BigTV English

Increase In Agricultural land : ఆ దేశాల్లో పంటభూముల పెరుగుదల.. కారణమిదేనా..?

Increase In Agricultural land : ఆ దేశాల్లో పంటభూముల పెరుగుదల.. కారణమిదేనా..?

Increase In Agricultural land : గత ఐదు దశాబ్దాల్లోనే ప్రపంచ జనాభా రెట్టింపు అయింది. జనాభా సంఖ్య 800 కోట్లు దాటిపోయింది. దీంతో పాటే ఆహారోత్పత్తిని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. పశుసంపద, పంట భూముల పెంపు ద్వారా ఆహార కొరత లేకుండా చేసుకోగలుగుతున్నాం. అదనంగా భూమిని వినియోగంలోకి తీసుకురావడం, సేద్యపు భూముల విస్తరణ ప్రపంచ దేశాల్లో ఏకరీతిన ఉందా? ఓ సారి చూద్దాం.


21వ శతాబ్దం ఆరంభంలో ప్రపంచ సేద్యపు భూమి 1142 మిలియన్ హెక్టార్ల మేర విస్తరించింది. ఈ సాగుభూముల్లో కొంత భాగం నిరుపయోగం‌గా ఉండటం లేదంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కోల్పోవడమో జరిగింది. అలాగే ఇళ్లు, సాగు ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన వంటి అవసరాల కోసం మరికొంత భూమిని వదులుకోవాల్సి వచ్చింది. అన్నీ పోను కొత్తగా 9% మేర భూమిని మాత్రమే సాగులోకి తీసుకొచ్చినట్టు అంచనా.

2019 నాటికి అందుబాటులో ఉన్న పంట భూముల మొత్తం 1244 మిలియన్ హెక్టార్లు. వీటిలో 20 శాతం భూములు ఐరోపా, ఉత్తర ఆసియా, ఆగ్నేయాసియా దేశాల్లోనే విస్తరించి ఉన్నాయి. ప్రపంచ సేద్యపు భూముల్లో తక్కువ వాటా కలిగిన ఆఫ్రికా(17%), దక్షిణ అమెరికా(9%) దేశాల్లోనూ 2000 సంవత్సరం తర్వాత సాగుభూముల విస్తీర్ణం బాగా పెరిగింది. అర్జెంటీనా, బ్రెజిల్, ఉరుగ్వే వంటి దక్షిణ అమెరికా దేశాల్లో 2000-07 మధ్య పంట దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.


ఆధునిక వ్యవసాయ సాంకేతికత పద్ధతులతో పాటు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న సోయాబీన్స్ వంటి పంటలను సాగు చేయడమే ఇందుకు కారణాలని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆఫ్రికాలోనూ వ్యవసాయ భూముల విస్తీర్ణం 35 శాతం మేరపెరిగింది. ఆ దేశాలతో పాటు దక్షిణ అమెరికా, ఆసియాలో కొన్ని దేశాల్లో అడవుల నరికివేత కారణంగా అదనంగా భూమి సాగులోకి వచ్చింది. ఇలా పచ్చదనం అంతరించిన దరిమిలా ఆఫ్రికా దేశాల్లో 53.2 మిలియన్ హెక్టార్ల భూమి అదనంగా సాగులోకి రాగలిగింది. దక్షిణ అమెరికాలో 37.1 మిలియన్ హెక్టార్ల భూమి, ఆగ్నేయాసియాలో 7.5 మిలియన్ హెక్టార్ల భూమి సేద్యానికి అనువుగా మారింది.

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లో 3 మిలియన్ హెక్టార్లు, నార్త్ అండ్ సెంట్రల్ అమెరికా 1.8 మిలియన్ హెక్టార్లు, ఐరోపా-ఉత్తర ఆసియాలో 0.9 మిలియన్ హెక్టార్ల మేర సాగుభూమి అదనంగా అందుబాటులోకి వచ్చింది. వీటికి భిన్నంగా దక్షిణాసియా 1.6 మిలియన్ హెక్టార్ల పంట భూములను కోల్పోయింది.

Tags

Related News

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Big Stories

×