Big Stories

Brain Infection:- చిన్నపిల్లల్లో గుర్తుతెలియని బ్రెయిన్ ఇన్ఫెక్షన్..

- Advertisement -

Brain Infection:- ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రాణాంతక వ్యాధులు అనేవి అటాక్ అవుతున్నాయి. తినే ఆహారం, గాలి కాలుష్యం, వాతావరణ మార్పులు, ఇమ్యూనిటీ లేకపోవడం.. ఇలా ఎన్నో కారణాలు చిన్నప్పటి నుండే మనుషుల ఆరోగ్యం దెబ్బతినడానికి కారణమవుతున్నాయి. తాజాగా పిల్లల్లో మెదడు ఇన్ఫెక్షన్స్‌ను కలిగించే ఒక క్లస్టర్‌ను కనిపెట్టారు అమెరికా శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఈ సమస్య 12 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు.

- Advertisement -

అమెరికాలో ఈ మధ్య చిన్నపిల్లల్లో ఎక్కువగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం మెదడులో ఉండే క్లస్టర్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్లస్టర్ గురించి వారికి ఎక్కువగా సమాచారం లేకపోయినా ఇది ప్రాణాంతకమైనదని మాత్రం వారు చెప్తున్నారు. గతేడాది నుండి బ్రెయిన్ అబ్సెసెస్ అనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇన్ఫెక్షన్ సోకినవారి సంఖ్య మూడింతలు పెరిగిందని స్టడీలో తేలింది. అందుకే శాస్త్రవేత్తలు దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టారు.

2015 నుండి 2021 మధ్యలో ఏడాదికి కనీసం అయిదు బ్రెయిన్ అబ్సెసెస్ కేసులు నమోదయ్యేవి. కానీ 2022లో మాత్రం ఒకే ఏడాదిలో 17 కేసులు నమోదయ్యాయి. అది కూడా వ్యాధి సోకిన వారందరూ 18 ఏళ్లలోపు ఉన్నవారే. చాలావరకు అందరూ 12 ఏళ్లు ఉన్నవారే అని, అంతే కాకుండా అందులో 76 శాతం అబ్బాయిలే అని తేల్చారు. వైద్యులు సైతం బ్రెయిన్ అబ్సెసెస్ వ్యాధి సోకుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరగడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా 2022 మార్చి తర్వాత కేసులు మరింత ఎక్కువయ్యాయని చెప్తున్నారు.

అసలు బ్రెయిన్ అబ్సెసెస్‌కు లక్షణాలు ఏంటో కనిపెట్టాలని పరిశోధనలు మొదలుపెట్టిన శాస్త్రవేత్తలకు ఒక కామన్ పాయింట్ కనిపించింది. ఈ వ్యాధి సోకిన పిల్లలందరూ చిన్నప్పుడు చెవి నొప్పి, సైనస్, ఎక్కువసార్లు తలనొప్పి, జ్వరం లాంటివి రావడం.. లాంటివి జరిగాయని పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇదంతా పరిశీలించి చూస్తే ఏదో పెద్ద సమస్య పొంచిఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకిన పిల్లలు ముందుగా సైనసైటిస్, మాస్టోడైటిస్ వంటి వ్యాధులతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని తెలుస్తోంది. మాస్టోడైటిస్ అంటే చెవి కింద బోన్‌ను ఎఫెక్ట్ చేసే ఒక ఇన్ఫెక్షన్.

అమెరికాలోని ప్రతీ రాష్ట్రంలో ఈ బ్రెయిన్ అబ్సెసెస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అయితే ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య కరెక్ట్‌గా ఉండకపోవచ్చని, ఇంకా కేసులు ఉండి ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ బ్రెయిన్ అబ్సెసెస్ వ్యాధికి చికిత్సను కనుగొని, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. అమెరికా వ్యాప్తంగా శాస్త్రవేత్తలు అంతా కలిసి ఈ పరిశోధనల్లో పాల్గొనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News