Donkeys as zebras: చైనాలో ఒక వినూత్నంగా ఆలోచించి పప్పులో కాలు వేసినట్లు అయింది. సందర్శికులను నమ్మించేందుకు గాడిదను జీబ్రాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దానికి నలుపు, తెలుపు రంగులతో కూడిన పెయింట్ వేశారు. సందర్శకులను ఆకట్టుకోవడానికి జూ యాజమాన్యం చేసిన పని గందరగోళానికి దారి తీసింది.
చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ లోఉన్న జిబో సిటీ జూ పార్కులో తెలుపు, నలుపు రంగులతో కూడిన జీబ్రా సందర్శకులు ఆకర్షించింది. అయితే సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారడంతో అందరూ గుర్తించారు. అది జీబ్రా కాదని గాడద అని అక్కడ ప్రముఖ మీడియా సంస్థ బయటకు తెలిపింది. కృత్రిమ జీబ్రా గుర్తులతో కూడిన గాడిదను జూ లో ఉంచి సందర్శకులను నమ్మే ప్రయత్నం చేశారని పేర్కొంది.
సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ కావడంతో ఇదంతా జూ యాజమాన్యం చేసిన మార్కెటింగ్ వ్యూహమని తెలిసింది. అయితే, ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇది సందర్శకులను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేశారని పలువరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. ఇదోక పెద్ద స్టంట్ అంటూ పలువురు జూ నిర్వహికం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలువురు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఇది జంతువులకు, సందర్శకులను మోసం చేయడమే అని ఓ నెటిజన్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వేదికగా రాశారు. కొంతమంది వినియోగదారులు చారలను సృష్టించడానికి డక్ట్ టేప్ ఉపయోగించరాని.. మరొకరు అది రంగు అని చెప్పుకొచ్చారు.
మరికొందరు ఫేస్ బుక్ వేదికగా మారువేషాన్ని సరిగ్గా అమలు చేయలేదని ఎగతాళి చేస్తూ రాసుకొచ్చారు. ఇతర సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. జూ యాజమాన్యం సందర్శకులను నమ్మించేందకు ఇలాంటి చెడు పనులు చేయరాదు అని మరొక వ్యక్తి రాసుకొచ్చారు. ఆ జీబ్రా చారలు గజిబిజిగా గందరగోళంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పనులు చేసిన వ్యక్తులకు కఠిన శిక్ష విధించాలని మరికొందరు సోషల్ మీడియా లో కామెంట్లు చేస్తున్నారు. ఒక జూ ఇలాంటి పనుల చేయడానికి ప్రయత్నించి పట్టుబడం ఇదే మొదటి సారి కాదని మరొకరు కామెంట్ చేశారు.
జిబో సిటీ ఉద్యానవనం మరొక చైనీస్ జూ నుంచి ప్రేరణ పొందిందని తెగ ఆరోపణలు వస్తున్నాయి. జూ యాజమాన్యం రంగు వేసి పాండాలుగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. అయితే పాండా అని పిలవబడే వాటిలో ఒకటి మొరగడం ప్రారంభించింది. అప్పుడు జూ లోని సందర్శకులు అనుమానం వ్యక్తం చేశారు. జూ ప్రారంభంలో ఆరోపణలను ఖండించింది కానీ తర్వాత మోసం చేసినట్లు అంగీకరించింది.
ఒక చైనా దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. 2018లో ఈజిప్ట దేశం లోని కైరో ఒక జూ లో జంతువుల ముఖ కదలికలు, చెవులు నిజమైన జీబ్రాను పోలీ లేవని సందర్శకులు గుర్తు పట్టారు. వారు జూ యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో గాడిదలకు పెయింట్ వేశారని అంగీకరించారు. జూ డైరెక్టర్ మహ్మద్ సుల్తాన్ మొదట్లో ఈ వాదనలను ఖండించారు. జంతువులను బాగా చూసుకుంటున్నామని చెప్పారు. కానీ చివరకు పట్టుబడ్డారు.
ALSO READ: NAFED Recruitment: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్.. ఈ అర్హతలు ఉంటే సరిపోతుంది..
ఇలాంటి ఘటనల పట్ల యానిమల్ లవర్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు.. రోడ్డు పక్కన ఉన్న జూ లు జంతువుల సంక్షేమం కంటే లాభాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శిస్తున్నారు. 2009లో గాజాలో ఇలాంటి కేసునే పెటా కూడా ఎత్తి చూపింది. ఇజ్రాయెల్ దిగ్బంధనం కారణంగా నిజమైన జీబ్రాలను దిగుమతి చేసుకోలేక జూకీపర్లు గాడిదలకు రంగులు వేసి పర్యాటకులను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ చివరకు దొరికిపోయారు.