Also Read: Virat – Genelia :పెళ్లి పిల్లలు ఉన్నా తెలుగు హీరోయిన్ తో కోహ్లీ రొమాన్స్.. ఏకంగా లిఫ్టులోనే!
పెళ్లికి ముందే డేటింగ్ చేసిన రోహిత్ శర్మ
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ పెళ్లి కంటే ముందు ఆరు సంవత్సరాల పాటు తన భార్య రితిక సజ్దే ( Ritika Sajdeh)తో ప్రేమలో ఉన్నాడని స్వయంగా అతనే వెల్లడించారు. మాజీ టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ దంపతులు నిర్వహిస్తున్న… ఓ షో లో రోహిత్ శర్మ అలాగే ఆయన భార్య రితిక ఇద్దరు కూడా కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తన లైఫ్ స్టైల్, పర్సనల్ లైఫ్ గురించి మొత్తం వివరించారు.
హర్భజన్ సింగ్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చి… ఆకట్టుకున్నారు రోహిత్ శర్మ. అంతేకాదు రితిక సజ్దే ( Ritika Sajdeh)
తో పెళ్లి కంటే ముందు ఆరు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు. ఓ యాడ్ షూట్ సమయంలో రితికతో పరిచయం ఏర్పడిందని వెల్లడించాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత ప్రేమలో పడ్డామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పెళ్లి కంటే ముందు ఆరు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నామని కూడా వివరించాడు. అప్పుడు షాపింగ్లు అలాగే సినిమాలు అంటూ… బాగా తిరిగామని చెప్పుకొచ్చాడు. తన లక్కీ చార్ము, బిగ్గెస్ట్ సపోర్టర్ రితిక అంటూ వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మ. దీంతో తన భార్య రితిక గురించి టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రోహిత్ శర్మ దంపతులకు ఇద్దరు పిల్లలు
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ రితికను పెళ్లి చేసుకున్న తర్వాత… ఎంతో అన్యోన్యంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా… కలిసిమెలిసి ఉంటున్నారు. ఇక రోహిత్ శర్మ అలాగే రితిక దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఒక అమ్మాయి కాగా ఇటీవల ఒక అబ్బాయి కూడా రోహిత్ శర్మ దంపతులకు పుట్టారు. ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో రోహిత్ శర్మ ఉన్నాడు.