Tragedy In China: చైనాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుయిజౌ ప్రావిన్స్‌లోని కియాంక్సి నగరంలో ఆదివారం పర్యాటకులతో వెళ్తున్న పడవలు బోల్తా పడ్డాయి. నాలుగు పడవలు ఒకే సారి బోల్తా పడటంతో 9 మంది మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారు.
ఈ ప్రమాదం లిగువాంగ్ నదిలో జరిగింది. అధికారులు నివేదిక ప్రకారం.. అకస్మాత్తుగా వీచిన బలమైన గాలి కారణంగా 4 పడవలు బోల్తా పడ్డాయి. నాలుగు పడవల్లో మొత్తం 84 మంది పర్యాటకులు ఉండగా.. ఈ ప్రమాదంలో పడవలో ఉన్న వారందరూ నీటిలో పడిపోయారు.
ఈ ప్రమాదం తర్వాత.. సమాచారం అందుకున్న దాదాపు 500 మంది రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. 74 మంది పర్యాటకులను సిబ్బంది రక్షించారు. ఇంకొకరి ఆచూకి కోసం వెతుకుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రాంతీయ అధికారులను ఆదేశించారు.
70 మంది పర్యాటకులను ఆసుపత్రికి తరలించారు:
ప్రమాదం తర్వాత.. స్థానిక అధికారులు 70 మంది పర్యాటకులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ పెద్దగా గాయాలు కానప్పటికీ.. ముందు జాగ్రత్తగా అందరినీ ఆసుపత్రికి పంపించారు.
#LatestNews Nine people died and one is missing in boat capsize accident in a river of Qianxi City, southwest China's Guizhou Province, on Sunday afternoon, according to local authorities. pic.twitter.com/BXphcNlvPN
— China News 中国新闻网 (@Echinanews) May 5, 2025