E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode October 1st ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు తన మనసులో మాట చెప్పిన సామ్రాట్ 

Ninnu kori Serial Today Episode October 1st ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు తన మనసులో మాట చెప్పిన సామ్రాట్ 
Advertisement

Ninnu kori serial today Episode:  అసలు బావా మరదళ్లు ఎలా ఉంటారో చెప్పమని సామ్రాట్‌ అడిగితే ఎలా చెప్పను మీకు అదొక మధురానుభూతి అంటూ చంద్ర తనకు తన బావతో ఉన్న రిలేషన్‌.. జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్‌ చెప్తుంది. కానీ నువ్వు చెప్తుంటే అద నాకెలా తెలుస్తుంది అని సామ్రాట్ అడిగితే.. నేను చెప్పే కథలో నా బావ ప్లేస్‌లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి అంటూ చెప్పి మరదలి ప్లేస్‌ లో నన్ను ఊహించుకోమని చెప్పలేను బావ అని మనసులో అనుకుంటూ శ్రీజను ఊహించుకోండి అంటూ  బాధపడుతూ చెప్పడం మొదలు పెడుతుంది. సామ్రాట్ తనను తాను ఊహించుకుంటాడు. కానీ శ్రీజ  ప్లేస్‌లో తన ఊహల్లో చంద్ర వస్తుంది. చంద్ర ఊహించుకున్నారా అని అడిగితే ఊహించుకున్నాను కానీ నా ఊహల్లో శ్రీజ రాలేదు నువ్వు వచ్చావు అని చెప్తాడు.

ఎందుకలా జరిగింతో తెలియదు కానీ నాకు కనిపించింది నువ్వే చంద్ర అంటూ చెప్పగానే.. దానికి కారణం నీ గుండె లోతుల్లో నీ మీద నీకున్న ప్రేమే బావ అని మనసులో ఎమోషనల్ అవుతుంది. బయటకు మాత్రం నన్ను ఎలా ఊహించుకుంటారు నా పర్మిషన్‌ లేకుండా అంటూ వెళ్లిపోతుంది. సామ్రాట్‌ ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్తుంటే మదన్‌ చూసి ఏంటి ఆలోచిస్తున్నాడు అనుకుని దగ్గరకు వెళ్లి అడిగితే చంద్ర తనకు బావ ఉన్నాడని ఎప్పుడే చెప్పలేదని ఎమోషనల్ అవుతుంటాడు. చంద్రతో జరిగిన విషయం మొత్తం చెప్తాడు. చంద్ర చెప్తూ ఉంటే.. నేను ఊహించుకున్నప్పుడు మాత్రం నా మరదలు ప్లేస్‌లో శ్రీజ కనిపించలేదు చంద్రే కనిపించింది. చంద్రకు బావ ఉన్నాడని చెప్పినా నేను అలా ఊహించుకోకూడదు కదా అంటూ ఫీలవుతాడు.

Advertisement

అయినా చంద్రకు బావ ఉంటే ఏంటి..? లేకుంటే ఏంటి..? అంటూ మదన్‌ అడిగితే.. ఇలా చెప్పొచ్చో లేదో మదన్‌ నేను చంద్రకు అట్రాక్ట్‌ అవుతున్నాను కానీ తనకు బావ ఉన్నాడు అని తెలిసినా చంద్రకు దగ్గర కావడం కరెక్టేనా..? నేను ఒకరిని బాధపెడుతూ ఇంకొకరి కోసం బాధపడుతున్నాను ఇది కరెక్టేనా..? నువ్వే ఒక ఫ్రెండ్‌గా చెప్పు మదన్‌ అంటూ అడగ్గానే.. చంద్రకు అసలు బావే లేడు.. మిమ్మల్ని ఆవిడ ఆట పట్టించారు అంటూ చెప్పగానే.. ఎందుకు అలా చెప్పారు..? అంటూ సామ్రాట్‌ అడిగితే ఆవిడ కూడా మీకు కనెక్ట్‌ అయ్యారు. కాకపోతే శ్రీజ గురించి ఆలోచిస్తుంది. అందుకే అలా బావ ఉన్నారని అబద్దం చెప్పారు అంటూ మదన్‌ చెప్పగానే.. ఈ సిచ్యుయేషన్‌ నుంచి ఎలా బయట పడాలో అర్థం కావడం లేదని సామ్రాట్ ఆలోచిస్తుంటే.. మదన్‌ సామ్రాట్‌ను మీ మనసు చెప్పినట్టు ఫాలో అవ్వండి మీకు మీరుగా ఒక క్లారిటీ తెచ్చుకోండి అంటూ చెప్పి వెళ్లిపోతాడు మదన్‌.

దాక్షాయణి తన రూంలో బట్టలు సర్దుతుంటే చంద్ర వెళ్తుంది. అల్మారాలో ఉన్న సామ్రాట్‌ చిన్నప్పటి ఫోటో చూసి ఎవరిది అని అడుగుతుంది. దాక్షాయణి ఫోటో తీసుకుని చూస్తూ.. నవ్వుతూ.. సామ్రాట్‌ గురించి చిన్నప్పుడు జరిగిన విషయాల గురించి చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ ఒక్కరోజు నేను చెప్పినా వినకుండా వెళ్లిపోయాడు తర్వాత గతం మర్చిపోయి వచ్చాడు అంటూ దాక్షాయణి ప్లాష్‌బ్యాక్‌ గుర్తు చేసుకుంటుంది. ప్లాష్‌బ్యాక్‌లో సామ్రాట్‌కు దాక్షాయణి గురించి నిజం తెలిసిన విషయం గుర్తు చేసుకుంటుంది. చంద్రతో మాత్రం అబద్దం చెప్తుంది. ఆ వివరాలు తెలుసుకుంటే సామ్రాట్‌కు హాని చేసే వారి గురించి తెలుసుకోవాలని సామ్రాట్‌ మీద అటాక్‌ చేసిందెవరో మీకు తెలుసా అని చంద్ర అడిగితే.. దాక్షాయణి తనకు తెలియదని అంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన సామ్రాట్‌, చంద్రను తీసుకుని బయటకు వెళ్తాడు. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య ఆల్ హ్యాపీ.. డ్యాన్స్ లతో రచ్చ రచ్చ.. భద్ర కీలక నిర్ణయం..?

Intinti Ramayanam Today Episode: పార్వతి కోసం కన్నీళ్లు.. పల్లవి గురించి నిజం బయటపడిందా? అవనికి మరో సమస్య..

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వొద్దు

విష్ణుప్రియ కొత్త అవతారం.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవాల్సిందే!

ఈ వారం డబుల్ ఎలిమినేషన్?ఆ ఇద్దరే టార్గెట్!

నా మొదటి లక్ష్యం అదే.. నిజాలు బయటకొస్తాయ్ – యూట్యూబర్ నందన!

బిగ్ బాస్ 10.. ఈ వారం నామినేషన్ లోకి 9మంది.. మరి డేంజర్ జోన్ లో?

Big Stories

Advertisement
×