E-Paper
Advertisement

కుప్పకూలిన హెలికాఫ్టర్.. వ్యాపారవేత్తతోపాటు ఆరుగురు మృతి, జింబాబ్వేలో ఘటన

కుప్పకూలిన హెలికాఫ్టర్.. వ్యాపారవేత్తతోపాటు ఆరుగురు మృతి,  జింబాబ్వేలో ఘటన
Advertisement

Helicopter crash: బస్సుల మాదిరిగా విమానాలు, హెలికాఫ్టర్ల ఘటనలు తీవ్రమవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన జింబాబ్వేలో చోటు చేసుకుంది. మారోండెరా ప్రాంతంలో ఆరుగురితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మృతుల్లో 43 ఏళ్ల వ్యాపారవేత్త విక్నెల్ చివాయో ఫ్యామిలీ ఉంది.

జింబాబ్వేలో ఘరో ప్రమాదం

జింబాబ్వేలోని గ్రామీణ ప్రాంతం మరోండెరాలో ఆరుగురు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఆ దేశ రాజధాని హరారేకు ఆగ్నేయంగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అందులోని ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, అతని భార్య లూసీ ముటెకే కూడా ఉన్నారు. వీరితోపాటు మరో ఇద్దరు ప్రయాణికులు,ఇద్దరు సిబ్బంది ఉన్నారు.

కుప్పకూలిన హెలికాఫ్టర్.. వ్యాపారవేత్తతోపాటు ఆరుగురు మృతి

Advertisement

వ్యాపారవేత్త విక్నెల్ ఆదేశ అధ్యక్షుడు ఎమ్మర్సన్ మ్నాంగాగ్వాకు సన్నిహితుడిగా చెబుతున్నారు. ఘటన గురించి తెలియగానే పోలీసులు-సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు బృందాలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తారు. ఇక వ్యాపారవేత్త విక్నెల్ చివాయో ఇంధన -మౌలిక సదుపాయాల కంపెనీ ఇంట్రాట్రెక్ జింబాబ్వే అనే సంస్థ వ్యవస్థాపకుడు.

మంటల్లోనే వారంతా కాలిపోయారు-పోలీసులు

గ్వాండా సోలార్ ప్రాజెక్ట్ వంటి ప్రభుత్వ కాంట్రాక్టులను దక్కించుకోవడంతో చివాయో వార్తల్లోకి వచ్చారు. తన విలాసవంతమైన జీవనశైలికి, ఖరీదైన కార్లు, విలాసవంతమైన హెలికాప్టర్లతో ట్రావెల్ చేస్తూ ఆయా ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసేవారు. చివాయో వ్యాపార, రాజకీయ సంబంధాలపై తరచుగా ప్రశ్నలు తలెత్తాయి. అధ్యక్షుడు మ్నాంగాగ్వాతో జరిగిన సమావేశంలో ఫోటోలు, వీడియోలను షేర్ చేశాడు కూడా. వ్యాపారవేత్త చివాయో.. ప్రముఖులకు, చర్చి నాయకులకు, రాజకీయ నాయకులకు ఖరీదైన వాహనాలు, నగదు బహుమతులు ఇచ్చేవారనే ప్రచారం ఉంది.

Advertisement

ALSO READ: విమానానికి హైజాక్ హెచ్చరికలు.. 2 నిమిషాల్లో 17,400 అడుగులు, పైలట్ల మధ్య ఘర్షణతో

Related News

ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ ఘటన.. 180 మందిని కాపాడిన కెప్టెన్ స్మిత్ మనోడే, ఇజ్రాయెల్ పీఎం, ట్రంప్ ప్రశంసలు

విమానానికి హైజాక్ హెచ్చరికలు.. 2 నిమిషాల్లో 17,400 అడుగులు, పైలట్ల మధ్య ఘర్షణతో..

భారతీయులకు ట్రంప్ సర్కార్ షాక్.. EB-5 గ్రీన్‌‌కార్డ్ ఫీజులు భారీగా, నవంబర్ నుంచి అమల్లోకి

రష్యాలో కుప్పకూలిన బాంబర్ విమానం.. ఆరుగురు సైనికులు దుర్మరణం

టారిఫ్‌ల దెబ్బకు దిగొచ్చిన ఎస్సార్? అమెరికాలోనే భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు!

పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన.. బలూచ్ మహిళా కమాండోలు.. ఫస్ట్ అటాక్‌లోనే 9 మంది మృతి!

ఖమేనీ అంతం తర్వాత కూడా లొంగని ఇరాన్.. ట్రంప్ వేసిన ప్లాన్ ఎక్కడ తప్పింది?

Big Stories

Advertisement
×