E-Paper
Advertisement

ట్రంప్ ఆశలపై నీళ్లు.. భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి పురస్కారం

ట్రంప్ ఆశలపై నీళ్లు.. భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి పురస్కారం
Advertisement

అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వస్తూనే.. ప్రపంచంలో అశాంతిని రాజేసిన డోనాల్డ్ ట్రంప్.. ఆశలు గల్లంతయ్యాయి. ఆయన ఎంతగానో ఇష్టపడుతోన్న నోబెల్ శాంతి బహుమతి చేదాటి పోయింది. భారత సంతతికి చెందిన నవీ పిళ్లై(నవనెథమ్)ని ఈ పురస్కారం వరించింది. యుద్ధ నేరాలు, జాతి విద్వేషాలు, నరమేధాలను చూసి చలించిపోయిన నవీ పిళ్లై.. అలాంటి ఘోరాలకు చట్టపరమైన విచారణ జరగాల్సిందేనని పట్టుబట్టారు. అది అమలయ్యేలా ఆమె విశేష కృషి చేశారు. అందుకే ఆమె 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.

పిళ్లై తల్లిదండ్రులు ఇండియాలోని తమిళనాడుకు చెందినవారు. ఆమె చిన్న తనంలోనే తల్లి సంతమ, తండ్రి నారైన్సామి నాయుడు దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. నాయుడు అక్కడ డర్బన్‌లో బస్ డ్రైవర్‌గా పనిచేస్తూ పిళ్లైను చదివించారు. పిళ్లైకి ప్రస్తుతం 85 ఏళ్లు. న్యాయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నెల్సన్ మండేలాకు ఆమె డిఫెన్స్ లాయర్‌గా కూడా పనిచేశారు. రువాండా ట్రిబ్యునల్, అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆమె కీలక సేవలు అందించారు.

Advertisement

వర్ణవివక్షపై పోరాడటమే కాకుండా.. అత్యాచారాలు, లైంగిక హింసలను నరమేధంగా నిర్ధరించేందుకు ఆమె ప్రయత్నించారు. ఇటీవల ఆక్రమిత పాలస్తీనా భూభాగాలపై ఐరాస విచారణ కమిషన్‌కు అధ్యక్షత వహించి, గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడిందని ఆమె తేల్చిచెప్పారు. ప్రస్తుతం మయన్మార్‌పై నరమేధ ఆరోపణల కేసుకు సంబంధించి ఐసీజేలో న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 10న స్వీడన్‌లోని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో ఈ బహుమతి కింద సుమారు రూ.11 కోట్లను ప్రదానం చేస్తారు.

Also Read: కెనడా రచయిత్రి ఆన్ కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం

Tags

Related News

గ్రీన్‌కార్డు వ్యవహారం.. వాన్స్ వ్యాఖ్యలపై మైక్రోసాఫ్ట్ కౌంటర్, కేవలం ఒక్కశాతం మాత్రమే

టీచర్‌పై కాల్పులు జరిపిన 6 ఏళ్ల బాలుడు.. పోలీసులు రాగానే మరింత తెగించి

ఉక్రెయిన్ బస్టాప్‌పై రష్యా బాంబుల వర్షం.. 33 మంది మృతి!

ట్రంప్‌కు బంగారు విగ్రహం.. కానీ, బట్టల్లేకుండా.. ఏందయ్యా ఇది?

కెనడా రచయిత్రి ఆన్ కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం

చమురు బాంబు పేల్చిన ట్రంప్.. పతనమైన స్టాక్‌మార్కెట్లు, ఇంతకీ ట్రంప్ ఏమన్నారు?

అమెరికా చదువులు ఖరీదు బాబోయ్.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ ఝలక్, ఇకపై రూ. 67 లక్షలు

Big Stories

Advertisement
×