Lithuania Plane Crash News: పైలెట్ చేసిన చిన్న పొరపాటు కారణంగా ఓ పెద్ద కార్గో విమానం కుప్పకూలింది. ల్యాండింగ్ కు కొద్ది నిమిషాల ముందు రాంగ్ సైడ్ టర్న్ తీసుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలెట్ ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయాపడ్డారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
విమానం కూలిపోవడానికి కారణం ఏంటంటే?
ప్రముఖ జర్మనీ కార్గో సంస్థ డీహెచ్ఎల్ కు చెందిన భారీగా కార్గో విమానాల్లో బోయింగ్ 737 అతి పెద్దది. ఈ సంస్థకు చెందిన గూడ్స్ ను పెద్ద మొత్తంలో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంది. ఎప్పటి లాగే ఈ విమానం గూడ్స్ తో జర్మనీ లోని లీప్ జిగ్ నుంచి బయల్దేరింది. లిధువేనియాలోని విల్నియస్ ఎయిర్ పోర్టులో దిగాల్సి ఉంది. మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుంది అనగా, ఈ విమానం జనావాసాల మీద కుప్పకూలింది. ఈ ప్రమాదం ఇవాళ తెల్లవారుజామున 5:28 గంటలకు జరిగింది. ఈ ప్రమాదంలో రవాణా విమానం మంటల్లో కాలి బూడిదైంది.
పైలెట్ మిస్టేక్ తోనే ప్రమాదం
ఫ్లైట్ రాడార్ ద్వారా సేకరించిన ఫ్లైట్ -ట్రాకింగ్ డేటా ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ రన్ వేకి 1.5 కిలోమీటర్ల దూరంలో క్రాష్ అయ్యింది. క్రాష్ అవడానికి కాసేపటి ముందుకు ఎయిర్ పోర్ట్ కు ఉత్తరం వైపుకు ఫ్లైట్ మలుపు తీసుకుంది. అదే సమయంలో అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా అంతగా అనుకూలంగా లేవు. విమానాశ్రయం దగ్గర వాతావరణం మైనస్ డిగ్రీ చలితో కూడుకుని ఉంది. గంటలకు 30 కిలో మీటర్ల వేగంతో శీతల గాలులు వీస్తున్నాయి. ముందున్న భారీ భవంతి కనిపించకపోవడంతో దానికి తగిలింది. అనంతరం అక్కడే ఉన్న జనావాసాల మీద కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.
A DHL cargo plane crashed near the airport in Lithuania’s capital on Monday, causing an explosion and killing one person, authorities said. Three people survived. https://t.co/zc8jNCxKMG pic.twitter.com/NlrjHo077B
— CBS News (@CBSNews) November 25, 2024
ఈ ప్రమాదంలో పైలెట్ మృతి, ముగ్గురు సిబ్బందికి గాయాలు
ఇక ఈ ఘటనలో పైలెట్ స్పాట్ లోనే చనిపోయాడు. మరో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వార్తలు వెల్లడించింది. ఇక ప్రమాద ఘటన గురించి తెలియగానే అక్కడికి అగ్నిమాపక సిబ్బందితో పాటు సహాయక బృందాలు చేరుకున్నాయి. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించాయి. విమానం కూలిన ప్రదేశంలోని స్థానికుల ప్రాణాలకు ఎలాంటి నష్టం వాటిళ్లలేదని అధకారులు తెలిపారు. కొన్ని ఇండ్లు మాత్రం ధ్వంసం అయినట్లు వెల్లడించారు.
మూడు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న విమానం
ఇక ఈ అతిపెద్ద బోయింగ్ విమానాన్ని డీహెచ్ఎల్ కార్వో సర్వీస్ సంస్థ కోసం స్విఫ్ట్ ఎయిర్ లైన్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ విమానం కొనుగోలు చేసి మూడు దశాబ్దాలు దాటినట్లు సదరు విమానయాన సంస్థ తెలిపింది. డీహెచ్ఎల్ సంస్థ పెద్ద మొత్తంలో గూడ్స్ పంపించేందుకు ఈ విమాన సేవలను వినియోగించుకుంటున్నది.
Read Also:హై-స్పీడ్ రైళ్లలో సీటు బెల్టులు ఉండవు.. ఎందుకో తెలుసా?