E-Paper
Advertisement

బౌండ‌రీ సైజు 80 మీటర్లు చేయండి..లేక‌పోతే 500ల ప‌రుగులు చేసినా క‌ష్ట‌మే

బౌండ‌రీ సైజు 80 మీటర్లు చేయండి..లేక‌పోతే 500ల ప‌రుగులు చేసినా క‌ష్ట‌మే
Advertisement

Aakash Chopra On IND VS WI:  టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య రాంచీ వేదికగా నిన్న జరిగిన రెండో టి20 సందర్భంగా శ్రేయస్ అయ్యర్ సేనకు ఘోర పరాభావం ఎదురయింది. 249 పరుగుల టార్గెట్ పెట్టినప్పటికీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది టీమిండియా. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది వెస్టిండీస్. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఇండియాలో ఉన్న మైదానాల బౌండరీ లైన్ పెంచాలని డిమాండ్ చేశారు.

బౌండరీ లైన్‌ దూరాన్ని 80 మీటర్లు చేయండి – ఆకాశ్ చోప్రా

కనీసం ఒక్కో బౌండరీ లైన్ 80 మీటర్లు పెంచాల్సిందేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆకాశ్ చోప్రా. అలా చేయకపోతే టీమిండియా బౌలర్ల కెరీర్ నాశనం అవుతుందని హెచ్చరించారు. ఇండియా వ్యాప్తంగా ఉన్న మైదానాలు అన్ని కూడా ఫ్లాట్ పిచ్ లతో కూడుకున్నవని.. వీటిలో బౌలింగ్ చేయడం కష్టమేనని తేల్చి చెప్పారు. దానికి తోడు మంచు పడితే, బౌలర్లను బ్యాటర్లు చెడుగుడు ఆడుకుంటారని గుర్తు చేశారు. నిన్న జరిగిన రెండో టి20 సందర్భంగా ఇదే జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బౌండరీ లైన్ దూరాలను పెంచాలని బీసీసీఐ, ICCని కోరారు. దీంతో ఇండియ‌న్ పిచ్ ల‌పై ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

ఫ్లాట్ పిచ్ ల‌పై 500ల ప‌రుగులు చేసినా క‌ష్ట‌మే

వెస్టిండీస్ తో జరిగిన రెండో టి20 సందర్భంగా టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది. దీనిపై ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ… భారతదేశవ్యాప్తంగా బౌలర్లకు సపోర్ట్ గా ఉన్న ఒక్క మైదానం లేదని బిసిసిఐ పై విమర్శలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం అన్ని ఫ్లాట్ మైదానాలు తయారు చేశారని ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీమిండియా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు. అయితే ఫ్లాట్ మైదానాలు తయారు చేస్తే… బౌండరీ లైన్ దూరాన్ని కచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

Advertisement

అప్పుడే బోర్డర్లకు అనుకూలంగా వాతావరణ మారుతుందని తెలిపారు. అలా కాదని లైట్ తీసుకుంటే మాత్రం 500 పరుగుల టార్గెట్ ను కూడా ప్రత్యర్ధులు అవలీలగా చేదిస్తారని హెచ్చరించారు. ఇలాగే ఉంటాం అని మొండి వైఖరి వహిస్తే మాత్రం బౌలర్ల కెరీర్ దెబ్బ తినడం గ్యారంటీ అని వార్నింగ్ ఇచ్చారు. కచ్చితంగా బౌండరీ సైజు పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా, ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 249 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్… చేదించింది. దీంతో 6 వికెట్ల తేడాతో టీమిండియా పై వెస్టిండీస్ విజయం సాధించింది.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

 

Related News

వాడికి బ్యాటింగ్ రాదు, బౌలింగ్ చేత‌కాదు…టీమిండియా ఓట‌మి కార‌ణం శివ‌మ్ దూబేనే

సంజు శాంస‌న్ సెంచ‌రీ మిస్…వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి

విరాట్ కోహ్లీకి బలుపెక్కువ…బుమ్రా లేదు, వుమ్రా లేదంటూ తక్కువ అంచనా వేశాడు

సంజు జోలికి వస్తే తాట తీస్తా, చేతకాకపోతే తప్పుకో…గంభీర్‌కు డీకే వార్నింగ్

పులి లాంటి ఆస్ట్రేలియా పసికూనలా మారిపోయింది..ఒంటి చేత్తో ఓడిస్తా

రాసి పెట్టుకోండి…వచ్చే సీజన్‌లో PSL దెబ్బకు IPL కనుమరుగైపోతుంది

వ్యూస్‌, డ‌బ్బుల కోసం మా వెధ‌వ‌లే టీమిండియాకు భజన చేస్తున్నారు

Big Stories

Advertisement
×