BigTV English

Earthquake: సముద్రంలో భూకంపం.. సునామీ హెచ్చరికలు.. అలర్ట్ అలర్ట్..

Earthquake: సముద్రంలో భూకంపం.. సునామీ హెచ్చరికలు.. అలర్ట్ అలర్ట్..

Earthquake: భారీ భూకంపం ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ప్రజల హాహాకారాలు మారుమ్రోగాయి. ఏమి జరుగుతుందో తెలియని ఆందోళన ఓ వైపు, ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆతురత మరో వైపు. ఇలా ఆ ప్రాంతం అస్తవ్యస్తంగా కనిపించింది. అంతలోనే మరో పెను బాంబు లాంటి వార్త అక్కడి ప్రజల చెవిలో పడింది. అదే సునామీ. ఇలా భూకంపం వచ్చి ప్రజలు పరుగులు తీస్తుంటే, మళ్లీ అదే ప్రాంతానికి సునామీ హెచ్చరిక రావడం విశేషం. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం చిలీ దేశంలో నెలకొంది.


చిలీ, అర్జెంటీనా తీర ప్రాంతాలకు సమీపంగా ఉన్న ప్రాంతంలో శుక్రవారం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం డ్రేక్ ప్యాసేజ్‌లో, ఉషుయా అర్జెంటీనా నగరానికి దక్షిణంగా 173 మైళ్ల దూరంలో, సముద్ర మట్టానికి 6.2 మైళ్ల లోతులో నమోదైంది. దీనితో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితులలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.

సముద్రంలో భూకంపం..
చిలీ ప్రాంతంలో గల సముద్ర మట్టానికి 6.2 మైళ్ళ లోతులో భూకంపం రావడం విశేషం. దీనితో భూభాగంలో కూడా దాని ప్రభావం కనిపించింది. ప్రజలు తమ తమ పనుల్లో ఉండగా, భూకంప ప్రభావం కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు.


సునామీ హెచ్చరిక..
చిలీలోని మగల్లానెస్ ప్రాంతం, చిలీ యాంటార్కిటిక్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను తక్షణమే తీర ప్రాంతాల నుండి 30 మీటర్ల ఎత్తు ఉన్న భద్రతా ప్రాంతాలకు తరలిపోవాలని ప్రభుత్వం సూచించింది. ఆదేశ భద్రతా బలగాలు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అర్జెంటీనా లోని టియెర్రా డెల్ ఫ్యూగో ప్రావిన్స్‌లోని బీగల్ ఛానెల్‌లో పడవలను, నౌకలను భూకంప ప్రభావంతో కనీసం మూడు గంటల పాటు నిలిపివేశారు.

ప్రభుత్వం ఏమి చెప్పిందంటే..
చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ ఈ పరిస్థితిపై మాట్లాడుతూ.. ప్రజలను శాంతంగా ఉండమని, అధికారులకు సూచనలను పాటించమని కోరారు. అత్యవసర పరిస్థితులకు అవసరమైన అన్ని వనరులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పుంటా అరేనాస్ నగరంలో నివాసితులు భద్రతా ప్రాంతాలకు తరలించబడ్డారు. ఉషుయా నగరంలో భూకంపం స్పష్టంగా కనిపించినప్పటికీ, అదృష్టవశాత్తు ఎటువంటి నష్టం జరగలేదు.

Also Read: Indonesia Rituals: శవాలతో మాటలు, పలకరింపులు.. వీరెక్కడి మనుషులు బాబోయ్..

సునామీ హెచ్చరిక..
చిలీ నౌకాదళం ప్రకారం, భూకంపం కారణంగా ఏర్పడిన అలలు ఒక గంటలో యాంటార్కిటికా తీరాలను చేరవచ్చని, దూర ప్రాంతాలకు 12 గంటల వరకు సమయం పడవచ్చని ఆ దేశం హెచ్చరించింది. ప్రజలను శాంతంగా ఉండమని, అధికారుల సూచనలను పాటించమని సూచిస్తున్నారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Related News

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

Big Stories

×