Illu Illalu Pillalu Today Episode july 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. శారదాంబ ఎంత చెప్పినా కూడా సేన భద్రావతి వినకుండా ప్రేమ కష్టపడడం మాకు నచ్చలేదు అంటూ బాధపడతారు. ఇక ధీరజు వాళ్ళ నాన్న జీవితంలో ఇంకా తన మొహం చూడడని బాధపడుతూ తన అన్నయ్యలతో చెప్పుకుంటూ ఉంటాడు. ఇంట్లో జరిగిన గొడవకి నీకు ఏ సంబంధం లేదు రా.. నిన్నెందుకు నాన్న దూరం పెడతాడు నువ్వేం బాధపడకు అని ఓదారుస్తారు. ఇప్పటివరకు నేను ఆ ప్రేమను పెళ్లి చేసుకోవడం వల్ల నా మీద కోపంగా ఉన్నారు నాన్న. ఇప్పుడు ఆ ప్రేమ వల్లే జరిగిన అవమానం వల్ల నాకు శాశ్వతంగా దూరమైపోతాడని కన్నీళ్లు పెట్టుకుంటాడు ధీరజ్.. తన తమ్ముడుకు అన్నలు తోడుగా ఉంటారు. ఇంట్లో జరుగుతున్న వాటిని చూసి శ్రీవల్లి సంతోషపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చందు వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్తుంటే శ్రీవల్లి ఆపుతుంది. నా తమ్ముళ్ళ అంత బాధ పడుతుంటే నేను ఇక్కడ ఎలా ఉంటాను అనుకుంటున్నావు. ఈరోజు నేను నా తమ్ముడు దగ్గరే పడుకుంటాను అని మళ్లీతో అంటాడు. మీకు మీ తమ్ముళ్లే ముఖ్యం నేనంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వు లేకుండా ఉంటే నాకు నిద్ర పట్టదు బావ లోపలికి వెళ్దాం పద అని తీసుకెళ్లి పోతుంది. మీ తమ్ముళ్ళతో నిన్ను అసలు కలవనివ్వను అని అంటుంది. సాగర్, ధీరజ్ లు మాత్రం ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఇదంతా జరిగిందని బాధపడుతూ ఉంటారు..
తర్వాత రోజు ఉదయం రామరాజు రైస్ మిల్లులకు వెళ్తాడు.. ప్రేమ వల్ల ఫ్యామిలీ అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. తన కొడుకులు ముగ్గురు తండ్రి బాధని పోగొట్టాలని రైస్ మిల్లుకు వస్తారు. ధీరజ్ ని వెళ్లి నాన్నతో మాట్లాడు అని అంటారు. రామరాజు కాళ్ళ మీద పడి నన్ను క్షమించు నాన్న అని ఎంత వేడుకున్నా సరే మౌనంగా ఉండిపోతాడు రామరాజు.. నా తప్పుందో లేదో నాకు తెలియదు నాన్న నేను మాత్రం మీ బాధను చూడలేకపోతున్నాను రండి ఇంటికి వెళ్లి పోదామని బ్రతిమలాడుతాడు.
కానీ రామరాజు మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. నిన్నిలా చూడలేకపోతున్నాను నాన్న నువ్వు వచ్చేసేయ్ వెళ్లిపోదామని ధీరజ్ అడుగుతాడు. నేను నువ్వు తెచ్చిన చొక్కాని ఎంతో ప్రేమగా వేసుకున్నాను కదరా కానీ నువ్వు మాత్రం నాకు అవమానాన్ని మిగిల్చావు అని రామరాజు అంటాడు. ఈ అవమానాలన్నీ ఆ ప్రేమను పెళ్లి చేసుకోవడం వల్లే.. పాతికేళ్లగా మన ఇంటి మధ్య జరుగుతున్న గొడవలు గురించి నీకు తెలుసు తెలిసి కూడా నువ్వు నన్ను మోసం చేశావు. నిన్ను నమ్మమంటావు. తెలిసి చేసిందాన్ని తప్పుని ఎలా అంటారు. నేను నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని చూసిన ప్రతిసారి ఇలానే జరుగుతుంది అని రామరాజు అంటాడు. దానికి ధీరజ్ నా కర్మ నాన్న అని అంటాడు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోండి అని రామరాజు చెప్తాడు.
నన్ను ఇంకా నాన్న జీవితంలో క్షమించడు అని ధీరజ్ బాధపడతాడు. వేదవతి ఇంట్లో వంట చేసేందుకు అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. ప్రేమ నర్మదా వేదవతి దగ్గరికి వస్తారు.. అత్తయ్య కోపంలో కూడా చాలా అందంగా ఉంది అని పరాచకాలు ఆడతారు. అసలే కోపంలో ఉన్న వేదవతి కూరగాయలను విసిరి కొడుతుంది. ఎందుకు నమ్మాలి మిమ్మల్ని నాకేం మిగిల్చారు మీరు. నన్ను ఒక మోసగత్తెను చేశారు. జీవితంలో నా మాట నమ్మాలంటే భయంగా ఉందన్న ఆయన మాటని మారుస్తారా? నా మీద ఒట్టేసి అత్త చచ్చిన పర్వాలేదని నువ్వు వెళ్లి డాన్స్ క్లాసులు చెప్పావా అని వేదవతి సీరియస్ అవుతుంది.
Also Read : అవని దెబ్బకు పల్లవికి మైండ్ బ్లాక్.. చక్రధర్ కు నిజం తెలిసిపోతుందా..?
అటు నర్మదా వేదవతి తరపున వక్కత పుచ్చుకొని మాట్లాడుతుంది. అసలు నువ్వు మాట్లాడద్దు అని వేదవతి నర్మదపై సీరియస్ అవుతుంది. ఇంట్లో ఇదంతా జరగడానికి కారణం నువ్వే. ప్రేమ పిరికిది నువ్వే దానికి ధైర్యాన్ని నూరిపోసి ఇలా మాట్లాడించావు ఇలా చేశావు అంటూ వేదవతి అరుస్తుంది. మిమ్మల్ని నేను ఎంతగా నమ్మాను.. ఫ్రెండ్స్ లాగా ప్రతిదీ మీకు చెప్తూ వచ్చాను. కానీ మీరు మాత్రం నన్ను ఇలా మారుస్తారని అస్సలు ఊహించలేదు. మా పెళ్లయిన ఈనెలలో ఆయన ఇంత బాధ ఎప్పుడు పడలేదు కేవలం మీ వల్లే ఆయన బాధపడుతున్నారని కోడళ్ళపై కోపంతో రగిలిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..