E-Paper
Advertisement

రన్నింగ్ ఫ్లైట్ నుంచి దూకి ఇన్‌స్ట్రక్టర్ ఆత్మహత్య.. ఆ తర్వాత ఆకాశంలో ఏం జరిగింది?

రన్నింగ్ ఫ్లైట్ నుంచి దూకి ఇన్‌స్ట్రక్టర్ ఆత్మహత్య.. ఆ తర్వాత ఆకాశంలో ఏం జరిగింది?
Advertisement

Flight Instructor: విమానం గాల్లో ఎగురుతుండగా.. పైలట్ సీట్లో ఉన్న గురువు అకస్మాత్తుగా కిందికి దూకేస్తే.. ఆ సీన్ ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. సరిగ్గా ఇలాంటి ఊహించని, గుండె ఆగిపోయేంత భయాందోళనకరమైన ఘటనే అర్జెంటీనాలో జరిగింది. ట్రైనింగ్ ఇస్తున్న సమయంలోనే ఓ ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ విమానం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

‘ఏం చేయాలో నీకు తెలుసు..’

Advertisement

అర్జెంటీనాలోని టొలెడా ప్రాంతంలో ఉన్న ‘ఫ్లయింగ్ ప్యారెట్ కార్డొబా ఫ్లయింగ్ స్కూల్’లో లియాండ్రో ఆండ్రెస్ (42) సీనియర్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. గత వారం ఆయన ఓ విద్యార్థిని విమానంలో తీసుకెళ్లి ఆకాశంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. విమానం గాల్లో ఉండగానే.. లియాండ్రో అకస్మాత్తుగా తన హెడ్‌సెట్, సీట్ బెల్ట్ విప్పేశారు. ఏం జరుగుతుందోనని ఆ స్టూడెంట్ కంగారుపడుతుండగానే.. ‘ఏం చేయాలో నీకు తెలుసు.. ఆ ప్రకారమే నడుచుకో’ అని చెప్పి విమానం డోర్ తెరిచి కిందకు దూకేశారు.

Also Read: మమ్మల్ని కొన్నాళ్లు పని చేయనివ్వండి.. విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!

Advertisement

సురక్షితంగా రన్‌వేపై ల్యాండింగ్

కళ్లముందే గురువు గాల్లోకి దూకేయడంతో ఆ విద్యార్థి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అయితే, ప్రాణాలు కాపాడుకోవాలనే పట్టుదలతో గుండె నిబ్బరం తెచ్చుకున్నాడు. తనకు గుర్తున్న మెలకువలతో, ఎంతో చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ చేశాడు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పడమే కాకుండా, ఆ విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు.

యాజమాన్యం విస్మయం

ఈ విషాద ఘటనపై ఫ్లయింగ్ స్కూల్ డైరెక్టర్ ఎడ్వర్డో అల్వారెజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లియాండ్రో ఎంతో అనుభవజ్ఞుడని, ఆయన మనసులో ఇలాంటి ఆత్మహత్య ఆలోచనలు ఉన్నాయని తాము అస్సలు ఊహించలేకపోయామని చెప్పారు. పైగా గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు విమానం డోర్ తెరవడం చాలా కష్టమైన పని అని పేర్కొన్నారు. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లియాండ్రో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, ఆయన అంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

Related News

పనామాపై ప్రకృతి కన్నెర్ర.. భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిన నగరం, ఊహించని డ్యామేజ్

ట్రంప్ ఆశలపై నీళ్లు.. భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి పురస్కారం

గ్రీన్‌కార్డు వ్యవహారం.. వాన్స్ వ్యాఖ్యలపై మైక్రోసాఫ్ట్ కౌంటర్, కేవలం ఒక్కశాతం మాత్రమే

టీచర్‌పై కాల్పులు జరిపిన 6 ఏళ్ల బాలుడు.. పోలీసులు రాగానే మరింత తెగించి

ఉక్రెయిన్ బస్టాప్‌పై రష్యా బాంబుల వర్షం.. 33 మంది మృతి!

ట్రంప్‌కు బంగారు విగ్రహం.. కానీ, బట్టల్లేకుండా.. ఏందయ్యా ఇది?

కెనడా రచయిత్రి ఆన్ కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం

చమురు బాంబు పేల్చిన ట్రంప్.. పతనమైన స్టాక్‌మార్కెట్లు, ఇంతకీ ట్రంప్ ఏమన్నారు?

Big Stories

Advertisement
×