Trump On Oil: నిత్యం వార్తల్లో ఉండాలని భావిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అందుకోసం కామన్ పాయింట్ తీసుకుని పదే పదే మాటలు ఆడుతున్నారు. ఫలితంగా మదుపరులు అమ్మకాలకు పాల్పడ్డడంతో స్టాక్ మార్కెట్ పతనమవుతున్నాయి. ఈసారి చమురుపై కొత్త బాంబు పేల్చారు. ఇరాన్‌తో యుద్ధం త్వరగా ముగుస్తుందని, చమురు ధరలు భారీగా పడిపోతాయని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ఎన్నికల సభలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోరువిప్పారు. ఇరాన్ అణు ముప్పును ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించుకున్నారు. ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగుస్తుందని తేల్చేశారు. యుద్ధం ముగియగానే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పతమవుతాయని అన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకూడదనేది తమ ప్రధాన లక్ష్యమన్నారు. సైనిక చర్యలు త్వరలో ముగిసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.
అక్కడి నుంచి మేము బయటకు వస్తామని, ఆ తర్వాత చమురు ధరలు దిగి వస్తాయంటూ చెప్పారు. యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగాయన్న ట్రంప్, ఊహించినంతగా పెరగలేదన్నారు. ఇరాన్ సమస్యను చాలా ఏళ్ల కిందటే పరిష్కరించాల్సిందని ఉందని, పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు దక్కనివ్వమని స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని, ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. యుద్ధం ముగియాలనే తొందరలో ఏదో ఒక ఒప్పందాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేమన్నారు.
ట్రంప్ మాటల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు గురువారం 2 శాతానికిపైగా పెరిగింది. ప్రస్తుతం 103 డాలర్లకు అటు ఇటు ట్రేడింగ్ జరుగుతోంది. ఆయిల్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణంపై ప్రభావం పడుతుందన్న భయాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా పెట్టుబడుదారులు అమ్మకాలకు పాల్పడ్డారు. యూఎస్ బాండ్లు, డాలర్‌వైపు నిధులను మళ్లిస్తున్నారు. దీంతో గురువారం ముంబై స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో నడుస్తోంది.
ALSO READ: అమెరికా చదువులు ఖరీదు బాబోయ్.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ ఝలక్, ఇకపై రూ. 67 లక్షలు
గురువారం ఉదయం 12 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 650 పాయింట్ల నుంచి 900 పాయింట్లు నష్టపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 130 పాయింట్ల నుంచి 330 పాయింట్లు పడిపోయింది. ప్రస్తుతం కోలుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఫలితంగా రెండు గంటల వ్యవధిలోనే రూ. 7 లక్షల కోట్లకుపైగా మదుపరుల సంపద ఆవిరైంది.