BigTV English
Advertisement

Oval Test: ఐదో టెస్టుకు జస్ప్రీత్ బూమ్రా దూరం?

Oval Test: ఐదో టెస్టుకు జస్ప్రీత్ బూమ్రా దూరం?

Oval Test: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న అండర్సన్ – టెండూల్కర్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. ఈ ట్రోఫీలో చివరి టెస్ట్ కు జట్టు కూర్పు భారత్ కి సవాల్ గా మారింది. ఈ సిరీస్ లో భాగంగా భారత్ – ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్ జూలై 31 నుండి లండన్ వేదికగా ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిచి లేదా డ్రా గా ముగించైనా సిరీస్ ని సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తుంటే.. భారత్ మాత్రం ప్రత్యర్ధిని ఓడించి సిరీస్ ని సమం చేయాలని పట్టుదలతో ఉంది.


Also Read: RJ Mahvash: చాహల్ ని చీటింగ్ చేసిన ఆర్జే మహ్వాష్..? ఒకరి భర్తను దొంగిలించడం నేరం అంటూ..!

ఎందుకంటే ప్రస్తుతం ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1 తో ఆదిక్యంలో ఉంది. మరొక టెస్ట్ డ్రా గా ముగిసింది. ఇక అయిదవ టెస్ట్ జులై 31 నుండి కెన్నింగ్టన్ ఓవల్ లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కి భారత తుది జట్టు ఎలా ఉంటుంది..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మాంచెస్టర్ టెస్ట్ లో నిరాశపరిచిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఈ చివరి టెస్ట్ కి అందుబాటులో ఉండడం సందేహమే. ఈ సిరీస్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన బుమ్రా పై పని ఒత్తిడి, వెన్నునొప్పి భారం పడనుంది.


ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బిసిసిఐ వైద్యులు బుమ్రా కి విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇదే జరిగితే పేస్ దళంలో ఆకాష్ దీప్ ఉండడం ఖాయం. అయితే ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడతానని బుమ్రా ముందే తెలియజేశాడు. ఆ మూడు మ్యాచ్ లు ఇప్పటికే ఆడేశాడు. ఇక మొహమ్మద్ సిరాజ్ వరుసగా నాలుగు మ్యాచ్ లు ఆడాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా వీరిద్దరికీ చివరి టెస్ట్ లో విశ్రాంతి ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. మరోవైపు నాలుగవ టెస్ట్ కి ముందు ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్ గాయపడ్డారు.

ఇక అన్షుల్ కాంబోజ్ తన తొలి మ్యాచ్ లో తీవ్ర నిరాశపరిచాడు. ప్రసిద్ద్ కృష్ణ కూడా చెప్పుకోదగ్గ ఫామ్ లో లేడు. దీంతో కీలకమైన 5వ టెస్టులో భారత ఫాస్ట్ బౌలింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదవ టెస్టులో బుమ్రా ఆడే విషయాన్ని టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కొట్టి పారేయలేదు. బూమ్రా ప్రస్తుతం ఫిట్ గానే ఉన్నాడని తెలియజేశాడు. పనిభార నిర్వహణలో భాగంగా ఈ సిరీస్ లో బుమ్రా తో మూడు టెస్ట్ లు మాత్రమే ఆడించాలని జట్టు మేనేజ్మెంట్ ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే.

Also Read: Windies vs Australia T20 series: విండీస్ కోట బద్దలు కొట్టిన కంగారులు.. మొత్తం ఐదుకు ఐదు

ఈ మూడు మ్యాచ్ లని ఇప్పటికే బుమ్రా ఆడేశాడు. కానీ భారత్ కి పేస్ ప్రత్యామ్నాయాలు ఆశించిన స్థాయిలో లేని నేపథ్యంలో.. చివరి టెస్ట్ లో బుమ్రా ని ఆడించే అవకాశం ఉంది. ఈ క్రమంలో బుమ్రా ఫీట్ గానే ఉన్నాడని, గత మ్యాచ్ లో అతడు ఒక్క ఇన్నింగ్స్ లోనే బౌలింగ్ చేశాడని, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఫిజియో, కెప్టెన్ అతడి గురించి చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని తెలియజేశాడు సితాంశు. కానీ ఇప్పటివరకు బుమ్రా విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని పేర్కొన్నాడు. ప్రస్తుతానికి తమ పేసర్లు అందరూ ఫీట్ గా ఉన్నారని గంభీర్ ఇంతకుముందే తెలిపాడు. ఇక ఈ సిరీస్ లో ఇప్పటివరకు బుమ్రా 14 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.

Related News

RCB ON SALE: అమ్ముడుపోయిన RCB, WPL జ‌ట్లు.. మార్చి నుంచే కొత్త ఓన‌ర్ చేతిలో !

Indian Womens Team: ప్ర‌ధాని మోడీకి వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌ల స్పెష‌ల్ గిఫ్ట్‌..”న‌మో” అంటూ

IND VS SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌..ష‌మీకి నిరాశే, పంత్ రీ ఎంట్రీ, టీమిండియా జ‌ట్టు ఇదే

Bowling Action: ముత్త‌య్య, భ‌జ్జీ, వార్న్‌, కుంబ్లే అంద‌రినీ క‌లిపేసి బౌలింగ్‌.. ఇంత‌కీ ఎవ‌డ్రా వీడు!

WI vs NZ 1st T20i: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్

pak vs sa match: గ‌ల్లీ క్రికెట్ లాగా మారిన పాకిస్తాన్ మ్యాచ్‌… బంతి కోసం 30 నిమిషాలు వెతికార్రా !

Jemimah Rodrigues Trolls: ఆ దేవుడి బిడ్డే లేకుంటే, టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేదే కాదు.. హిందువుల‌కు కౌంట‌ర్లు ?

Jemimah Rodrigues: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. జెమిమా బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెంపు.. ఎన్ని కోట్లు అంటే

Big Stories

×