BigTV English

Blood Test Death Date Reveal: రక్త పరీక్షతో మీరు ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.. ఎలాగంటే..

Blood Test Death Date Reveal: రక్త పరీక్షతో మీరు ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.. ఎలాగంటే..

Blood Test Death Date Reveal| ప్రతి ఒక్కరికీ ఎక్కువ కాలం జీవించాలనే ఆశ ఉంటుంది. అలాగే ఎన్నాళ్లు బతుకుతాం? ఎప్పుడు చనిపోతాం? మనకు ఏ రోగాలు లేవు కదా? ఇలాంటి ఆలోచనలు అందరికీ సాధారణంగా ఎప్పుడో ఒకసారి కలుగుతాయి. ముఖ్యంగా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఇలాంటి అనుమానాలు ప్రతి మనిషినీ బాధిస్తాయి. ఇలాంటి ప్రశ్నలకు ఇప్పటిదాకా సరైన సమాధానాలు లేవు. కానీ ఇప్పుడు ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా.. ఒక వ్యక్తికి క్యాన్సర్ లేదా మతిమరపు వంటి ప్రధాన వ్యాధుల ప్రమాదాన్ని అంచనా వేయవచ్చని, ఏ అవయవాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయో తెలుసుకోవచ్చని ఒక కొత్త అధ్యయనం తెలిపింది. రానున్న 10 సంవత్సరాలలో ఎలాంటి జబ్బులు రాబోతున్నాయో కూడా ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. దీని ద్వారా ఒక మనిషి ఎంత కాలం తరువాత మరణిస్తాడనేది దాదాపు అంచనా వేయొచ్చుని ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. నమ్మడానికి కష్టంగా ఉంది కదా.. అది ఎలాగో వివరాలు చూద్దాం.


రక్త పరీక్ష ద్వారా భవిష్యత్తు ఆరోగ్యాన్ని అంచనా వేయడం
యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL) పరిశోధకులు.. ఈ అధ్యయనం ద్వారా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో రానున్న 20 సంవత్సరాలలో అవయవాలు దెబ్బతినే తీరును, 30 వేర్వేరు వ్యాధుల ప్రమాదాన్ని కేవలం ఒక రక్త పరీక్ష ద్వారా గుర్తించగలిగారు. ఈ పరీక్షల చేయడం ద్వారా నిర్దిష్ట అవయవాలకు సంబంధించి భవిష్యత్తులో రాబోయే సమస్యలను మాత్రమే కాకుండా.. అవి శరీరంలోని వేరే భాగాలలో సమస్యలను ఎలా సృష్టిస్తాయో కూడా తెలుసుకోవచ్చు.

హెల్సింకి యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నిపుణులు కలిసి చేసిన ఈ  అధ్యయనంలో 45 నుంచి 69 సంవత్సరాల వయస్సు గల 6,235 మంది వ్యక్తుల పాల్గొన్నారు. వీరి నుంచి రక్త ప్లాస్మా నమూనాలను సేకరించి వాటిపై పరిశోధన చేసారు. తొమ్మిది అవయవాల (గుండె, కాలేయం, రక్తనాళాలు, మూత్రపిండాలు, పేగులు, మెదడు, ఊపిరితిత్తులు, రోగనిరోధక వ్యవస్థ, క్లోమం) మొత్తం శరీరానికి సంబంధించిన జీవసంబంధమైన వయస్సును నిర్ణయించడానికి పరిశోధకులు పనిచేశారు.


Also Read: హైదరాబాద్ నుంచి వైజాగ్ గంటలోనే చేరుకోవచ్చట – బుల్లెట్ ట్రైన్‌ ను మించిన హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ రెడీ!

అవయవాల వయస్సు, వ్యాధుల ప్రమాదం
తాజా పరిశోధనల ప్రకారం, ఒక్క రక్త పరీక్ష ద్వారా మనిషిలోని అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి, ఎంత వేగంగా వాటి వయసు పెరుగుతోంది అనే విషయాలను అంచనా వేయడం ద్వారా రానున్న 10 సంవత్సరాల కాలంలో ఆ వ్యక్తి ఎలాంటి రోగాలకు గురి అవుతాడు, ఏ అవయవం దెబ్బతినడం కారణంగా మరణిస్తాడనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

ఉదాహరణకు.. గుండె వయసు త్వరగా పెరిగినవారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. యువకుల ఊపిరితిత్తులు బలహీనంగా అంటే వృద్ధుల లాగా ఉంటే అలాంటి వ్యక్తులు తరువాతి కాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి (COPD), ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతేకాకుండా, ఈ ప్రత్యేకమైన రక్త పరీక్ష ద్వారా.. ఒక వ్యక్తి శరీరంలోని రక్తనాళాలు, మెదడు, మూత్రపిండాలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన భాగాల వయస్సు ఎలా పెరుగుతోందో తెలుసుకోవచ్చు.

మధ్య వయసులో మెదడు వయసు వేగంగా పెరుగుతున్నవారిలో చిత్తవైకల్యం (dementia) ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురయ్యే వ్యక్తుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. అలాగే, మూత్రపిండాల ఆరోగ్యం ఇతర అవయవాలతో ముడిపడి ఉందని కూడా గుర్తించారు. మూత్రపిండాల వృద్ధాప్యం వేగవంతం అయిన వ్యక్తులు తరువాతి కాలంలో వాస్కులర్ వ్యాధి, టైప్ 2 డయాబెటిస్, మరియు కాలేయ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని అవయవాల జీవసంబంధమైన వృద్ధాప్యం మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని అంచనా వేసింది.

జీవనశైలిని బట్టి అవయవాల వయస్సు
సాధారణంగా, వ్యక్తి వయసుకు తగ్గట్టే అవయవాల వయస్సు ఉండాలి. కానీ జీవనశైలి, తినే ఆహారం, కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల అవయవాల వయస్సు మనిషి వయసుకు మించి త్వరగా పెరుగుతోందని తేల్చారు.

పరిశోధన ఫలితాలు
యూసీఎల్ పరిశోధన ఫలితాలు లాన్సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల అభివృద్ధిలో శోథ ప్రక్రియలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ పరిశోధన మరింత సూచిస్తుందని యూసీఎల్ ఫ్యాకల్టీ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ ప్రొఫెసర్ మికా కివిమాకి చెప్పారు. “మన అవయవాలు ఒక సమగ్ర వ్యవస్థగా పనిచేస్తాయి, కానీ అవి వేర్వేరు రేట్ల వద్ద వృద్ధాప్యం చెందుతాయి. ముఖ్యంగా అవయవాలలో వృద్ధాప్యం అనేక వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు దోహదం చేస్తుంది, కాబట్టి అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒక నిర్దిష్ట అవయవం ఊహించిన దానికంటే వేగంగా వృద్ధాప్యం చెందుతుందో లేదో సులభంగా రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చని మేం కనుగొన్నాం. రాబోయే సంవత్సరాల్లో, ఆరోగ్య సంరక్షణ వ్యాధుల నివారణ చాలా ముందుగానే ప్రారంభమవుతుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి రక్త పరీక్షలు అనేక వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి,” అని ఆయన అన్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×