రివ్యూ : గ్యాంబ్లర్స్ సినిమా
నటీనటులు: సంగీత్ శోభన్, ప్రశాంతి చారులింగా, రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్నా, సాయి శ్వేత, జస్వికా, భరణి శంకర్, మల్హోత్ర శివ, శివ రెడ్డి
దర్శకుడు: కెఎస్‌కె చైతన్య
నిర్మాతలు: సునీత, రాజ్‌కుమార్ బృందావనం
సంగీతం: శశాంక్ తిరుపతి
Gamblers Movie review : కెఎస్‌కె చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ‘గ్యాంబ్లర్స్’. ఇందులో సంగీత్ శోభన్, ప్రశాంతి చారులింగా, రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్నా, సాయి శ్వేత, జస్వికా, భరణి శంకర్, మల్హోత్ర శివ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతలుగా వ్యవహరించారు. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.
కథ
గ్యాంబ్లర్స్ సినిమా స్టోరీ ఒక రిమోట్ ఐలాండ్ లో జరిగే మిస్టరీ థ్రిల్లర్. సంగీత్ శోభన్ ఏంజెల్ అనే మెజీషియన్ పాత్రలో నటించాడు. ఈ పాత్ర మిస్టీరియస్‌గా ఉంటుంది. 100 కోట్ల ప్రైజ్ మనీ కోసం ఒక సీక్రెట్ గ్యాంబ్లింగ్ క్లబ్‌లో పోటీపడేందుకు కొంతమంది వ్యక్తులు ఈ ద్వీపానికి చేరుకుంటారు. కానీ ఆట మొదలైన తర్వాత ప్రతి పార్టిసిపెంట్ ఒక వ్యూహంతో అక్కడికి వచ్చారన్న విషయం తేటతెల్లం. ఆ ప్లాన్స్ అన్నింటినీ ఛీటింగ్ చేసి, గేమ్ ఆడడానికి ఉపయోగిస్తారు. ఈ ఆట క్రమంగా ఒక ప్రమాదకరమైన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ గా మారుతుంది. ఇందులో గన్ ఫైట్స్, మోసాలు, ఊహించని ట్విస్ట్ లు కూడా ఉంటాయి. చివరికి ఈ ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకుంటారు ? హీరో ఈ గేమ్ లో ఎటువంటి గ్యాంబ్లింగ్ చేస్తాడు ? ఈ నిర్మానుష్యమైన దీవిలో గ్యాంబ్లర్స్ ఏమౌతారు ? అనే విషయాలను మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
ఒక రిమోట్ ఐలాండ్ లో జరిగే గ్యాంబ్లింగ్ గేమ్ అనే కాన్సెప్ట్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఈ సెట్టింగ్ సినిమాకి ఒక ఫ్రెష్ ఫీల్‌ని ఇస్తుంది. తెలుగు సినిమాల్లో ఇలాంటి నోయిర్ థ్రిల్లర్ శైలి అరుదుగా కనిపిస్తుంది. సంగీత్ శోభన్ తన ఏంజెల్ పాత్రలో అద్భుతంగా నటించాడు. అతని చార్మ్, మిస్టీరియస్ వైబ్, కామెడీ టైమింగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణ. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల తర్వాత, ఈ చిత్రంలో అతను మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే మిగతా ఆర్టిస్టులు, ముఖ్యంగా ప్రశాంతి చారులింగా, రాకింగ్ రాకేష్ పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ప్రేమ్ సాగర్ సినిమాటోగ్రఫీ ద్వారా ద్వీపం మిస్టీరియస్ వాతావరణాన్ని అద్భుతంగా చూపించగలిగాడు. ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలో కొన్ని గ్లామర్ సన్నివేశాలు కథకు అనవసరంగా అనిపించాయి. శశాంక్ తిరుపతి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా ‘రాజా ఒక్కడు రాణి ఒక్కటి’ పాట సినిమాకి ఒక ఒపెరాటిక్ టెన్షన్‌ని జోడించింది.
కథలో ట్విస్ట్ లు ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల నీరసంగా సాగుతుంది. ముఖ్యంగా మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తాయి. అయితే రెండవ భాగంలో స్టోరీ పుంజుకుంటుంది.
ప్లస్ పాయింట్స్
గేమ్ సెట్టింగ్
సంగీత్ శోభన్ నటన
సినిమాటోగ్రఫీ
సంగీతం
మైనస్ పాయింట్స్
స్క్రీన్‌ప్లే
సపోర్టింగ్ రోల్స్
గ్లామర్ ఓవర్‌లోడ్
మొత్తానికి
సంగీత్ శోభన్ అభిమానులకు, థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారికి ఈ సినిమా వన్-టైమ్ వాచ్. కాకపోతే సాగదీసిన సీన్స్, ఓవర్ డోస్ గ్లామర్ చిరాకు పెడతాయి.
Gamblers Movie Rating : 1/5