Big Stories

Congress : కాంగ్రెస్ లో కోవర్టిజం పెరిగింది .. రాజనర్సింహ సంచలన కామెంట్స్..

Congress : తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పీసీసీ కమిటీ కూర్పుపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాాజాగా సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్లుగా పార్టీలో కొత్త రోగం మొదలైందన్నారు. కోవర్టిజం అనే రోగం పెరిగిందని మండిపడ్డారు. కష్టపడే వారికన్నా కోవర్టులకే గుర్తింపు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

జిల్లాల్లో పార్టీ రివ్యూలు జరగడం లేదని రాజనర్సింహ మండిపడ్డారు. కొత్త కమిటీల్లో అనర్హులకు చోటు కల్పించారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇప్పుడు దీన స్థితిలో ఉందన్నారు. కార్యకర్తలను నిరుత్సాహపరిచే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ చరిత్ర, సిద్ధాంతాలు తెలియని వాళ్లకు పదవులు ఇవ్వడం ఏంటని నిలదీశారు. 3 నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం సరికాదని స్పష్టం చేశారు. అసలైన కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతోందన్నారు. బీసీలు, దళితులు, మైనార్టీలకు పార్టీలో గుర్తింపు లేదన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ పాట పాడుతూ కొంత మంది నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని రాజనర్సింహ ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఉంటూ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సిద్ధిపేటలో కోవర్టిజం జరుగుతోందన్నారు. 4 ఏళ్లుగా ఇదే విషయం చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. మొన్న కొండా సురేఖ, నిన్న బెల్లయ్య నాయక్.. నేడు రాజనర్సింహ ఇలా సీనియర్ నేతలు అసమ్మతిరాగం అందుకోవడం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. మరి పార్టీ అధిష్టానం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది?.. సీనియర్ నేతలను ఎలా బుజ్జగిస్తుందో చూడాలి మరి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News