Gundeninda GudiGantalu Today episode April 13th : నిన్నటి ఎపిసోడ్ లో.. కల్లు తాగి అందరు ఇంటికి వెళ్తారు. మనోజ్ ని అక్కడ కూర్చోబెడతారు. ప్రభావతి ఏమైందిరా వాడికి సోయ లేకుండా ఉన్నాడేంటి అనిఅడుగుతుంది. తాగొచ్చారా అని అంటే కళ్ళు తాగాడని బాలు చెప్తాడు. వాన్ని కూడా నీలాగే తయారు చేస్తున్నావా అని ప్రభావతి అరుస్తుంది. రోహిణి నువ్వంటే ఎలాగో తాగి అందర్నీ బాధ పెడుతున్నావ్ ఇప్పుడు మనోజ్ ని కూడా తాగుబోతుని చేయాలనుకుంటున్నావా అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది. బాలు మాత్రం మౌనంగా ఉంటాడు. మేక మావయ్య అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు అని మాణిక్యం ని అడిగితే, మాణిక్యం మాత్రం బాలుదే తప్పు.. మనజ్ వద్దని అన్నా బలవంతంగా తాగించాడని అడ్డంగా ఇరికిస్తాడు… బాలుని రోహిణి దారుణంగా తిడుతుంది. మనోజ్ కి మందు అలవాటు లేదని తెలుసు కదా నీలాగా పచ్చి తాగుబోతు లాగా చేద్దామని అనుకుంటున్నావా అని మరిదని కూడా చూడకుండా తిట్టేస్తుంది. ఇంట్లోని వాళ్లంతా తిడతారు. బాలు చేసిన పనికి అందరికి షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. బాలు మనోజ్ కు కావాలని తాగించాడని అందరు దారుణంగా తిడతారు. మజ్జిగను బలవంతంగా మనోజ్ నోట్లో పోస్తాడు. మనోజ్ మాత్రం మత్తు దిగకుండా ఇంకో పెగ్గు కావాలి ఇంకో బాటిల్ కావాలి అంటూ నానా రచ్చ చేస్తాడు. ఒక్కసారిగా మనోజ్ బాలు లాగా మారిపోతాడు. షీలా డార్లింగ్ నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అని భామను పట్టుకొని వింతగా మాట్లాడతాడు.. అదేవిధంగా అందరితోనూ అలాగే వాగుతూ ఉంటాడు. మందావతి బుద్ధిలేనివతి అంటూ బాలు లాగే అచ్చం తిడుతూ మాట్లాడతాడు.. ఇక రోహిణి, ఏంట్రా మందు ఒక్కరోజు తాగితేనే వాడిలాగా తయారయ్యావ్ అంటూ ప్రభావతి అడుగుతుంది. మనోజ్ మాత్రం పాలరమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం నన్ను వదిలేసి నువ్వు మలేషియాకి వెళ్ళిపోవు కదా అనేసి అంటాడు..
ఇక రోహిణి మాత్రం ఆ బాలు వల్ల ఇదంతా చేసింది ఆ బాలుకు చెప్తాను ఇప్పుడు అనేసి కోపంగా వెళుతుంది. బాలు రాజేష్ తో మాట్లాడటం విని షాక్ అవుతుంది.. మనోజ్ తో మందు తాగించింది బాలు కాదని తెలుసుకొని, మాణిక్యమని తెలిసి కొట్టడానికి తన రూమ్ కి వెళుతుంది. మాణిక్యం పై కోపంతో వెళ్లి నీళ్లు కొట్టి లేపుతుంది. నేను కాదు మనోజ్ కు తాగించింది అని అంటాడు. రోహిణి మాత్రం అతన్ని చితక్క కొడుతుంది. నువ్వు నీ పని చూసుకో అని అంటుంది.
ఇక బాలు ఆ మాణిక్యం గురించి బయట పెట్టాలని ప్లాణ్ చేస్తాడు. ఎలాగోలా రాజేష్ తో బాలు మాట్లాడటం రోహిణి వింటుంది. కచ్చితంగా ఈ బాలు అనుకున్నట్లు చేసేస్తాడు ఎలాగైనా ఈ మాణిక్యం ను వెంటనే పంపించాలని అనుకుంటుంది. రోజు ఉదయం అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు హాల్లోకి మాణిక్యం వస్తాడు. ఏమైంది అని అంటే ఏం కాలేదు ఒకసారి మీ మటన్ షాపు ఎక్కడుంది ఏ ఏరియాలో ఉందంటే మెయిన్ రోడ్డు మీద ఉంది కదా అనేసి అన్ని అడ్డంగా దొరికిపోతాడు. అయితే బాలు మాత్రం నువ్వు కచ్చితంగా మల్లేష్ నుంచి రాలేదు మటన్ కొట్టు నడుపుతున్న అని అర్థం అయిపోయింది ఏంటి నాటకం గురించి అని అడుగుతాడు రోహిణి అడ్డంగా దొరికిపోయిందని ఫీల్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తయిపోతుంది.. రేపటి ఎపిసోడ్ లో రోహిణి మలేషియా డ్రామా బయట పడుతుందేమో చూడాలి..