WHO Chief Attack Yemen| ఐక్యరాజ్య సమితి (ఐరాస) విభాగమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) డైరెక్టర్ జెనెరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్‌పై గురువారం రాత్రి బాంబు దాడి జరిగింది. యెమెన్ దేశంలోని సనా ఎయిర్‌పోర్ట్ లో ఆయనపై జరిగిన వైమానిక దాడిలో ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ దాడిలో జెనెరల్ టెడ్రోస్ కు ప్రాణాపాయం తృటిలో తప్పింది.
యెమెన్ దేశ పర్యటన తరువాత జెనెరల్ టెడ్రోస్, తన సహచరులతో కలిసి సనా ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరేందుకు విమానంలో ఎక్కిన కొన్ని సెకండ్ల వ్యవధిలో ఎయిర్‌పోర్ట్ పై మిసైల్ దాడులు జరిగాయి. ఈ దాడిలో విమానాశ్రాయంలో ఇద్దరు చనిపోయారని, జెనెరల్ టెడ్రోస్ విమాన సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయని సమాచారం. యెమెన్ దేశంలో కొంత మంది ఐకరాజ్య సమితి సిబ్బందిని అక్కడ మిలిటెంట్లు ఖైదు చేశారు. వారిలో డబ్యూహెచ్‌వో కార్యకర్తలు కూడా ఉన్నారు. కిడ్నాప్ కు గురైన తమ సిబ్బంది విడుదల కోసం చర్చలు జరిపేందుకే జెనెరల్ టెడ్రోస్ యెమెన్ వెళ్లారని అంతర్జాతీయ మీడియా తెలిపింది.
సనా ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడి గురించి స్వయంగా డబ్యూహెచ్‌వో డైరెక్టర్ జెనెరల్ టెడ్రోస్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. “యెమెన్ లో మానవ సంక్షోభం, కిడ్నాప్‌కు గురైన ఐక్యరాజ్యసమతి సిబ్బంది విడుదల, అక్కడ ప్రజల ఆరోగ్య పరిస్థితులపై చర్చలు జరిపేందుకు యెమెన్ కు వెళ్లాను. ఆ పని పూర్తి అయింది. కిడ్నిప్ కు గురైన ఐరాస సిబ్బందిని వెంటనే మిలిటెంట్లు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అయితే ఈ క్రమంలో రెండు గంటల ముందు యెమెన్ లోని సనా ఎయిర్‌పోర్టులో నేను, మరి కొంతమంది నా సహచరులు విమానంలో బయలుదేరడానికి వచ్చాం. ఆ సమయంలోనే ఎయిర్‌పోర్టులో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడిలో ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, డిపార్చర్ లౌంజ్, విమానాల రన్‌వేలు ధ్వంసమయ్యాయి.
Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం
మేము రన్ వే నుంచి కొన్ని మీటర్ల దూరంలో ఉన్నాం. ఈ దాడిలో ఇద్దరు ఎయిర్ పోర్ట్ సిబ్బంది చనిపోయారు. మా విమాన సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. ఇప్పుడు రన్ వే రిపేరు అయ్యేంతవరకు మేము ఇక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి. నేను నా ఐరాస సహచరులు క్షేమంగానే ఉన్నాం. చనిపోయిన వారికి కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నాను” అని జెనెరల్ టెడ్రోస్ ట్వీట్ లో రాశారు.
ఈ హింసాత్మక ఘటనపై ఐరాస సెక్రటరీ జెనెరల్ ఆంటోనియో గుటెరెస్ స్పందించారు. సనా ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిని ఆయన ఖండించారు. అంతర్జాతీయ చట్టాలను అందరూ గౌరవించాలని, మానవ హక్కుల కార్యకర్తలపై దాడులు చేయకూడదని కోరారు. యెమెన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పెరుగుతున్న శత్రుత్వం, సనా ఎయిర్ పోర్ట్, రెడ్ సీ, పవర్ స్టేషన్స్ పై జరుగుతున్న దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. ” ”
సనా ఎయిర్ పోర్ట్ లో జరిగిన వైమానిక దాడుల్లో ముగ్గురు చనిపోయారని.. డజన్ల సంఖ్యలో జనాలు గాయపడ్డారని ఐరాస సెక్రటరీ జెనెరల్ ఆంటోనియో గుటెరెస్ తెలిపారు. ఇజ్రాయెల్, యెమెన్ మిలిటెంట్లు కాల్పుల విరమణ చేయాలని ఆయన అన్నారు.
ఈ దాడులు ఇజ్రాయెల్ కు చెందిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) చేసింది. యెమెన్ లోని హౌతీల కేంద్రాలను గుర్తించి వాటిపై ఐడిఎఫ్ వైమానికి దళం బాంబులు కురిపించింది. హౌతీ స్థావరాల్లో సనా ఎయిర్ పోర్ట్, హెజ్యాజ్, రాస్ కనతిబ్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి.