Basit Ali On Bumrah: టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య జరిగే మ్యాచ్ లపై మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ( Basit Ali) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను ( Team India) ఓడించేందుకు పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. విఫలమవుతూనే ఉందని వ్యాఖ్యానించారు. దీనంతటికీ కారణం యార్కర్ కింగ్ బుమ్రా ( Bumrah) అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పాలిట రంకు మొగుడిలా బుమ్రా తయారయ్యాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుమ్రా ఉండగా ఒక్క మ్యాచ్ కూడా పాకిస్తాన్ గెలవడం లేదని బాంబు పేల్చారు. వాడు వేసే బంతులకు పాకిస్తాన్ బ్యాటర్లు ప్యాంట్లు తడుపుకుంటున్నారని హాట్ కామెంట్స్ చేశారు. బుమ్రా లేకపోతే టీమిండియా జట్టును అవలీలగా ఓడించగలమంటూ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా ఫాస్ట్ బౌలర్, యార్కర్ కింగ్ బుమ్రా ( Bumrah) పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ ఆలీ కీలక వ్యాఖ్యలు చేశారు. బుమ్రా గురించి అందరూ తక్కువగా అంచనా వేస్తూ ఉంటారని.. అలాంటి బౌలర్ ఉండడం టీమిండియా అదృష్టమని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్ అతడే అని చెప్పవచ్చంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి ఒత్తిడి సమయంలో అయినా వికెట్లు పడగొట్టగల సమర్థులు బుమ్రా అంటూ వ్యాఖ్యానించారు. యార్కర్ కింగ్ బుమ్రా ఉంటేనే టీమిండియా గెలుస్తుందనే భావనను అందరిలో తీసుకువచ్చాడని గుర్తు చేశారు. అతడు లేకపోతే టీమిండియా అస్సలు రాణించబోదని బాంబు పేల్చారు. వెస్టిండీస్ తో జరుగుతున్న టి20 సిరీస్ సందర్భంగా ఇది రుజువు అవుతోందని తెలిపారు.
2024 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా పాకిస్తాన్ పై బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడని గుర్తు చేశారు. ఆ తర్వాత మొన్న జరిగిన 2025 ఆసియా క్రీడల సందర్భంగా అసాధారణ ప్రదర్శన అందించి పాకిస్తాన్ జట్టును ఓడించాడని తెలిపారు. ఇలా పాకిస్తాన్ జట్టుకు అడుగడుగున విలన్ గా మారాడని… వాడు ఉండగా టీం ఇండియాను ఓడించడం కష్టమేనన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో కూడా బుమ్రాను పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదృష్టం బాగుండి బుమ్రా గాయం కారణంగా వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే పాకిస్తాన్ కచ్చితంగా టీమిండియా కోట బద్దలు కొడుతుందని వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే మరోసారి టీమిండియా చేతిలో ఓడిపోవాల్సి వస్తుంది అన్నారు. ఈ నేపథ్యంలో బుమ్రా బౌలింగ్ పై బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.