Nepal: నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో జెన్-జె పేరుతో యువత నేతృత్వంలో జరుగుతున్న ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా యాప్స్ పై ఆంక్షలు విధించినట్లు ప్రకటించడంతో యువత ఆగ్రహం ఊపందుకుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) తదితర 26 సోషల్ మీడియా యాప్ లపై బ్యాన్ విధించారు. ఇది అవినీతి, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభాలకు వ్యతిరేకంగా మారింది. ఈ రోజు ఈ నిషేదాన్ని ప్రభుత్వం ఉపసంహరించినప్పటికీ ఆందోళనలు ఆగలేదు. ఫలితంగా, ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా కూడా చేసి దుబాయి కి వెళ్లారు. ఇప్పటి వరకు జరిగిన ఈ హింసాత్మక ఘటనల్లో 20 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.
Nepal’s Finance Minister Bishnu Prasad Paudel runs as a mob chasea him.
The attack occurred as thousands of Gen Z protesters clashed with security forces across the capital, Kathmandu, and other cities. pic.twitter.com/SbMts9LTaK
— Rahul Shivshankar (@RShivshankar) September 9, 2025
నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్ (65)పై నిరసనకారులు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. వీడియోలో పెద్ద సంఖ్యలో ప్రజలు మంత్రిని వెంబడిస్తూ, కొందరు ఆయనపై దాడి చేస్తూ, తన్నడం, హింసించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడిలో ఓ యువకుడు మంత్రిని తన్నినట్లు కనిపించింది. దాని తర్వాత బిష్ణు పౌడెల్ జనసమూహం నుండి తప్పించుకునేందుకు పరుగెత్తారు. అయినప్పటికీ, ఆగ్రహించిన జనం మళ్లీ ఆయనను వెంబడించారు.
ALSO READ: Gen Z Movement: దారుణం.. నేపాల్ మాజీ ప్రధాని భార్యను తగలబెట్టేసిన నిరసనకారులు
ఈ ఘటన నేపాల్‌లో జరుగుతున్న నిరసనల సందర్భంలో జరిగింది. దేశ యువత అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆగ్రహం కారణంగా.. సోషల్ మీడియా యాప్స్ నిషేదాన్ని ఎత్తి వేసినప్పటికీ. దేశంలో నిరసనలు ఆగలేదు. ఈ నిరసనలు జెన్-జెడ్ నాయకత్వంలో జరుగుతున్నాయి. ప్రభుత్వం నిరసనకారులపై చేసిన హింసాత్మక చర్యలలో ఇప్పటికే 20 మంది మరణించారు. దీని తర్వాత, కొందరు నిరసనకారులు పార్లమెంట్ భవనంలోకి చొరబడి దానికి నిప్పు పెట్టారు. అలాగే, ఒలీ నివాసం కూడా భక్తపూర్‌లోని బాల్కోట్ ప్రాంతంలో ఆందోళన పెద్ద ఎత్తున జరిగింది. నేపాల్ మాజీ ప్రధాని ఝాలానాథ్ ఖనాల్ భార్యను తగలబెట్టి చంపేశారు. సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఖాట్మండ్ పోలీసు ప్రతినిధి శేఖర్ ఖనాల్ ప్రకారం.. మంగళవారం విధించిన కర్ఫ్యూను చాలామంది పట్టించుకోలేదు. దేశంలోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు, దాడులు సంభవించాయి. గురువారం నాటికి సోషల్ మీడియా నిషేధం ఎత్తివేయబడినప్పటికీ.. అవినీతిని అరికట్టాలని ప్రజల డిమాండ్ కొనసాగుతోంది. నేపాల్‌లో పరిస్థితి నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి మరింత దిగజారుతోంది. ఈ ఘటనలు దేశంలోని ప్రజల ఆగ్రహాన్ని, అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తున్నాయి.