BigTV English

Undivided India Meteorological: సమైక్య భారత్ కోసం అతిథులుగా పాక్, బంగ్లా.. రూ.150 నాణెం విడుదల చేయనున్న ప్రభుత్వం

Undivided India Meteorological: సమైక్య భారత్ కోసం అతిథులుగా పాక్, బంగ్లా.. రూ.150 నాణెం విడుదల చేయనున్న ప్రభుత్వం

Undivided India Meteorological| భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ‘సమైక్య భారత్’ (Undivided India) అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి వేరుపడి ప్రత్యేక దేశాలుగా ఏర్పడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ప్రతినిధులు అతిథులుగా రానున్నారు. భారతదేశంతో రాజకీయంగా విభేదాలున్నా.. వాటిని పక్కన బెట్టి.. భారత వాతావరణ శాఖ (ఇండియన్ మిటియోరాలిజికల్ డిపార్ట్‌మెంట్ -IMD) 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ఉపఖండంలోని దేశాలన్నింటికీ ఆహ్వానం అందింది.


ఇండియా పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, మాల్దీవ్స్, శ్రీలంక, నేపాల్ దేశాల ప్రతినిధులు.. జనవరి 15, 2025న జరుగనున్న సమైక్య భారత్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ దేశాలతోపాటు మిడిల్ ఈస్ట్ దేశాలు (గల్ఫ్ దేశాలు), సెంట్రల్, సౌత్ వెస్ట్ ఏషియా దేశాలకు కూడా భారత ప్రభుత్వం ఆహ్వానం పంపింది.

సమైక్య భారత్ కార్యక్రమం ఆహ్వానాన్ని పాకిస్తాన్ స్వీకరిస్తున్నట్లు ఇప్పటికే ధృవీకరించింది. బంగ్లాదేశ్ ఈ కార్యక్రమానికి రానున్నట్లు ఇంకా ధృకరించలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో ఇండియాకు రాజకీయ విభేదాలు ఉండడంతో బంగ్లాదేశ్ అధికారులు రాకపోయినా ఆశ్చర్యం లేదు. కానీ ఒకవేళ బంగ్లాదేశ్ ప్రతినిధులు వస్తే.. ఈ కార్యక్రమం ఒక చారిత్రక వేడుకలా మారుతుందని.. అన్ని దేశాల ప్రతినిధులు వేడుకల్లో పాల్గొనాలనే తాము కాంక్షిస్తున్నామని భారత వాతావరణ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు.


Also Read:  భూమిపై నిప్పులు చెరిగిన సూర్యుడు.. 2024లో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్.. మరి 2025లో

సమైక్య భారత్ కార్యక్రమాన్ని గుర్తుండిపోయేలా అట్టాహాసంగా నిర్వహించడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖలు సహకారం అందిస్తున్నాయని.. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమైక్య భారత్ 150 సంవత్సరాలకు చిహ్నంగా రూ.150ల ప్రత్యేక నాణెం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జనవరి 26, 2025న రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ లో భారత వాతావరణ శాఖ 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ప్రత్యేక శకటానికి హోం మంత్రిత్వశాఖ అనుమతినిచ్చింది.

భారత వాతావరణ శాఖ చరిత్ర
జనవరి 15, 1875లో ఇండియన్ మిటియోరాలిజికల్ డిపార్ట్‌మెంట్ ని బ్రిటీషర్ల హయాంలో ప్రారంభించారు. కానీ వాతావరణంపై సమాచారాన్ని సేకరించే నిపుణులు అంతకుముందుగానే ఉన్నారు. భారత దేశంలో మొట్టమొదటి సారిగా వాతావారణ అబజర్వేటరీలను బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించింది. కలకత్తా అబ్జర్వేటరీ 1785లో ప్రారంభం కాగా.. మద్రాస్ అబ్జర్వేటరీ 1796లో, బాంబే అబ్జర్వేటరీ 1826లో ప్రారంభమైంది. ఆ తరువాత 19వ శతాబ్దంలో మరిన్ని అబజర్వేవేటరీలు స్థాపించారు.

అయితే 1864లో కలకత్తాలో భారీ తుపాను భీభత్సం సృష్టించింది. ఆ తరువాత 1866, 1871లో రెండు సార్లు భారీ వర్షాల సూచికలను ముందుగానే పసిగట్టలేకపోయారు. దీని వల్ల బెంగాల్ లో కరువు, ఆకలి చావులు జరిగాయి. ఈ పరిణామాలతో బ్రిటీష్ రాజ్ వాతావరణాన్ని ముందుగానే తెలుసుకునేందుకు, డేటా విశ్లేషణ కోసం జాతీయ స్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 1875లో ఇండియన్ మిటియోరాలిజికల్ డిపార్ట్‌మెంట్ స్థాపించారు. అప్పటినుంచి ఐఎండి ప్రధాన కార్యాలయం కలకత్తా నగరంలోనే ఉంది. ఆ తరువాత 1905లో షిమ్లాకు దీన్ని మార్చారు. మళ్లీ 1928లో పుణెకి మార్చారు. ఆ తరువాత 1944లో చివరిసారిగా ఢిల్లీకి షిఫ్ట్ చేశారు.

కానీ కాలక్రమంలో భారత వాతావరణ శాఖ ఆసియా ఖండానికే వాతావరణ మానిటరింగ్ లో నాయకత్వం వహించింది. ఈ మార్పులన్నీ 1947లో దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాతే వచ్చాయి. స్వాతంత్ర్యం తరువాత ఈ రంగంలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించింది. మొదట్లో ఐఎండి ఇతర దేశాలకు సైతం వాతావరణ హెచ్చరికల కోసం టెలీగ్రామ్ ఉపయోగించేది. కానీ మొట్టమొదటి సారి మెసేజ్ స్విచింగ్ కంప్యూటర్లు ఉపయోగించి గ్లోబల్ డేటా ఎక్స్‌చేంజ్ టెక్నాలజీ కి శ్రీకారం చుట్టింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోతో సంయుక్తంగా ఐఎండి సొంతంగా జియోస్టేషనరీ శాటిలైట్ INSAT ని లాంచ్ చేసింది. ఈ శాటిలైట్ 24 గంటలూ వాతావరణంలో మార్పులు, తుపాను హెచ్చరికలు ఇస్తూనే ఉంటుంది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×