E-Paper
Advertisement

బ్యాట్ల‌లో స్ప్రింగులు పెట్టుకుని గిల్, రోహిత్ శ‌ర్మ రెచ్చిపోయి, ఆడారు !

బ్యాట్ల‌లో స్ప్రింగులు పెట్టుకుని గిల్, రోహిత్ శ‌ర్మ రెచ్చిపోయి, ఆడారు !
Advertisement

Tanveer Ahmed On Rohit Gill Batting: టీమ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ గిల్ డబుల్ సెంచరీ చేయగా, రోహిత్ శర్మ సెంచరీతో ఇరగదీశాడు. అయితే ఈ ఇద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే… పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ గిల్ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ తమ బ్యాట్లలో స్ప్రింగ్ పెట్టుకొని ఆడారని బాంబు పేల్చాడు. అందుకే ఇలా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

405 పరుగుల టార్గెట్ ఉన్నప్పటికీ చేజింగ్ చేయడం అనుమానంగా మారిందని తెలిపారు. ఇద్దరి బ్యాచ్ లో స్ప్రింగులు కచ్చితంగా పెట్టి ఉంటారని… అందుకే వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించినట్లు ఆరోపణలు చేశారు. దీనిపైన కచ్చితంగా ఐసీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. టీమిండియా క్రికెటర్లు ఇలాగే ఆడుతూ వెళ్తుంటే… బౌలర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీంతో రోహిత్ శర్మతో పాటు గిల్ పై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

దమ్ముంటే పాకిస్తాన్ గడ్డపై సెంచరీలు చేయండి… తన్వీర్ అహ్మద్ సవాల్

Advertisement

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డే సందర్భంగా రోహిత్ శర్మతో పాటు కెప్టెన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. 74 బంతుల్లో రోహిత్ శర్మ సెంచరీ ఫినిష్ చేయగా… 133 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ గిల్ 223 పరుగులు చేసి దుమ్ము లేపాడు. దీంతో వెస్టిండీస్ విధించిన 405 పరుగుల టార్గెట్… చాలా చిన్నది అయిపోయింది. 43.3 ఓవర్లలోనే ఈ టార్గెట్ చేదించిన టీమిండియా… సిరీస్ కూడా కైవసం చేసుకుంది. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశవ్యాప్తంగా మొత్తం ఫ్లాట్ ట్రాక్స్ మాత్రమే తయారు చేశారని ఆగ్రహించారు. అందుకే టీమిండియా బ్యాటర్లు ఇలా రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మగతనం ఉంటే పాకిస్తాన్ గడ్డపై ఇలాంటి బ్యాటింగ్ చేయాలని సవాల్ విసిరారు.

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

బుమ్రా లేకపోతే టీమిండియాది చెత్త బౌలింగే

Advertisement

యార్కర్ల కింగ్ బుమ్రా లేకపోతే టీమిండియాది చెత్త బౌలింగ్ అని తన్వీర్ అహ్మద్ వెల్లడించారు. వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డే సందర్భంగా ఒక్కరు కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదని విమర్శలు చేశారు. ఓవర్ కు 10 పరుగుల చొప్పున సమర్పించుకున్నారని ఎద్దేవా చేశారు. బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ అలాగే భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళు ఉండగా అనవసరంగా బచ్చగాళ్ళను దించుతున్నారని సీరియస్ అయ్యారు.

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

Related News

ఒకే వ‌న్డేలో 800 ప‌రుగులా ? ఇవేం దిక్కుమాలిన పిచ్ లంటూ గంభీర్ సీరియ‌స్

రోహిత్ శర్మ సెంచరీ సెలెబ్రేషన్స్ పై విండీస్ బౌలర్ ట్రోలింగ్…ప్రతీకారం తీర్చుకున్న గిల్, కోహ్లీ

శుభ్‌మ‌న్ గిల్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచ‌రీ…హిస్ట‌రీలోనే రెండో ప్లేయ‌ర్ గా రికార్డ్

రోహిత్ శ‌ర్మ‌ సూప‌ర్ సెంచ‌రీ…12 వేల ప‌రుగుల క్ల‌బ్ లో హిట్ మ్యాన్, టీమిండియా విక్ట‌రీ

నమన్ ధీర్ క్యాచ్ పై వివాదం…బంతి నేలకు తగిలిందంటూ ఇంజమామ్ ఆరోపణలు

తన్వీర్ అహ్మాద్‌ను మెంటల్ ఆస్పత్రిలో వేయాలి…వాడికి కొంచెం కూడా బుర్రలేదు

దద్దమ్మలను పక్కకు పెట్టి, 2027 వరల్డ్ కప్ కోసం సంజును తీసుకోండి

Big Stories

Advertisement
×