Trump US Recession| ప్రపంచ దేశాలపై పరస్పర సుంకాల విధానంతో అమెరికా విరుచుకుపడుతోంది. దీంతో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులవుతున్నాయి. అయితే ఇదే పరిస్థితి అమెరికాలో కూడా కనిపిస్తోంది. ఆర్థిక మాంద్య భయాలు వ్యాపిస్తుండడంతో.. అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో కుదేలవుతున్నాయి. వరుసగా రెండవ రోజు వాల్‌స్ట్రీట్‌లో రక్తపాతం జరిగినట్లు అనేక కంపెనీల షేర్లు భీకరంగా క్రాష్ అయ్యాయి. అయితే ఈ పరిణామాలతో బెదిరిపోవాల్సిందేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
మార్కెట్ క్రాష్ భయాలను పట్టించుకోని ఆయన.. తన టారిఫ్ విధానానికి దృఢంగా కట్టుబడి ఉంటానని, అందులో ఎలాంటి మార్పులు చేయడానికి తిరస్కరించారు. టారిఫ్ విధానం వల్ల అమెరికాకు విదేశీ పెట్టుబడులు అధికంగా వస్తున్నాయని, ఇదే చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో సంపదను సృష్టించే స్వర్ణావకాశం అని తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో ఓ పోస్ట్ చేశారు.
Also Read: హిందూ మహాసముద్రంలో అమెరికా యుద్ధవిమానాలు.. మరో యుద్ధం ప్రారంభమా?
ఇంకా తన నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సూపర్ ఛార్జ్‌లా పనిచేస్తుందని.. ఈ టారిఫ్‌ల వల్ల వ్యాపారాలకు నష్టం కలగలేదని పట్టుబట్టారు. తాను విధించిన పరస్పర సుంకాల వల్ల దిగుమతులు తగ్గి.. కంపెనీలు అమెరికాలోనే ఉత్పత్తిని ప్రారంభిస్తాయని ట్రంప్ దృఢంగా నమ్ముతున్నారు. ఇది ఉద్యోగాలు సృష్టించడమే కాకుండా.. అమెరికా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా రూపాంతరం చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
మాంద్యం కాదు, ఇది ఆర్థిక విప్లవం.. విజయం మనదే : ట్రంప్
చైనా, భారతదేశం తదితర దేశాలపై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో.. చైనా తనపై విధించిన 34% ప్రతిఫల సుంకాలకు ప్రతిగా అమెరికన్ వస్తువులపై అదే రేటు అదనపు సుంకాలు విధించింది. ఈ సంక్లిష్ట పరిస్థితిలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాలను ‘ఆర్థిక విప్లవం’గా పేర్కొన్న ఆయన.. ఇది సవాళ్లతో కూడిన ప్రయాణమేనని, కానీ తుదికి విజయం అమెరికాదేనని దేశవాసులను ధైర్యం చేశారు.
“అమెరికాతో పోలిస్తే చైనాకు ఎక్కువ దెబ్బ తగిలింది. చైనా తోబాటు అనేక దేశాలు దశాబ్దాలుగా మనతో అన్యాయంగా వ్యవహరించాయి. మనం మాత్రం నిస్తేజంగా నిశ్శబ్దంగా కూర్చున్నాం. కానీ ఇక మాత్రం అలా జరగదు. మన ఉద్యోగాలు, వ్యాపారాలను గతంలో లేని విధంగా పునరుద్ధరిస్తున్నాం. ఇప్పటికే 5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాం. ఇది ఒక ఆర్థిక విప్లవం. దీనిలో మనమే విజేతలం. ఇది సులభమైన ప్రయాణం కాదు, కానీ తుది ఫలితం చరిత్ర సృష్టిస్తుంది” అని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో వివరించారు.
మరోవైపు.. అధిక ద్రవ్యోల్బణంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న అమెరికాలో ఈ కొత్త టారిఫ్‌ల వల్ల వస్తువుల ధరలు మరింత ఎగిరిపోతున్నాయి. ఫలితంగా అమెరికన్లు స్టోర్‌లకు క్యూలు వేస్తున్నారు. ధరలు పెరగకముందే సామాగ్రిని స్టాక్ చేసుకుంటున్నారు. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ వస్తువుల డిమాండ్ పెరిగింది. ఈ టారిఫ్ యుద్ధం ప్రపంచ మార్కెట్లను కుదిపేసినట్లే అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా భారీ పతనాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఇదే సమయంలో.. ఈ కొత్త టారిఫ్ విధానం అమెరికాకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ట్రంప్ పాలనలో వైట్ హౌస్ అధికారాల దుర్వినియోగం జరుగుతోందని భావిస్తున్నాను. ఈ తాజా ఆర్థిక నిర్ణయాలు గంభీరమైన ఆందోళనకు కారణమవుతున్నాయి” అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.