Netanyahu: గాజాపై ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో ఇప్పటి వరకు వేలాది మంది మరణించగా ఎంతో మంది గాయాలపాలయ్యారు. మరెంతో మంది నిరాశ్రయులయ్యారు. ఇదిలా ఉంటే గాజాలో కాల్పుల విరమణపై ఇజ్రాయిల్ ప్రధాని నేతహ్యూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా కాల్పుల విరమణపై హమాస్‌తో చర్చలకు తాము సిద్ధం అని ఆ దేశ ప్రధాని వెల్లడించారు.
అయితే ఈ ప్రకటనపై హమాస్ ఇంత వరకు స్పందించలేదు. ఇజ్రాయిల్ హమాస్ మధ్య ఆగస్టు 15 వ తేదీన చర్చలు ఉండే అవకాశం ఉన్నట్లు మధ్య వర్తిత్వం వహిస్తున్న 3 దేశాలు.. అమెరికా, కైరో, ఈజిప్టు తెలిపాయి. ఆలస్యం చేయకుండా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసే చర్చలు జరపాలని హమాస్ తో పాటు ఇజ్రాయిల్‌కు ఈ మూడు దేశాలు పిలుపునిచ్చాయి. హమాస్ చీఫ్ హత్యకు ఇజ్రాయిల్ గూఢచర్య సంస్థ కారణమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌తో చర్చలకు హమాస్ అంగీకారం తెలుపుతుందా లేదా అన్న దానిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్‌పై పాలస్తీనాలోని గాజా కేంద్రంగా పని చేసే తీవ్ర వాద సంస్థ మెరుపు దాడి చేసి వందల మందిని ప్రాణాలు పోవడానికి కారణం అయింది. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయిల్ కాల్పుల విరమణ పాటించడానికి తమ దేశం నుంచి బంధీలుగా తీసుకువెళ్లిన వారిని హమాస్ విడుదల చేయాలని షరతు విధించింది.