BigTV English

Jaishankar at UNGA: పాకిస్తాన్ కు ఇచ్చి పడేసిన ఇండియా.‌. అందరి ముందు పరువు పోయిందిగా!

Jaishankar at UNGA: పాకిస్తాన్ కు ఇచ్చి పడేసిన ఇండియా.‌. అందరి ముందు పరువు పోయిందిగా!

Jaishankar at UNGA| ఐక్యరాజ్య సమితి జెనెరల్ అసెంబ్లీ 79వ సమావేశాల్లో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ప్రసంగిస్తూ.. పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. శనివారం భారత దేశం తరపున ఆయన ప్రసంగిస్తూ.. ”పాకిస్తాన్ తీరుపై ఇండియా చాలా స్పష్టంగా ఉంది. సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ సీరియస్ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ కు ఉగ్రవాదంతో ఒరిగేదేమీ లేదు. రెండు దేశాల మధ్య ఉన్నది ఒక్కటే సమస్య. భారతదేశ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. ఆ భూభాగం వారి చేత ఖాళీ చేయించడమే మా లక్ష్యం” అని అన్నారు.


పాకిస్తాన్ ప్రధాన మంత్రి ప్రసంగంపై జైశంకర్ స్పందించారు. ”పాకిస్తాన్ తనే ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ ఇతరులకు నీతులు చెబుతోంది. ఇది అసాధారణ విషయం. చాలా దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి చివరికి నష్టాలను మూటగట్టుకున్నాయి. అలాంటి దేశాలలో నాయకుల చేతి నుంచి పరిస్థితులు చేజారి పోతాయి. పాకిస్తాన్ కూడా అలాంటి దేశమే. పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదులు పెరుగుతున్నారు. పాకిస్తాన్ పెద్దలే వారిని పెంచి పోషిస్తున్నారు. దానివల్ల భారతదేశానికి కూడా నష్టం జరుగుతోంది. సరిహద్దుల్లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి సాయం అందుతోంది. ఈ చర్యలకు పాల్పడిన పాకిస్తాన్ కు శిక్ష తప్పకుండా ఉంటుంది. శిక్ష నుంచి పాకిస్తాన్ తప్పించుకోగలదు అని భావనలో ఉంది. ఇండియా ఇకపై ఎటువంటి ఉగ్రవాద హింసను సహించదు. త్వరలోనే పాకిస్తాన్ భారత భూభాగాన్ని ఖాళీ చేయాలి. దీని గురించి నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది.” అని అన్నారు.

Also Read:  హెజ్బుల్లా చీఫ్ హత్యకు వ్యతిరేకంగా మెహ్‌బూబా ముఫ్తీ నిరసన.. ఎన్నికల ప్రచారం నిలిపివేత..


శాంతితోనే అభివృద్ధి
”ఐక్యరాజ్యసమితి ఎప్పటినుంచో శాంతి, అభివృద్ధి రెండు అంశాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉందని చెబుతోంది. భారతదేశం ఈ అంశంపై ఏకీభవిస్తోంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూడాలి. ముఖ్యంగా బలహీనంగా ఉన్నవారికి న్యాయం జరగాలి. యుక్రెయిన్ అయినా, గాజా సమస్య అయినా ప్రపంచ దేశాలు కలిసికట్టుగా వీటిని వెంటనే పరిష్కరించాలి. ఎక్కవ కాలం హింస కొనసాగితే దానివల్ల అందరికీ తీరని నష్టం జరగుతుంది. అంతర్జాతీయ చట్టాలను కాపాడే బాధ్యత ఐక్యరాజ్య సమితిపై ఉంది. ప్రపంచ శాంతి భంగం కలుగుతుంటే దాన్ని సహంచకూడదు. ప్రపంచదేశాల నాయకులు ముందుకు వచ్చి భద్రత, స్థిరత్వం నెలకొల్పేందకు తగిన కృషి చేయాలి.” అని జై శంకర్ అంతర్జాతీయ సమస్యలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×