Assistant Manager Jobs: సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానమిక్ సర్వీస్(RITES) లో పలు ఉద్యోగాల భర్తీకిి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గుడ్‌గావ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానామిక్ సర్వీస్ (రైట్స్)… కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఫిబ్రవరి 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 18
ఇందులో అసిస్టెంట్ మేనేజర్(సివిల్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
కేటగిరీల వారీగా..
యూఆర్- 9
ఈడబ్ల్యూఎస్-1
ఓబీసీ-4
ఎస్సీ-2
ఎస్టీ-2
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 24
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 9 (ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 9లోగా అప్లై చేసుకోవాలి.)
విద్యార్హత: సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి పాసై ఉండాలి.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 జీతం ఉంటుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 42 ఏళ్ల వయస్సు మించరాదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600 ఉంటుంది. ఈడబ్ల్యూఎస్/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ వారికి రూ.300 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రాతపరీక్ష కేంద్రాలు: ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, గువాహటి, భువనేశ్వర్ లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.
పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.rites.com/
Also Read: Minister Sitakka: మంత్రి సీతక్క సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎందుకో తెల్సా..?
అర్హత ఉన్న ప్రతి అభ్యర్థులు అందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుది. సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి పాసై ఉన్న అభ్యర్థులు ఉద్యోగానికి అర్హులవుతారు. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్.