Dubai: ఫ్లై దుబాయ్ ఎయిర్‌లైన్స్ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 180 మందిని కాపాడిన పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ నెతన్యాహు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి. కెప్టెన్ స్మిత్ మచ్చర్ నిజమైన హీరోగా వర్ణిస్తున్నారు. ఇంతకీ స్మిత్ మచ్చర్ ఇండియాకి చెందిన పైలట్.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ప్లై దుబాయ్ ఎయిర్ లైన్‌కు చెందిన విమానాన్ని బుధవారం అర్ధరాత్రి కూల్చివేసేందుకు కో-పైలట్ ప్రయత్నించాడు. దాన్ని పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో కో-పైలట్ నుంచి కత్తిపోట్లకు గురయ్యాడు. విమానం కెప్టెన్ భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ప్రాణాలకు తెగించి రక్తం కారుతున్నా, ఏ మాత్రం లెక్క చేయకుండా కో-పైలట్‌ని అడ్డుకున్నారు. పైలట్ స్మిత్ మచ్చర్ ని ఇజ్రాయెల్ పీఎం బెంబిమన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. స్మిత్ నిజమైన హీరోగా వర్ణించారు.
కెప్టెన్ అసాధారణ ధైర్యసాహసాలకు తాను సెల్యూట్ చేస్తున్నట్లు ఇజ్రాయల్ పీఎం నెతన్యాహు ఎక్స్‌లో రాశారు. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ పోరాటం కొనసాగించారని, ఇజ్రాయెల్ పౌరులు, ఇతర దేశాలకు చెందిన 174 మంది ప్రాణాలను కాపాడారని ప్రస్తావించారు. కెప్టెన్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పీఎం నెతన్యాహూతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలా అన్నారని ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు రాసుకొచ్చాయి. పైలట్ అత్యుత్తమ ప్రదర్శన చేశారని, అతడ్ని హీరోగా వర్ణించారు. పైలట్ తలుపు తెరిచి వెనక్కి పడిపోయి సహాయం కోసం కేకలు వేశాడని గుర్తు చేశారు. కో-పైలట్ బహుశా ఒక ఉగ్రవాది లేదా ఏదైనా పిచ్చివాడై ఉంటాడని, అందుకే పైలట్‌ను కత్తితో పొడిచాడని అనిపిస్తోందని చెప్పుకొచ్చారు.
ప్లై దుబాయ్ విమానం పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఎవరు? గుజరాతీ మూలాలున్న ఒక భారతీయుడు. వాణిజ్య విమానయాన రంగంలో పదేళ్ల అనుభవం ఆయన సొంతం. 2022, జూన్‌లో ఫ్లైదుబాయ్‌లో డైరెక్ట్ కెప్టెన్‌గా చేరారు. అంతకుముందు ఆయన జూన్ 2011 నుండి 2022 వరకు దాదాపు 11 సంవత్సరాలు స్పైస్‌జెట్‌లో పని చేశారు. బోయింగ్ 737 విమానంలో నిపుణుడు కూడా. భద్రత, నిబంధనలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇతర పైలట్లకు మార్గదర్శకత్వం వహించారు. ఆయన వెలింకార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీని పొందారు. అతని సోదరుడు ఇటీవల ఫ్లైదుబాయ్‌లో చేరాడు.
ఫ్లైదుబాయ్ కథనం ప్రకారం.. బుధవారం ఉదయం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న FZ 1073 నెంబర్ గల విమానం బయలుదేరింది. విమానం 32 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఫ్లైట్ డెక్‌లో పైలట్ స్మిత్ మచ్చర్- ఒమన్‌కు చెందిన కో-పైలట్ మధ్య వాగ్వాదం చెలరేగింది. విమానాన్ని కూల్చివేయాలని కో-పైలట్ ప్రయత్నం చేశాడు. వీరిద్దరి మధ్య పెనుగులాటలో విమానం ఒక్కసారిగా 32 వేల అడుగుల నుంచి 16 వేల అడుగులకు చేరింది. ఈ క్రమంలో విమానం హైజాక్ అంటూ మేసెజ్ వచ్చింది. అందులోని 174 మంది ప్రయాణికుల్లో ఒకటే భయం.
దాదాపు 100 మంది వరకు ఇజ్రాయెల్‌కు చెందిన పౌరులు, అందులోని పైలట్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కో-పైలట్.. కెప్టెన్ స్మిత్‌ని పలుమార్లు కత్తితో పొడిచాడు. విమానం కూల్చివేయాలని ప్రయత్నం సమయంలో కెప్టెన్ స్మిత.. డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులను అలర్ట్ చేశారు. దీంతో ఇజ్రాయెల్ పైలట్లు రంగంలోకి దిగి కో-పైలట్‌ని అదుపులోకి తీసుకున్నారు. చివరకు పైలట్లు.. ఇజ్రాయెల్‌కు సమాచారం ఇవ్వడంతో ఆ దేశ విమానాలు రంగంలోకి దిగాయి. చివరకు వారి సాయంతో పైదుబాయ్ విమానాన్ని సౌదీ అరేబియాలోని సైనిక స్థావరంలో ల్యాండ్ అయ్యింది. వెంటనే కో-పైలట్‌ను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. కెప్టెన్ స్మిత్ మచార్‌ను ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం అతడు కోలుకున్నట్లు తెలుస్తోంది.
My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air…
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) September 30, 2026