Food For Heart Health: ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో గుండె జబ్బుల ప్రమాదం కనిపిస్తోంది. పిల్లలు కూడా దాని బాధితులుగా మారుతున్నారు. ఇటీవలి కాలంలో.. చిన్న వయస్సులోనే గుండెపోటు, దాని వలన కలిగే మరణాల గురించి మీరు చాలా వార్తలు వినే ఉంటారు. గుండెపోటు ప్రమాదం ఎందుకు పెరుగుతుందనే దానిపై అధ్యయనాల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జీవనశైలి, ఆహారంలో అసమతుల్యతతో పాటు, మీ అనేక చెడు అలవాట్లు కూడా మీ గుండె ఆరోగ్యానికి హానికరం కావచ్చు. మీరు చాలా కోపంగా ఉన్నప్పటికీ.. ఇది గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
అటువంటి పరిస్థితిలో.. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? ఏం తినాలి ? ఏం త్రాగాలి ?
అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారపు అలవాట్లను మెరుగు పరుచుకోవడం అవసరమని చాలా మంది నిపుణులు చెబుతుంటారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహారంలో సంతృప్త, ట్రాన్స్ కొవ్వులు, కొలెస్ట్రాల్, సోడియం తగ్గించాలి.
మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడే అనేక ఆహార ప్రణాళికలు కూడా ఉన్నాయి. DASH ఆహారం మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండె జబ్బులను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనల్లో రుజువైంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ?
సర్క్యులేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం పరిశోధకులు గుండె ఆరోగ్యానికి టాప్-10 డైట్ ప్లాన్‌ల జాబితాను విడుదల చేశారు. దీనిలో DASH ఆహారం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పబడింది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార ప్రణాళికలో DASH (డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్‌టెన్షన్) 100 పాయింట్లు సాధించింది. అన్ని మార్గదర్శకాల ఆధారంగా.. ఇది గుండె ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారంగా ర్యాంక్ పొందింది.
రక్తపోటును నియంత్రించడంలో DASH డైట్ ప్లాన్ చాలా ప్రభావ వంతంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి ఈ డైట్ ప్లాన్ దీర్ఘకాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది.
కేవలం రెండు వారాల తర్వాత.. DASH డైట్ పాటించడం వల్ల రక్తపోటు గణనీయంగా మెరుగుపడింది. ఇది కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
Also Read: తులసి వాటర్ తాగితే.. వ్యాధులన్నీ పరార్ !
గుండె ఆరోగ్యంగా ఉండటానికి తినాల్సిన ఆహారం ?
గుండెను వ్యాధుల నుండి రక్షించుకోవడానికి.. ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్, సీడ్స్ , చేపలు వంటి వాటి ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పాలు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులు, తక్కువ సోడియం ఉన్న పదార్థాలు ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా గుండె జబ్బులు కూడా రాకుండా చేస్తాయి. వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.