Illu Illalu Pillalu Today Episode October1st:ప్రేమ కాళ్లు కడిగి కన్యాదానం చేస్తేనే పెళ్లవుతుంది కదా అని బాధ పడిపోతూ ఉంటుంది సేన చెప్పిన మాట విని ఇప్పుడు కన్యాదానం ఎవరు చేస్తారు అని అనుకుంటూ ఉండగా తిరుపతి నేను కూడా బాబాయిని అంటే.. కన్న తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిని కాబట్టి నేనే కాల్లు కడిగి కన్యాదానం చేస్తానని అంటాడు. ఇక ప్రేమ ధీరజ్పెళ్లి పీటల మీద కూర్చోగానే తిరుపతి సుకన్య ఇద్దరు కూడా ప్రేమకు కన్యాదానం చేస్తారు. ఈ సీను ఎపిసోడ్కి హైలెట్ గా నిలుస్తుంది. ఇద్దరూ చాలా సంతోషంగా తమ పెళ్లిని మరోసారి చేసుకుంటారు ప్రేమ ధీరజ్లు. ఇకపోతే ప్రేమ ధీరజ్ పెళ్లి అవుతుంది అని ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మొత్తానికి ఈ పెళ్లి చాలా గ్రాండ్ గా జరగడంతో మళ్లీ పెళ్లి చేసుకున్నారు అని అందరూ కూడా సంతోషంగా ఉంటారు.
కామాక్షి ఆడబిడ్డ కట్నం ఇవ్వాల్సిందే అంటూ వాళ్ళ ఇంట్లోకి రాదు అనే పెద్ద రచ్చ రచ్చ చేస్తుంది. ఆడబిడ్డ కట్నం అనేది హక్కు కాబట్టి మీరు మాకు ఇవ్వాల్సిందే అని ముందుకేసి కూర్చుంటుంది. అందరూ కూడా తనని ఎంతగా అంటున్న కూడా అసలు వినకుండా తన మాట తనది అన్నట్టుగా ఉంటుంది. ఇక మొత్తానికి హారతి ఇచ్చి లోపలికి తీసుకుని వచ్చేటప్పుడు అంతా కలిపి ప్రేమ ధీరజ్ లను సరదాగా ఆట పట్టిస్తారు.. ఇక మొత్తానికి ప్రేమ వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వచ్చినప్పుడు ఆడపడుచు కట్నం అని అడగగానే విశ్వం ఆడపడుచు కట్నం నేనిస్తాను అని ఇస్తాడు. అంత కామాక్షి చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేమ ధీరజ్లు ఒకరికొకరు పేర్లు చెప్పుకునే లోపలికి రావాలి అని ఇద్దరు ఆడపడుచులు కూడా సరదాగా ఆట పట్టిస్తారు ఈ సీను ఎపిసోడ్కి మరో హైలెట్గా నిలుస్తుంది. అందరూ సరదాగా ఉంటే ప్రేమ శ్రీవల్లి మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నర్మదా ధీరజ్ ప్రేమలో పెళ్లి అయ్యేంతవరకు నీ పని సైలెంట్ గా చేసుకో లేదంటే ఆ తర్వాత నేను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని కంగారు పడిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..
రామరాజు ఇంట్లోకి ప్రేమ అడుగుపెట్టగానే ఇంట్లో దీపం పెట్టాలి అని రేవతి చెప్తుంది. ఇక ప్రేమ వెంటనే దీపం పెట్టిన తర్వాత ఈ ఇండ్లు నీది అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు అని రేవతి అంటుంది. ఇక వెంటనే ఒంటరిగా వెళ్ళిన ప్రేమ రచ్చ రచ్చ చూస్తూ ప్రేమ డాన్స్ చూసి అందరూ ఒక్కసారి షాక్ అవుతారు. ఇక నర్మదా ప్రియమణి పట్టుకుని ఏంటి ప్రేమ ఇదంతా చిన్న పిల్లలాగా చేస్తున్నావు అని అడుగుతుంది. అత్త నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాను నా ఇంట్లోకి మళ్లీ నేను వచ్చేసాను అని ప్రేమ అంటుంది. అయితే ప్రేమ మాత్రం అస్సలు వినకుండా రచ్చ రచ్చ చేస్తుంది. నేను మళ్ళీ నా మొగుడుతున్న ఇంటికి వచ్చేసాను అని హంగామా మొదలు పెడుతుంది. అయితే ఇటు ధీరజ్ అటు ప్రేమ ఇద్దరూ అందరితో కలిసి సరదాగా డాన్స్ చేయడం ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. అయితే శ్రీవల్లి మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ప్రేమ ఇంట్లోకి వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా నన్ను బయటికి పంపిస్తుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.
ఆనందరావు నొప్పులతో తెగ బాధ పడిపోతూ ఉంటాడు. అయితే భాగ్యం వీళ్లిద్దరు కాపురాలు ఏమో కానీ ఆ చింతామణి నీకన్నా స్ట్రాంగ్ ఇలా కొట్టింది ఏంటి భాగ్యం ఒళ్లంతా పులిసిపోయింది ఇడ్లీ మీద బట్టర్ వేసుకున్నట్లుగా ఉన్న నా ఒంటిని కుమ్మేసింది అంటూ బాధపడిపోతూ ఉంటాడు. అవునండి వీళ్ళిద్దరూ కాపురాని నిలబెట్టడానికి మనం ఇలా కొల్లగొడిపించుకోవాల్సి వస్తుంది అంటూ భాగ్యం ఉంటుంది. అయితే అసలు ఫోన్ సౌండ్ వినగానే ఆనందరావు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే అమ్మడు ఫోన్ చేసింది అని భాగ్యం చెప్పగానే.. ఏంటి అమ్మడు చెప్పు అని అడుగుతుంది భాగ్యం కానీ సుకన్య అత్త నేను ఈ ఇంట్లో సెటిలైపోయాను అని చెప్పగానే మీరిద్దరినీ అక్కడ స్ట్రాంగ్ గా సెటిల్ చేసిందికు మేమిద్దరం ఇక్కడ దెబ్బలు తింటున్నాము అని భాగ్యం అంటుంది. అసలు ఏంటి అమ్మ నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్ నా బొంద హ్యాపీగా ఉన్నాను ఆ నర్మదా నన్ను ఎప్పుడు ఇంట్లో నుంచి పంపిద్దామని ఎదురుచూస్తుంది అలాంటిది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.
నర్మదా ఇంటికి తగ్గ కోడలు.. అయితే తనవల్లి మళ్లీ టీఆర్ఎస్ పెళ్లి జరిగింది అంటూ రామరాజు నర్మదపై ప్రశంసలు కురిపిస్తాడు. అంతే కాదు వేదవతి నర్మదా మాట్లాడుకుంటూ ఉండగా..నువ్వు నిజంగానే గ్రేట్ బుజ్జమ్మ మంచి కోడల్ని సెలెక్ట్ చేసుకున్నావు అంటూ రామరాజు అనడంతో బుజ్జమ్మ నన్ను బుజ్జమ్మ అన్నాడు అంటూ డాన్సులు వేస్తూ గంతులు వేస్తూ వస్తుంది. ఏమి గవర్నమెంట్ కోడలు ఇదంతా నీ వల్లే జరిగింది కాబట్టి నువ్వే దీనికి కారణం అని నర్మదకు వేదవతి ముద్దుల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ ముద్దులు నాకు ఇవ్వడం ఎందుకు మీ ఆయన వెళ్తున్నారు కదా మీ ఆయనకి ఇవ్వు అనేసి నర్మదా అనగానే వేదవతి అవును కదా వెళ్లి మా ఆయనకి ఈ ముద్దులు ఇస్తాను అంటూ సిగ్గు పడిపోతూ ఉంటుంది.
ప్రేమని గదిలోకి తీసుకెళ్లిన రేవతి తను రెడీ అయ్యి వచ్చిన తర్వాత నువ్వు నీ భర్తతో చాలా మర్యాదగా సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము ఈ విషయాన్ని నేను గుర్తు పెట్టుకోవాలి అని ప్రేమకు రేవతి క్లాస్ పీకుతుంది. అయితే ధీరజ్ ఏదన్నా కూడా ఏమీ పట్టించుకోవద్దు మొగుడు పెళ్ళాలు అంటే గొడవల కన్నా సరసాలు ఎక్కువ ఉండాలి అంటూ శారదా అమ్మ కూడా చెప్పడంతో ప్రేమ తెగ సిగ్గు పడిపోతుంది. నీ మొగుడిని నీ కొంగును కట్టేసుకో ఆడదానికి లొంగని మగాడు ఉండడు కదా నువ్వు అలా ధీరజ్ ని నీ గుప్పెట్లో పెట్టుకో అప్పుడు మీరు ఇద్దరు సంతోషంగా ఉంటారు అని శారదమ్మ అంటుంది. అప్పుడే ధీరస్ లోపలికి రావడంతో మేము వెళ్ళిపోతున్నాం బాబు మీరిద్దరూ సంతోషంగా ఉండండి అంటూ శారదమ్మ అంటుంద.. ఏంటి మీ వాళ్ళు నీకు ఏదో గుసగుసలు చెప్తున్నారు అని ధీరజ్ అడుగుతాడు. ఈ విషయాలన్నీ నేను రాత్రి చెప్తాను అని ప్రేమ సిగ్గు పడిపోతుంది. అటు భద్ర మాత్రం చీకటి గదిలోంచి బయటికి రాను అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..