ఇది శరీరం నుండి వ్యర్థ పదార్థాలను కూడా తొలగిస్తుంది.
నిమ్మకాయ యొక్క పులుపు (ఆమ్లత్వం) గురించి భయపడకూడదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే ఈ పులుపు నిజానికి చాలా ప్రయోజనకరం.
Also Read: మందార పూలను ఇలా వాడితే.. జుట్టు జెట్ స్పీడ్‌లో పెరుగుతుంది
నిమ్మకాయ ప్రయోజనాలు:
మీరు మీ రోజువారీ ఆహారంలో నిమ్మకాయను అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత గోరువెచ్చని నీటిలో నిమ్మరసం చేసుకుని తాగవచ్చు. మీరు తినే సలాడ్ లేదా ఆహార పదార్థాలలో కూడా నిమ్మరసం కలుపుకోవచ్చు. లేదా నిమ్మకాయ టీ కూడా తయారు చేసుకుని తాగవచ్చు.
నిమ్మకాయను తెలివిగా తినండి:
నిమ్మకాయను సరైన పరిమాణంలో, తెలివిగా తీసుకోవాలి. మీరు ఖాళీ కడుపుతో ఎక్కువ నిమ్మకాయ తాగితే.. అది మీ దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిమ్మకాయలోని పుల్లని (ఆమ్లం) కొంతమందిలో ఆమ్లత్వం లేదా కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.