BigTV English

US Bombers Iran: మిడిల్ ఈస్ట్‌లో భారీగా మోహరించిన అమెరికా సైన్యం.. ఇరాన్‌పై దాడికి స్టెల్త్ బాంబర్లతో సిద్దం

US Bombers Iran: మిడిల్ ఈస్ట్‌లో భారీగా మోహరించిన అమెరికా సైన్యం.. ఇరాన్‌పై దాడికి స్టెల్త్ బాంబర్లతో సిద్దం

US Bombers Iran| ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. మిడిల్ ఈస్ట్‌ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలాన్ని గణనీయంగా పెంచింది. ఇరాన్ నుంచి సంభవించే దాడుల నుంచి తమ మిత్రదేశం ఇజ్రాయెల్‌ను రక్షించడం కోసమే అమెరికా ఈ సైనిక చర్య చేపట్టింది.


అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ సైనిక చర్యలను ధ్రువీకరిస్తూ.. “మా సైనికుల భద్రత కోసం ఈ ఏర్పాట్లు చేశాము,” అని చెప్పారు. అమెరికా యుద్ధ విమానాలు, ఇంధన ట్యాంకర్లు, నావికాదళ నౌకలను మిడిల్ ఈస్ట్‌లో కీలక ప్రాంతాల్లో మోహరించింది. అవసరమైతే పెద్ద ఎత్తున దాడులకు సిద్ధంగా ఉన్నట్లు ఈ చర్యలు సూచిస్తున్నాయి.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఈ అంశంపై స్పందించారు. “ఇరాన్ యుద్ధ విమానాలను నియంత్రించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ” అని పోస్ట్ చేశారు. ట్రంప్ మాటలతో.. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయవచ్చనే చర్చలకు దారితీసింది. అయితే, అమెరికా అధికారులు ఇప్పటి వరకు తమ విమానాలు ఇరాన్ ఆకాశంలోకి ప్రవేశించలేదని, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంపైనే దృష్టి పెట్టామని చెప్పారు.


మోహరించిన గగన, నావిక దళ బలగాలు
సైనిక వివరాలు రహస్యంగా ఉన్నప్పటికీ, 12 F-16 యుద్ధ విమానాలను సౌదీ అరేబియాకు తరలించారు. అమెరికా విమానాలు మిడిల్ ఈస్ట్ ఆకాశంలో గస్తీ తిరుగుతున్నాయి. డియాగో గార్సియాలో B-52 బాంబర్లు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రం వంటి లోతైన భూగర్భ స్థావరాలను ధ్వంసం చేయగల 30,000 పౌండ్ల GBU-57 “బంకర్ బస్టర్” బాంబును మోసుకెళ్లే B-2 స్టెల్త్ బాంబర్లు ఇంకా మోహరించలేదు, కానీ అవి ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉన్నాయి.

యూరప్‌లోని యూకే, స్పెయిన్, జర్మనీ, గ్రీస్‌ దేశాలలో కూడా అమెరికా ఇంధన, యుద్ధ విమానాలను ఉంచిందని ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ఆరోరా ఇంటెల్ నివేదించింది. సముద్రంలో, USS ది సుల్లివన్స్, USS ఆర్లీ బుర్క్ వంటి అమెరికా డిస్ట్రాయర్లు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని, ఇజ్రాయెల్ భూభాగంలో ఆకాశ మార్గాన ప్రవేశించకుండా రక్షిస్తున్నాయి. USS కార్ల్ విన్సన్ నౌకాదళ గ్రూప్ అరేబియా సముద్రంలో ఉంది, USS నిమిట్జ్ కూడా అక్కడికి చేరుతోంది. USS జెరాల్డ్ R. ఫోర్డ్ యూరోపియన్ కమాండ్ థియేటర్‌కు వచ్చే వారంలో బయలుదేరనుంది.

భూతల సైన్యం, సైనిక సన్నాహాలు
అమెరికా ఇటీవల భూ సైన్యాన్ని కూడా పెంచింది. మూడో నేవీ డిస్ట్రాయర్.. మెడిటెర్రనియన్ సీ (తూర్పు మధ్యధరా సముద్రం)లోకి ప్రవేశించింది. మరో క్యారియర్ గ్రూప్ అరేబియా సముద్రం వైపు వెళ్తోంది. ఈ చర్యలు రక్షణాత్మకమని పెంటగాన్ చెప్పినప్పటికీ, అవసరమైతే ఇజ్రాయెల్‌కు నేరుగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.

మిడిల్ ఈస్ట్‌లో అమెరికా సైన్యం సంఖ్య సాధారణంగా 30,000 ఉండగా, ఇప్పుడు దాదాపు 40,000కి చేరింది. గత అక్టోబర్‌లో ఇరాన్ బెదిరింపులు, హౌతీల దాడుల సమయంలో ఈ సంఖ్య 43,000కి చేరింది. కొన్ని అమెరికా స్థావరాల్లోని కుటుంబాలకు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సైనిక స్థావరాలు హై అలర్ట్‌లో ఉన్నాయి.

Also Read: ఇరాన్ అణు బాంబులు తయారు చేయడం లేదు.. అమెరికా గూఢాచారుల రిపోర్ట్

ఈ చర్యలు అమెరికా సైనిక సన్నద్ధతను, ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉండేందుకు వాషింగ్టన్ సంకల్పాన్ని చూపిస్తున్నాయి. ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడం ఈ వ్యూహం లక్ష్యం. ఇరాన్ వద్ద కూడా బలమైన మిలిటరీతో పాటు, ఆయుధాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశముంది.

Related News

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

Big Stories

×