E-Paper
Advertisement

OTT Movie : అది స్కూల్ కాదు దెయ్యాల కోట… మంత్రాలతో మెంటల్ ఎక్కించే హారర్ థ్రిల్లర్

OTT Movie : అది స్కూల్ కాదు దెయ్యాల కోట… మంత్రాలతో మెంటల్ ఎక్కించే హారర్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : హారర్ సినిమాలను చూడటానికి చాలా మందికి ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అయితే వీటిని ఒంటరిగా చూడాలంటే మాత్రం చాలా కష్టంగా  ఉంటుంది. ఎవరైనా తోడు ఉంటేనే చూసే ధైర్యం చేయగలుగుతారు. పైకి ధైర్యం చూపించినా లోపల వణికిపోతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ, ఒక కాన్వెంట్‌లో జరిగే హత్యల చుట్టూ తిరుగుతుంది.  ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

గ్రేస్‌కు తన సోదరుడు మైఖేల్, మౌంట్ సేవియర్ కాన్వెంట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించాడని తెలుస్తుంది. అతను ఫాదర్ కరోల్‌ను హత్య చేసి, తర్వాత సముద్రం పైన ఉన్న రాళ్లపై దూకి, ఆత్మహత్య చేసుకున్నాడని అక్కడి వాళ్ళు గ్రేస్‌కు సమాచారం ఇస్తారు. గ్రేస్‌కు చర్చి వివరణపై సందేహం కలుగుతుంది. ఆమె స్వయంగా విచారణ చేయడానికి కాన్వెంట్‌కు వెళ్తుంది. అక్కడ డిటెక్టివ్ హారిస్ సహాయంతో, ఈ కాన్వెంట్ డీమనాలజీతో సంబంధం కలిగి ఉందని తెలుసుకుంటుంది. సుపీరియర్ మదర్ గ్రేస్‌కు మైఖేల్ డెమన్ ప్రభావంలో ఉన్నాడని, అందుకే ఈ మరణాలు జరిగాయని చెబుతుంది. గ్రేస్ తన సోదరుడి శవాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. ఇక గ్రేస్‌ హాస్పిటల్‌లో కోలుకున్న తర్వాత, ఫాదర్ రొమెరోను ఆమె కలుస్తుంది. అతను వాటికన్ నుండి కాన్వెంట్‌ను శుద్ది చేయడానికి వస్తాడు.

ఈ సమయంలో గ్రేస్ తన గతం గురించి కూడా కొన్ని నిజాలను తెలుసుకుంటుంది. గ్రేస్‌ 10 ఏళ్ల వయసులో బీచ్‌లో ఒంటరిగా తిరుగుతున్నప్పుడు, ఆమెను పెంపుడు తండ్రి కనిపెట్టి తీసుకొచ్చాడని తెలుస్తుంది. ఆమె చుట్టూ ఎల్లప్పుడూ మరణాలు, విధ్వంసాలు జరుగుతుండటంతో, ఆమెను సైతాన్ బిడ్డ అని నమ్మాడని తెలుసుకుంటుంది. ఇది ఇలా ఉంటే సిస్టర్ బెత్, గ్రేస్‌ను హత్య చేయడానికి ప్రయత్నిస్తుంది. చివరికి మైఖేల్ చావుకు కారణం ఎవరు ? ఆత్మల వల్లే అతను చనిపోయాడా ? కాన్వెంట్‌లో దాగిఉన్న రహస్యాలు ఏంటి ? గ్రేస్‌ చుట్టూ విషాదాలు ఎందుకు జరుగుతున్నాయి ? బెత్, గ్రేస్‌ను ఎందుకు చంపాలనుకుంటుంది ?  అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : కొంప ముంచిన సెల్ఫీ… ఈ బి. టెక్ బాబుకి ఎన్ని కష్టాలో

 

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ 

ఈ సూపర్‌ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కన్సెక్రేషన్’ (Consecration). 2023 లో వచ్చిన ఈ మూవీకి క్రిస్టోఫర్ స్మిత్ దర్శకత్వం వహించారు. ఇందులో జెనా మలోన్, డానీ హస్టన్, జానెట్ సుజ్మాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ స్టోరీ గ్రేస్ అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన సోదరుడు మృతి వెనుక అసలు రహస్యం కనిపెట్టడానికి స్కాట్లాండ్‌లోని ఒక కాన్వెంట్‌కు వెళ్తుంది. అసలు స్టోరీ అక్కడే మొదలౌతుంది. ఈ మూవీ యునైటెడ్ స్టేట్స్‌ థియేటర్లలో 2023 ఫిబ్రవరి 10 విడుదలైంది. ఈ మూవీ జియో హాట్ స్టార్ (Jio hot star) అమెజాన్ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video ) లలో స్ట్రీమింగ్ అవుతోంద

Related News

200 ఏళ్ల వెనక్కి వెళ్లే ప్రేమికులు… అడుగడుగునా డేంజరస్ ట్విస్టులు… టైమ్-ట్రావెల్ విజువల్ వండర్

చీకట్లో విరుచుకుపడ్డ వింత రాక్షసులు… 500 ఏళ్ల నాటి నిజం బట్టబయలు… అర్ధరాత్రి ఆ అడవిలో ఏం జరిగింది ?

మందు బాటిల్ వల్ల మొదలైన గొడవ… చివరికి క్రైమ్‌లో చిక్కుకున్న స్నేహితులు… ఫుల్ నవ్వులు

వైరస్ తో దేశాన్నే తుడిచిపెట్టే డేంజరస్ ప్లాన్… హై వోల్టేజ్ మైండ్ బ్లోయింగ్ మిషన్

అండర్‌వరల్డ్ దందాలతో ఆగమయ్యే సిటీ… గ్యాంగ్‌స్టర్ వార్ తో మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ల గ్లామర్ లైఫ్ వెనకున్న సీక్రెట్… సోషల్ మీడియా ఫాలోవర్స్ డోంట్ మిస్

పార్క్‌లో మొదలైన ప్రేమ… పెళ్లి తర్వాత ఊహించని మలుపులు.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

30 దాటినా పిల్లను ఇవ్వట్లేదు… ఈ బ్యాచిలర్ హంగామా చూస్తే నవ్వాగదు

Big Stories

Advertisement
×