EPAPER

Agniveer Compensation| ‘ఆర్మీ జవాన్ తో సమానంగా అగ్నివీర్ ఎక్స్ గ్రేషియా’.. మాజీ ఐఎఎఫ్ చీఫ్ వివరణ

Agniveer Compensation| అగ్నివీర్ సైనికులకు ఎక్స్‌గ్రేషియా(నష్టపరిహారం) వివాదంపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య తలెత్తిన వివాదంపై భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు, భారత వైమానిక దళం (IAF) మాజీ చీఫ్ RKS భదౌరియా.. గురువారం వివరణ ఇచ్చారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ఆయన మాట్లాడుతూ..

Agniveer Compensation| ‘ఆర్మీ జవాన్ తో సమానంగా అగ్నివీర్ ఎక్స్ గ్రేషియా’.. మాజీ ఐఎఎఫ్ చీఫ్ వివరణ

Agniveer Compensation| అగ్నివీర్ సైనికులకు ఎక్స్‌గ్రేషియా(నష్టపరిహారం) వివాదంపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య తలెత్తిన వివాదంపై భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు, భారత వైమానిక దళం (IAF) మాజీ చీఫ్ RKS భదౌరియా.. గురువారం వివరణ ఇచ్చారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ ఆర్మీ జవాన్ల అయినా అగ్నివీర్ సైనికులైనా వారు చనిపోతే.. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సమానంగా ఉంటుందని.. ప్రక్రియ కూడా ఒకటే అని చెప్పారు.


చనిపోయిన సైనికుల కుటంబాలకు నష్టపరిహారం ఇచ్చేందుకు భారత సైన్యం.. ఒక ప్రక్రియ ద్వారా చెల్లిస్తుందని తెలపారు. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలల పరిమితి అవసరమని.. ప్రక్రియలో వివిధ దశలు ఉంటాయని బధౌరియా వివరించారు.

Also Read: రష్యా, ఆస్ట్రియా పర్యటన విజయవంతం.. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ


యుద్దం లేదా ప్రమాదంలో ప్రాణనష్టం జరిగితే సైనికుడి మృతదేహానికి పోస్టు మార్టం చేయాలి.. ఆ నివేదిక రావాలి. పోలీసుల నివేదిక, కోర్టు విచారణ పూర్తి కావాలి. ఈ ప్రక్రియ సాధారణ సైనికుడు, లేదా అగ్నివీర్ సైనికుడు విషయంలో ఒకటేనని చెప్పారు.

అగ్నివీరుల కుటుంబాలకు సత్వర పరిహారం
మరణించిన సైనికుల బంధువులకు చెల్లింపులు సెటిల్ చేయడానికి కాలపరిమితికి సంబంధించి, అవసరమైన విచారణల కారణంగా సాధారణంగా రెండు నుండి మూడు నెలల సమయం పడుతుందని భదౌరియా వివరించారు. అగ్నివీరుల కుటుంబాలకు నష్టపరిహారం విషయంలో అన్యాయం జరుగుతోందని ప్రతిపక్ష పార్టీల చేసే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. భారత సైన్యంలోని ఒక యూనిట్ మరణించిన సైనిక కుటుంబాలతో సంప్రదిస్తుందని.. వారి విషయంలో జాగ్రత్తలు పాటిస్తుందని తెలిపారు. పోలీస్ రిపోర్ట్ లో యద్ధంలో మరణించాడని తేలితే తప్ప.. కేంద్ర సంక్షేమ నిధి నుంచి ఎక్స్ గ్రేషియా చెల్లించడం జరగదని వివరించారు.

Also Read: భారత్-చైనా సరిహద్దులో స్మగ్లింగ్..108 కిలోల బంగారం స్వాధీనం

ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా బార్డర్ వద్ద ల్యాండ్ మైన్ బాంబు పేలుడు ఘటనలో చనిపోయిన అగ్నివీర్ సైనికుడి కుటుంబానికి ఇప్పటికే కొంత భాగం చెల్లింపు చేశామని.. మిగతా మొత్తం త్వరలోనే చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఈ డబ్బు బీమా కంపెనీ ద్వారా సైనికుడి కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేయబడుతుంది. అగ్నివీర్ సైనికులు.. సాధారణ సైనికుల లాగా బీమా ప్రీమియం కోసం తమ జీతంలో నుంచి కొంత చెల్లించాల్సిన అవసరం ఉండదని.. ఆ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన చెప్పారు.

సైనికులు మరణించిన తరువాత వారి కుటుంబాలు మానసికంగా బాధపడుతూ ఉంటారని.. అలాంటివారిని రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు గందరగోళం సృష్టిస్తున్నారని భదౌరియా అన్నారు.

 

RKS Bhadauria, Agniveer Compensation, BJP, Congress,

Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Cyclone Dana: ‘దానా’ తుపాను ఎఫెక్ట్‌.. పలు రైళ్లతో పాటు ఆ ఎగ్జామ్స్ కూడా రద్దు!

AP Cabinet Meeting: సిలిండర్లపై మూడు గ్యాస్‌ కంపెనీలతో ఒప్పందం.. మంత్రి నాదెండ్ల మనోహర్‌

Kaleshwaram Investigation: మరోసారి కాళేశ్వరం బహిరంగ విచారణ.. కాళేశ్వరం ఓపెన్ కోర్టు

IAS Officer Amoy Kumar: ఐఏఎస్ అమోయ్ కుమార్ అక్రమాల పుట్ట పగలనుందా? అమోయ్ సొమ్మంతా ఎక్కడ?

Bengaluru: బెంగళూరులో భారీ వర్షం.. కుప్పకూలిన భారీ భవనం.. ఒకరు మృతి

Jagga Reddy: కేటీఆర్‌కు ప్రాక్టికల్ నాలెడ్జి లేదు.. అంతా బుక్ నాలెడ్జ్.. జగ్గారెడ్డి ఫైర్

Big Stories

×