Panama Earthquake: దక్షిణ అమెరికాపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. చీటికిమాటికి బలమైన భూకంపాలు రావడంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏ సమయంలో ప్రకృతి తమపై కన్నెర్ర చేస్తుందోనని భయంతో హడలిపోతున్నారు. తాజాగా ఈ ఉదయం పనామాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రతం 7.7 గా నమోదు అయ్యిదంటే.. అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉత్తర అమెరికా- దక్షిణ అమెరికా మధ్యలో ఉంటుంది పనామా దేశం. అక్కడ కాలమానం ప్రకారం.. శుక్రవారం దక్షిణ పనామాను భారీ భూకంపం వణికించింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదు అయ్యింది. ఈ భూకంపం వల్ల ఇళ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమాన సర్వీసుల రాకపోకలు నిలిచిపోయాయి. ఒక్కసారి భూమి భారీగా వణికించడంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు.
భారీ భూకంపం తర్వాత వరుసగా డజనుకు పైగా ప్రకంపనలు కూడా సంభవించినట్టు అక్కడి స్థానిక పత్రికలు చెబుతున్నాయి. ఈ భూకంపం 7.8 మైళ్ల లోతులో సంభవించిందని శాస్తవేత్తలు తెలిపారు. చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రానికి సుమారు 126 మైళ్ల దూరంలో పనామా కాలువ ఉంది. ఇప్పటివరకు పనామాలో వచ్చిన అతి పెద్ద పెద్ద భూకంపంగా చెబుతున్నారు.
ఆ ప్రాంతంలో పెద్ద భూకంపాలు చాలా అరుదుగా వస్తుంటాయి. భూకంపం కారణంగా పనామా స్థూల దేశీయోత్పత్తి 1 శాతం నుండి 10 శాతం వరకు ఆర్థిక నష్టాలు సంభవించవచ్చని USGS అంచనా. ఆరు ప్రావిన్సులలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన ప్రాంతీయ కేంద్రమైన టోకుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను నిలిచిపోయాయి.
పనామా జియోసైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ నెస్టర్ లూక్ మాట్లాడారు. దీర్ఘకాలంగా ఒత్తిడి పేరుకుపోయి ఉన్న అజురో సోనా ఫాల్ట్ సిస్టమ్ కారణంగా ఈ భూకంపం సంభవించిందని అన్నారు.భూకంప సంకేతాలు దేశంలోని భూభాగంలోని ప్రతిచోటా కనిపించిందని తెలిపారు. పనామా సిటీలో 40 సెకన్ల పాటు ప్రకంపనలను లెక్కించినట్లు లూక్ చెప్పారు. ఇతర ప్రాంతాలలో ఇంకా ఎక్కువ సేపు ప్రకంపనలు సంభవించి ఉంటాయని అంచనా వేశారు. భూకంపం చాలా బలంగా ఎక్కువసేపు వణికించిందని, ఈ విధంగా ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.
ALSO READ: ట్రంప్ ఆశలపై నీళ్లు.. భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి పురస్కారం
తొలుత చిన్న చిన్న సంకేతాలు రాగానే అనేక కార్యాలయాలు ఉద్యోగులను ముందుగా ఇంటికి పంపించారు. పనామా సిటీ అంతటా ట్రాఫిక్ స్తంభించిపోయింది మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. పనామా సిటీ వ్యాప్తంగా పాఠశాలలకు ముందుగా సెలవు ప్రకటించారు. యూనిఫాంలో ఉన్న విద్యార్థులు పనామా నగర కేంద్రంలోని వీధుల్లోకి వెల్లువెత్తారు. పసిఫిక్ తీరప్రాంతానికి సమీపంలో ఉన్న హెర్రెరాలోని జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతంలోని లా పిటలోజా ప్రాంతం భూకంప కేంద్రానికి దగ్గరగా ఉంది.
పొరుగున ఉన్న కోస్టారికా రాజధాని శాన్ హోసే వరకు ప్రకంపనలు సంభవించాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పనామా తీరంలో సంభవించిన భూకంపం కారణంగా ఏర్పడిన సునామీ ముప్పు తొలగిపోయిందని, ఇకపై సునామీ ప్రమాదం ఏమీ లేదని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఇటీవలి వెనిజులా, కొలంబియా దేశాలను భారీ భూకంపాలు వణికించాయి. దీనికారణంగా వేలాది మంది మరణించిన విషయం తెల్సిందే.
‼️ Terrifying scenes from the powerful earthquake that struck Panama!
A 7.7-magnitude earthquake shook the country on Friday, sending people rushing out of buildings as structures swayed and roads were damaged. The tremor triggered widespread evacuations and panic.#Panama… pic.twitter.com/3YGv1BdtID
— Indian Observer (@ag_Journalist) October 10, 2026
🚨A strong magnitude-7.7 #earthquake jolted #Panama on Friday, setting off panic in the capital city & warnings of potentially dangerous tsunami waves along the Pacific coasts of Central & South America. @AFP https://t.co/MEEn61OFo9 https://t.co/nXnXluYdwd pic.twitter.com/nmknFZrhNl
— ⚡️🌎 Sarwar 🌐⚡️ (@ferozwala) October 9, 2026
పనామాలో భారీ భూకంపం.. ధ్వంసమైన రోడ్లు, భవనాల విజువల్స్#PanamaEarthquake #Panama #Earthquake #NaturalDisaster #bigtv https://t.co/XH2r02fPfe pic.twitter.com/5Xvkrmf2ZG
— BIG TV Breaking News (@bigtvtelugu) October 10, 2026