Big Stories

Dirty Bomb : ఉక్రెయిన్ “డర్టీ బాంబ్” అంటే ఏంటి..?

Dirty Bomb : రష్యా ఉక్రెయిన్ వార్ రోజురోజుకూ తీవ్ర మవుతోంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. వీరిద్దరి యుధ్దం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చర్చ జరుగుతోంది. మరో వైపు అణుబాంబులు కూడా ప్రయోగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ అంశంపై రష్యా తాజాగా చేసిన ప్రకటన ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఉక్రెయిన్ డర్టీ బాంబ్‌ను తయారు చేస్తుందని రష్యా ప్రకటించింది. ఇప్పటికే ఆ డర్టీ బాంబు తయారీని ఉక్రయిన్ మొదటిపెట్టిందని రష్యా డిఫెన్స్ మినిస్టర్ సెర్జీ శాయ్‌గు ప్రకటించారు.

- Advertisement -

డర్టీ బాంబ్ అంటే ఏంటి..? దాని వల్ల ఎంత వరకు ప్రాణ నష్టన జరగవచ్చు.. దాని తీవ్రత ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుందనే ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. అయితే డర్టీ బాంబ్ న్యూక్లయర్ బాంబ్‌తో పోలిస్తే కొంత తీవ్రత తక్కువగానే ఉంటుంది. కానీ ఈ డర్టీ బాంబ్ రైడియో ధార్మికతల వేవ్స్‌ను వాతావరణంలోకి పంపుతుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో ఉన్న జీవరాసులు, చెట్లు దెబ్బ తింటాయి. దీని వల్ల ఎలక్ట్రానిక్, భవనాలు కూడా పాడవుతాయని నిపుణులు అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News