E-Paper
Advertisement

గ్రీన్‌కార్డు వ్యవహారం.. వాన్స్ వ్యాఖ్యలపై మైక్రోసాఫ్ట్ కౌంటర్, కేవలం ఒక్కశాతం మాత్రమే

గ్రీన్‌కార్డు వ్యవహారం..  వాన్స్ వ్యాఖ్యలపై మైక్రోసాఫ్ట్ కౌంటర్, కేవలం ఒక్కశాతం మాత్రమే
Advertisement

America: అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇప్పుటి వరకు అక్కడికి వలస వచ్చినవారిపై ఫోకస్ చేసిన ట్రంప్ ప్రభుత్వం, ఈసారి అక్కడి కంపెనీలను టార్గెట్ చేసింది. అంతేకాదు పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీ తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. దీనిపై మైక్రోసాఫ్ట్ అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. వాన్స్ వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చింది.

వాన్స్ వ్యాఖ్యలపై మైక్రోసాఫ్ట్ కౌంటర్

గత రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలపై మైక్రోసాఫ్ట్ సంస్థ రియాక్ట్ అయ్యింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. గడిచిన ఏడాదిలో తాము దాఖలు చేసిన సుమారు 6000 హెచ్-1బీ దరఖాస్తుల్లో 80 శాతం దరఖాస్తులు, సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల వీసా పొడిగింపు, వారి హోదా మార్పుకు సంబంధించినవేనని తెలిపింది. ఇవేమీ కొత్త నియామకాలు కావని క్లారిటీ ఇచ్చింది. మిగిలిన దరఖాస్తులు ఇప్పటికే అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న కొత్త నియామకాలకు సంబంధించినవి గుర్తు చేసింది.

కేవలం ఒక్కశాతం మాత్రమే, డేటా విప్పిన మైక్రోసాఫ్ట్

Advertisement

వారు అమెరికా ఉద్యోగుల్లో సుమారు ఒక్క శాతానికి సమానమన్నారు. వారు మన దేశానికి కొత్తగా వచ్చినవారు కాదని తెలిపింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ.. H-1B ఉద్యోగులకు సమానమైన పని చేసే ఇతర ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లిస్తుందని పేర్కొంది. తమ వేతనాలు అన్ని H-1B ఫైలింగ్‌లలో అత్యధికమైన వాటిలో ఒకటని వివరించింది. మా కంపెనీ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మంది అమెరికన్లేనని తెలిపింది. అయితే ఆ ప్రకటనలో సస్పెన్షన్ గురించి ప్రస్తావించలేదు, ప్రభుత్వానికి అదనపు సమాచారాన్ని అందించడానికి ఎదురు చూస్తున్నామని ప్రస్తావించింది.

అదే సమయంలో ట్రంప్‌తో సత్యనాదెళ్ల

అమెరికా ఉద్యోగుల స్థానంలో అధికంగా హెచ్-1బీ వీసాదారులను మైక్రోసాఫ్ట్ నియమించుకుంటోందన్న ఆరోపణలు గుప్పించింది ట్రంప్ ప్రభుత్వం. మైక్రోసాఫ్ట్ సంస్థను పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్-PERM గ్రీన్ కార్డ్ ప్రక్రియ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. సదరు సంస్థ ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తోందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గతరాత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఆరోపణలను మైక్రోసాఫ్ట్ కంపెనీ తీవ్రంగా ఖండించింది. తాము ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని క్లారిటీ ఇచ్చేసింది. మైక్రోసాఫ్ట్‌తోపాటు అడోబ్, కొన్ని ఐటీ సంస్థలను పెర్మ్ నుంచి సస్పెండ్ చేసింది ట్రంప్ ప్రభుత్వం.

Advertisement

ALSO READ: ఇండియన్ ఐటీ కంపెనీలపై అమెరికా కొరడా.. గ్రీన్ కార్డ్ PERM ప్రాసెస్ నిలిపివేత! టెక్కీలకు కోలుకోలేని దెబ్బ

జేడీవాన్స్ ఆరోపణలు గుప్పించినప్పుడు వైట్‌హౌస్‌లో మైక్రోసాఫ్ట్ సీఈఓ  సత్యనాదెళ్ల ఉన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఆ కార్యక్రమంలో సస్పెన్షన్ గురించి ప్రస్తావించలేదు. ఆయనను పరిచయం చేస్తూ మైక్రోసాఫ్ట్‌ను సూపర్ ఇంటెలిజెన్స్‌లో తొలి అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనతను ఆయనకు ఆపాదించారు. జాతీయ సాంకేతిక – ఆవిష్కరణల పతకాన్ని ప్రదానం చేయడం మాకు గౌరవంగా ఉందని, దీనికి పూర్తిగా అర్హులని అన్నారు అధ్యక్షుడు ట్రంప్.

Related News

టీచర్‌పై కాల్పులు జరిపిన 6 ఏళ్ల బాలుడు.. పోలీసులు రాగానే మరింత తెగించి

ఉక్రెయిన్ బస్టాప్‌పై రష్యా బాంబుల వర్షం.. 33 మంది మృతి!

ట్రంప్‌కు బంగారు విగ్రహం.. కానీ, బట్టల్లేకుండా.. ఏందయ్యా ఇది?

కెనడా రచయిత్రి ఆన్ కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం

చమురు బాంబు పేల్చిన ట్రంప్.. పతనమైన స్టాక్‌మార్కెట్లు, ఇంతకీ ట్రంప్ ఏమన్నారు?

అమెరికా చదువులు ఖరీదు బాబోయ్.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ ఝలక్, ఇకపై రూ. 67 లక్షలు

చేప వలలతో పాకీ సైన్యం సరికొత్త ప్రయోగం.. నవ్వుతున్న జనం

Big Stories

Advertisement
×