IB Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జులై 19న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే షార్ట్ నోటీస్ ను విడుదల చేశారు. దీనిలో ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. ఈ నియామక ప్రక్రియ విధానం హోం శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబందించిన ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం.
ఇంటెలిజెన్స్ బ్యూరోలో మొత్తం 3717 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ -2/ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నియామక ప్రక్రియ హోంశాఖ (Ministry of Home Affairs) ఆధ్వర్యంలో ఉండనుంది.
నోటిఫికేషన్ విడుదల తేది: 2025 జులై 19
మొత్తం వెకెన్సీల సంఖ్య: 3717
విద్యార్హత: డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. (కంప్యూటర్ నైపుణ్యం ఉంటే బెటర్)
వయస్సు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: మూడు దశల్లో ఉంటుంది. టైర్-1 పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), తర్వాత టైర్-2 (డెస్క్రిప్టివ్ టైప్), ఆపై ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ మూడు దశల్లో మెరిట్ సాధించిన వారికి ఉద్యోగం వస్తుంది.
జీతం: ఈ ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వ లెవల్- 7 పే స్కేల్ వర్తించనుంది.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు వేతనం లభిస్తుంది. ఇతర అలవెన్సులు, సదుపాయాలు కూడా ఉంటాయి. మరి అర్హత ఉన్నవారు జులై 19న విడుదలయ్యే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: Hyderabad: కలెక్టర్ హరిచందన కీలక నిర్ణయం.. ఇకపై స్కూల్ పిల్లలకు ‘యూ’ ఆకారంలో?
ALSO READ: AAI Recruitment: ఏఏఐలో 197 అప్రెంటీస్ ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు..