Scholarship: మీరు ఉన్నత చదువులు చదువుకోవాలని అనుకుంటున్నారా..? చదువులో టాలెంట్ ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నారా..? పైచదువులు చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాలనుకునే వారికి ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాలెంట్ ఉన్న నిరుపేద విద్యార్థుల కోసం అద్భుతమైన ప్రోగ్రామ్ ను చేపట్టింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేని విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ కు ఎవరు అర్హులు, స్కాలర్ షిప్ ఎంతవరకు ఇస్తారు.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
టాలెంట్ కలిగిన నిరుపేద విద్యార్థుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ‘పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్’ పేరుతో స్కాలర్ షిప్ ను అందజేస్తోంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు పాఠశాల విద్యార్థులకు, అండర్ గ్రాడ్యుయేట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ (జనరల్& ప్రొఫెషనల్) కోర్సులు చదువుతున్న పేద విద్యార్థులు మొత్తం రూ.75వేల వరకు స్కాలర్ షిప్ ను అందజేస్తోంది. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 4వ తేదీలోగా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం స్కాలర్ షిప్: రూ.75,000
ప్రోగ్రామ్ పేరు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: ‘పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్’ ప్రోగ్రామ్ 2025-26..
విద్యార్హత: ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ (జనరల్/ ప్రొఫెషనల్) కోర్సులు చదువుతున్న స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్లై చేసుకునే విద్యార్థుల వార్షిక ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి..
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 4
స్కాలర్ షిప్ వివరాలు:
ఫస్ట్ నుంచి ఆరో తరగతి స్టూడెంట్స్: రూ.15000
ఏడో తరగతి నుంచి ఇంటర్, డిప్లొమా, ఐటీఐ: రూ.18,000
జనరల్ డిగ్రీ కోర్సులకు అయితే.. : రూ.30,000
ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులకు అయితే..: రూ.50,000
జనరల్ పీీజీ కోర్సులకు: రూ.35,000
ప్రొఫెషనల్ పీజీ కోర్సులకు: రూ.75,000
స్కాలర్‌షిప్ కు ఎంపిక చేసే విధానం: స్టూడెంట్స్ అర్హతలు, షార్ట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే అఫీషియల్ వెబ్ సైట్‌కి వెళ్లి చూసుకోవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.hdfcbankecss.com/
అప్లికేషన్ లింక్: https://www.buddy4study.com/application/HDFC58/instruction
ముఖ్య సమాచారం:
మొత్తం స్కాలర్ షిప్: రూ.75,000
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 4
ALSO READ: SSC JOBS: ఎస్ఎస్‌సీలో 1340 జేఈ ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం.. రేపే లాస్ట్ డేట్
ALSO READ: MTS Jobs: టెన్త్ అర్హతతో 1075 ఎంటీఎస్ ఉద్యోగాలు.. ఇంకా 4 రోజులే సమయం..