BigTV English

Indians USA Ban: అమెరికాలో ఎప్పుడూ అడుగుపెట్టలేరు.. భారతీయులకు భారీ వార్నింగ్

Indians USA Ban: అమెరికాలో ఎప్పుడూ అడుగుపెట్టలేరు.. భారతీయులకు భారీ వార్నింగ్

Indians USA Ban|  అమెరికాలో ఉంటున్న భారతీయులు ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. చిన్న తప్పు దొర్లితే చాలు అమెరికా నుంచి తిరిగి స్వదేశాలకు భారతీయులను సాగనంపేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక విభాగమే నడుపుతోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం అమెరికాలో నివసించే ఉన్న భారతీయులకు ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. వారి వద్ద ఉన్న వీసా గడువు ముగిసిన తరువాత కూడా అమెరికాలోనే నివసిస్తూ ఉంటే, వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.


తమ వీసా గడువు ముగిసిన తరువాత కూడా అక్కడే ఉంటే, వారు బహిష్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో మళ్లీ అమెరికాలో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోతారు. అంటే, శాశ్వత నిషేధానికి గురవుతారు అని యూఎస్ ఎంబసీ ఇండియా తమ ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది.

ఈ హెచ్చరిక విద్యార్థి వీసా, పర్యాటక వీసా, వర్క్ పర్మిట్ వీసాలు వంటి వివిధ రకాల వీసాలతో అమెరికాలో ఉంటున్న భారతీయులకు వర్తించుతుంది. ఎవరికైనా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండడం జరుగితే, వారు అమెరికా చట్టాలను ఉల్లంఘించినవారిగా పరిగణించబడతారు. తద్వారా, వారు భవిష్యత్తులో ఎప్పుడూ మళ్లీ అమెరికాలోకి ప్రవేశించలేరు.


గడువు ముగిసిన తర్వాత ఏవైనా అనుకోని సమస్యలు ఎదురైతే, శరణు పొందేందుకు వారు.. అమెరికా పౌర, ఇమ్మెగ్రేషన్ శాఖ (U.S. Citizenship and Immigration Services)ను సంప్రదించవలసి ఉంటుంది అని ఎంబసీ పేర్కొంది.

Also Read: పాకిస్తాన్‌తో ట్రంప్ రహస్య ఒప్పందం.. ఆపరేషన్ సిందూర్‌కు ముందే అంతా ఖరారు

ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ కూడా ఒక ప్రకటన చేశారు. వీసా గడువు ముగిసి పోయి..  30 రోజులు దాటిన తర్వాత కూడా అమెరికాలోనే ఉంటే, అటువంటి వ్యక్తులు ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. లేకపోతే, వారిని క్రిమినల్ కేసుల కింద అరెస్ట్ చేసి జైలులో (డిటెన్షన్ సెంటర్) ఖైదు చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా, భారీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

అమెరికా నుంచి విదేశాలకు డబ్బు పంపితే 5 శాతం పన్ను..
అమెరికాలో ఉన్న విదేశీయులు తమ దేశాలకు పంపే డబ్బుపై 5% పన్ను విధించాలని ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది ప్రవాస భారతీయులకు ఆర్థికంగా భారంగా మారే అవకాశం ఉంది. ఈ పన్ను వల్ల భారత్‌కు పంపే మొత్తంలో సుమారు 1.6 బిలియన్‌ డాలర్ల భారం పడనుందని అంచనా. అమెరికా నుంచి 2023–24 సంవత్సరంం లో 32.9 బిలియన్‌ డాలర్ల రెమిటెన్సులు ఇండియాకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఈ పన్ను గ్రీన్‌ కార్డు, హెచ్‌1బీ వీసాదారులకు వర్తిస్తే, 4 కోట్ల మందిపై ప్రభావం పడనుంది. ఇది అమెరికన్‌ పౌరులకు వర్తించదు. ప్రపంచంలో అత్యధిక రెమిటెన్సులు అందుకునే దేశంగా భారత్‌ మొదటి స్థానంలో ఉంది.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×