Big Stories

Himalayan Salt : హిమాలయన్ ఉప్పు గురించి తెలుసా?

Himalayan Salt : హిమాలయన్ ఉప్పు.. సాధారణ ఉప్పుతో పాటు ఈ మధ్యకాలంలో హిమాలయన్ ఉప్పును కూడా వాడటం చాలామంది మొదలుపెట్టారు. హిమాలయ పర్వతాల్లో ఉండే గనుల నుంచి ఈ ఉప్పును వెలికి తీసి శుభ్రం చేస్తారు. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఈ హిమాలయన్ ఉప్పులో ఎన్నో పోషకాలు, మినరల్స్ ఉంటాయి. అందువల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ ఉప్పుకు బదులు హిమాలయన్‌ ఉప్పు వాడటం వల్ల మన శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. ఈ ఉప్పులో ఉండే పొటాషియం, ఐరన్, క్యాల్షియంవంటి మూలకాలు మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తాయి. బ్యాక్టీరియాని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. మామూలుగా మనం వాడే ఉప్పు కొంచెం ఎక్కువగా మోతాదులో తీసుకుంటే బీపీ పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో సోడియం అధికంగా ఉంటుంది. కానీ హిమాలయన్‌ ఉప్పులో సోడియం తక్కువగా ఉంటుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే కిడ్నీలపై భారం అధికంగా పడకుండా ఇది ఎంతో సహాయం చేస్తుంది. సాధారణ ఉప్పులో కృతిమంగా అయోడిన్ కలుపుతారు. కానీ హిమాలయన్ ఉప్పులో సహజ సిద్ధమైన అయోడిన్ ఉంటుంది. ఇది ఎలక్ట్రోల్స్‌ని సమతుల్యం చేస్తుంది. శరీరం పోషకాలను గ్రహించేలా చేస్తుంది. దీనివల్ల హైబీపీ కూడా తగ్గుతుంది . హిమాలయన్ సాల్ట్ తీసుకోవడం వల్ల శరీరంలో పీహెచ్ స్థాయిలు సమతుల్యంలో ఉంటాయి. ఈ ఉప్పులో ఉండే ఖనిజాలు మన రోగ నిరోధక శక్తి పెరిగేందుకు సహాయం చేస్తాయి. హిమాలయన్ ఉప్పును వాడడం వల్ల శ్వాసకోశ పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా సిఈవోపీడీ రోగులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. స్నానం చేసే నీటిలో కొద్దిగా హిమాలయన్‌ ఉప్పును కలుపుకొని స్నానం చేస్తే చర్మం సంరక్షించబడుతుంది. సూక్ష్మక్రిములు కూడా నశిస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News