E-Paper
Advertisement

ఆ 5000 మంది ఏమైపోయారు? ఇక వెతకలేక చేతులెత్తేసిన నేపాల్!

ఆ 5000 మంది ఏమైపోయారు? ఇక వెతకలేక చేతులెత్తేసిన నేపాల్!
Advertisement

నేపాల్‌‌లో ఏర్పడిన రాకాసి వరద.. ఎంతటి భారీ నష్టాన్ని కలిగించిందో తెలిసిందే. ఆ వరద దాటిటికి నదీ తీరంలో ఉన్న ఇళ్లన్నీ పేకమేడల్లా కూలిపోయాయి.. నీటిలో కలిసిపోయాయి. ప్రమాదాన్ని గుర్తించి.. తప్పించుకొనే లోపే.. వరద ముంచెత్తి.. తనలో కలిపేసుకుంది. ఈ ఘటనలో వేలాది మంది గల్లంతయ్యారు. వరద ఉదృతి శాంతించి తర్వాత.. నేపాల్ సైన్యం, రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి.. గల్లంతైన జనాల కోసం వెతకడం ప్రారంభించారు. అయితే, వారికి ఎక్కువ శాతం తెగిన శరీర భాగాలే దొరికాయి. వాటిని జాగ్రత్తగా సేకరించి డీఎన్ఏ టెస్టుల కోసం పంపించారు. కొన్నింటిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన జరిగి 40 రోజులు అవుతున్నా.. ఇంకా చాలామంది ఆచూకీ తెలియరాలేదు. ఇక ఎంత వెతికినా ప్రయోజనం లేదని భావించిన నేపాల్ ప్రభుత్వం గాలింపులు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక పునరావాస కార్యక్రమాలపై దృష్టి

నేపాల్‌లో భోటెకోషి, త్రిశూలిలో ఆగస్టు 26న ఏర్పడిన ఈ పెను విలయంలో1,455 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5,285 మంది గల్లంతయ్యారు. వారి కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపులు జరిపారు. భారీగా పేరుకుపోయిన మట్టిని సైతం తొలగించి వెతికారు. రాత్రి పగలు తేడా లేకుండా గల్లంతైన వారి కోసం గాలిస్తూనే ఉన్నారు. ఇకపై సహాయక చర్యల నుంచి దృష్టిని మళ్లించి, పూర్తిగా పునర్నిర్మాణం పునరావాస కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ 189 మంది భారతీయులు ఏమైపోయారు?

Advertisement

ఈ విపత్తులో గల్లంయిన విదేశీయులలో భారతీయులదే అగ్రస్థానం కావడం గమనార్హం. విదేశీ పర్యాటకుల విభాగం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 36 దేశాలకు చెందిన మొత్తం 606 మంది విదేశీ పర్యాటకులు గల్లంతు కాగా, అందులో ఒక్క భారత్ నుంచే 189 మంది ఉన్నారు. అమెరికా 65 , మలేషియా 55, ఉక్రేయిన్ 54, చైనా 37, ఆస్ట్రేలియా 33, లాట్వియా 33, బ్రిటన్ 32, కెనడాకు చెందిన 30 మంది పౌరులు గల్లంతయ్యారు.

Also Read: భూమిని తుడిచిపెట్టే వైరస్… 2035 నుంచి పాస్ట్‌లోకి వెళ్లిన ఖైదీ…  

Advertisement

తప్పుకుపోయిన 189 భారతీయుల్లో తమిళనాడు నుంచి 85 మంది, పశ్చిమ బెంగాల్ నుంచి 37 మంది, గుజరాత్ నుంచి 30 మంది, తెలంగాణ నుంచి 25 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 22 మంది, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి 13 మంది చొప్పున, బీహార్ నుంచి 12 మంది, మహారాష్ట్ర నుంచి 10 మందికి పైగా, ఒడిశా నుంచి 4 మంది గల్లంతైనట్లు సమాచారం. వీరంతా చనిపోయారా లేదా? సురక్షితంగా బయటపడి ఎక్కడైనా చిక్కుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో చనిపోయి ఉండవచ్చని భావిస్తు్న్నారు.

Tags

Related News

కెప్టెన్ స్మిత్ పుర్రెకు శస్త్రచికిత్స.. విజయవంతంగా నిర్వహించిన సౌదీ వైద్యులు!

ఫ్లైదుబాయ్ కో-పైలట్.. విచారణలో కీలక విషయాలు, షాకైన అధికారులు

కూలిన సైనిక విమానం.. 32 మంది మృతి, నైజీరియాలో ఘటన

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం.. భారత్ ఫార్మా కంపెనీపై డ్రోన్ల దాడి, రూ.400 కోట్ల నష్టం!

తీగలాగితే డొంక కదిలింది.. ప్లైదుబాయ్ కో-పైలట్ గురించి షాకింగ్ విషయాలు, ఇకపై ఇజ్రాయెల్..

భారత్ కెప్టెన్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ వీడియో కాల్.. డోర్ తీసే సమయంలో..

‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా’.. ఎలాన్ మస్క్ సడెన్ బ్రేకప్‌పై.. శివోన్ జిలిస్ తీవ్ర భావోద్వేగం!

Big Stories

Advertisement
×