BigTV English

Kidney Problems : మూత్రం ఈ రంగులో ఉందా.. అయితే మీ కిడ్నీలు..?

Kidney Problems: భారత దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ప్రకారం మన దేశంలో 10 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని ఈ నివేదిక చెబుతుంది.

Kidney Problems : మూత్రం ఈ రంగులో ఉందా.. అయితే మీ కిడ్నీలు..?

Kidney Problems : భారత దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ప్రకారం మన దేశంలో 10 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని ఈ నివేదిక చెబుతుంది. 2010 నుంచి 2013 మధ్యలో సంభవించిన మరణాల్లో 15 నుంచి 69 ఏళ్లలోపు వారు కిడ్నీ ఫెయిల్యూర్ వల్లే చనిపోయారు.


  • కిడ్నీలు శరీరంలోని ఫ్లూయిడ్స్‌‌లో ఉన్న వ్యర్థాలను వేరుచేసి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. శరీరానికి హాని కలిగించే జీవ పదార్థాలు మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి.
  • శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. అవి శరీరంలో కాల్షియం, సోడియం, పొటాషియం, వంటి మినరల్స్ సమతులు స్థాయిలో ఉండేలా చూస్తాయి. ఎర్రరక్త కణాల నిర్మాణంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. రక్తంలోని పీహెచ్ లెవల్స్ సమతుల్యాన్ని కాపాడతాయి. అలానే శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపుతాయి.
  • శరీరంలో రక్తం శుద్ధి జరిగే క్రమంలో లవణాలు, గ్లూకోజ్ నీటిని కిడ్నీల ద్వారా రక్తకణాలు సేకరిస్తాయి. శుద్ధి ప్రక్రియ అనంతరం నరాల ద్వారా రక్తం శరీరం మొత్తం సరఫరా అవుతుంది.
  • శరీరంలోని నీటి నిల్వలను కిడ్నీలు సమతుల్యం చేస్తాయి. డయాబెటిస్, రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది. అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీయొచ్చు. డయాబెటిస్ రోగులు కిడ్నీ వ్యాధుల బారినపడుతున్నారు.
  • ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి శరీరం నుంచి మూత్రం రూపంలో కొద్దిమొత్తంలో ప్రొటీన్ బయటకు పోతుంది. ఈ ప్రొటీన్లు మూత్రం ద్వారా బయటకి వెళ్లిపోతే అది శరీరానికి చాలా ప్రమాదం. ఇలా జరగడానికి డయాబెటిస్ ప్రధాన కారణం. డయాబెటిస్ కంట్రోల్‌లో లేకపోతే ప్రోటీన్ మూత్రం రూపంలో బయటకి వెళ్లిపోతుంది.హైబీపీ, కిడ్నీ వ్యాధులు దీనికి ప్రధాన కారణం.
  • శరీరంలో ఇటువంటి ప్రక్రియ జరిగినప్పుడు “మూత్రం నురగతో వస్తుంది”. కొద్ది రోజుల తర్వాత చేతులు, కాళ్లలో వాపు కనిపిస్తుంది. వీటితో పాటు నీరసం, కడుపు నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చు.
  • మూత్రంలో నీరు, యూరియా, లవణాలు కలిసి ఉంటాయి. శరీరంలో ఎమినో యాసిడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లివర్ యూరియాను ఊత్పత్తి చేస్తుంది. శరీరంలోని ఫ్లూయిడ్స్ నుంచి వచ్చే ప్రధాన వ్యర్థ పదార్థం యూరియా. ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. శరీరంలోని ఫ్టూయిడ్స్‌ను కిడ్నీలు శుభ్రం చేస్తాయి. ఆ తర్వాత అవి రక్తంలో కలిసిపోతాయి.
  • సాధారణంగా మూత్రం ఎరుపు లేదా ముధురు గోధుమ రంగు, ఏదైనా ముదురు రంగులో వస్తే ఆ వ్యక్తి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. చాలా విషయాలు ఈ రంగులపైనే ఆధారపడి ఉంటాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×