Rohit Sharma Century Celebration: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య గౌహతి వేదికగా నిన్న జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ ఇరగదీసాడు. మొదటి మ్యాచ్ లో 30 పరుగులకే వెళ్లిన రోహిత్ శర్మ, నిన్నటి మ్యాచ్ లో మాత్రం అదిరిపోయే సెంచరీ సాధించాడు. సెంచరీ చేసిన నేపథ్యంలో చిన్నపాటి డాన్స్ చేస్తూ రోహిత్ శర్మ సరికొత్త సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే సెంచరీ చేసిన వెంటనే రోహిత్ శర్మను జేడెన్ సీల్స్ అనే వెస్టిండీస్ బౌలర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ తరహాలోనే సెలబ్రేషన్స్ చేస్తూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన కెప్టెన్ గిల్, విరాట్ కోహ్లీ… సదరు వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ ను ఒక ఆట ఆడుతున్నారు. లెఫ్టు రైటు వాయించేశారు. రోహిత్ శర్మ జోలికి వస్తే ఊరుకోబోమని బ్యాట్ తో సమాధానం ఇచ్చారు.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ గిల్ డబుల్ సెంచరీ చేయగా… ఈసారి రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు. 75 బంతుల్లో 101 పరుగులు సాధించాడు రోహిత్ శర్మ. ఇందులో 10 బౌండరీలతో పాటు ఆరు సిక్సర్లు ఉన్నాయి. 134 స్ట్రైక్ రేట్ తో ఇరగదీశాడు. ఈ క్రమంలో జైడెన్ సీల్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ (LBW) అయ్యాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలో పెవిలియన్ కు వెళ్తున్న రోహిత్ శర్మను ఉద్దేశించి అతని తరహాలోనే డ్యాన్స్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు జేడెన్ సీల్స్. అయితే తర్వాత ఓవర్ లోనే వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ ను కెప్టెన్ గిల్ తో పాటు విరాట్ కోహ్లీ చీల్చి చెండాడు. అతని ఓవర్లో ఏకంగా 25 పరుగులు పిండుకున్నారు. రోహిత్ శర్మ జోలికి వస్తే ఊరుకునేది లేదని మెసేజ్ పంపారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
గౌహతి వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో బిగ్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 405 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని 43.3 ఓవర్లలోనే ఫినిష్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది టీమిండియా. ఈ మ్యాచ్ లోనే కెప్టెన్ గిల్ డబుల్ సెంచరీ చేసి దుమ్ములేపాడు. చివరి వరకు ఉండి, మ్యాచ్ గెలిపించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్ టీమిండియా కైవసం అయింది.
HITMAN ROHIT SHARMA brings out a new way of celebration!!
Majestic Ton by grand old young man of India
Mumbai chaaa Raja naa baba India chaa Chaava Rohit Sharma
Eyes glued on his Lakshya 2027 World Cup!! pic.twitter.com/u0QtXZQF0K
— justacricketlover (@imkmalhotra) September 30, 2026
The only beautiful moment of the match:
Jayden Seales mocking 39 year old Rohit Sharma for his celebration 😂 pic.twitter.com/JyDqF52Bk7
— Troll cricket unlimitedd (@TUnlimitedd) September 30, 2026