E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి చుక్కలు చూపించిన దీప             

Karthika Deepam 2 Serial Today Episode September 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి చుక్కలు చూపించిన దీప             
Advertisement

Karthika Deepam 2 serial today Episode: తనను కేపేలో పని చేయకుండా ఓనరు బెదిరించి జాబ్‌లోంచి తీసేయించింది మీరేనని సూరజ్ ను తిడుతుంది. సూరజ్‌ కోపంగా నీకేం తెలియకుండా మాట్లాడుతున్నావు అంటూ ఓనరు దగ్గరకే వెళ్దాం పద అడుగుతాను అంటే.. నువ్వు అడిగినా ఆయన మీకు భయపడి నిజం చెప్పరు..? నేను పని చేసే చోటికి నువ్వు వస్తావు మీ దక్షిణమూర్తి తాత వస్తాడు. అయినా మీకేం తెలియదు.. కనీసం మా అమ్మ మనఃస్పూర్తిగా భోజనం చేసి ఎన్ని రోజులు అయిందో తెలుసా..? నేను సంపాదించి తీసుకెళ్తే కనీసం మా అమ్మ అయినా కడుపు నిండా భోజనం చేస్తుంది అనుకున్నాను. కానీ అవేమీ జరగలేదు అందుకు కారణం నువ్వే అంటూ తిడుతుంటే.. సూరజ్‌ కోపంగా నేను చేయలేదు అంటాడు. అయితే నా మీద ఒట్టేసి నిజం చెప్పు అంటూ సూరజ్‌ ఒట్టేయను అంటాడు. జ్యోత్స్న తిట్టి వెళ్లిపోతుంది.

నవ్వు ఎలాగూ పని చేయలేవని తెలిసే ఇలాంటి కడీషన్స్‌ పెట్టి ఇన్ని ఫైల్స్‌ నీ టేబుల్‌ మీద పెట్టించింది పిన్ని అంటూ కార్తీక్‌ చెబితే.. అవును పొరపాటున ఎవరైనా సాయం తీసుకుంటానని కాపలాగా ఒక అమ్మాయిని పెట్టింది అంటూ చెప్పగానే.. కార్తీక్‌ తన మాటలతో దీపను మోటివేట్‌ చేస్తాడు. ఇంతకు ముందు జ్యోత్స్న ఇబ్బంద పెట్టినప్పుడు ఏం చేశావో గుర్తుందా..? ఇప్పుడు అదే చేయ్‌ ప్రతిసారి మనల్ని యుద్దంలో గెలిపించడానికి ఎవ్వరూ రారు మనమే యుద్దం చేయాలి అంటూ చెప్పగానే.. దీప మొబైల్‌ తీసి ఇంగ్లీష్‌ పైల్‌ ఫోటో తీసి ట్రాన్స్‌లేట్‌ చేసుకుంటుంది అప్పుడే మాలిని వచ్చి గీతతో దీప ఏం చేస్తుంది అని తెలుసుకుని వచ్చి నాకు చెప్పు అంటూ లోపలికి వెళ్తుంది. గీత వెళ్లి అడిగితే దీప తిక్క తిక్కగా మాట్లాడుతుంది. ఫైల్‌తో కొట్టానంటే పోయి అక్కడ పడతావు అంటూ తిడుతుంది. మాలిని అంటే ఎవరు ఈ ఆఫీసులో ఆవిడ పోస్ట్‌ ఏంటి..? అంటూ అడగ్గానే.. గీత అదే వెళ్లి మాలినికి చెప్పగానే.. మాలిని కోపంగా గీతను తిడుతుంది. నిన్ను పీఏ పోస్టు నుంచి తీసేస్తున్నాను వెళ్లిపో అంటూ కొట్టబోతే గీత అక్కడి నుంచి పారిపోతుంది.

Advertisement

మాలిని బయటకు వచ్చి దీపను తిడుతుంది. మనుషులను నా మీదకు బాగానే ఉసిగొల్పుతున్నావు కదా అంటూ మాట్లాడుతుంటే.. గీత కాదు నేను అడుగుతున్నాను కదా మీరు ఎవరు..? మాలిని అంటే ఎవరు… నా పేరు దీప సీఈవో మరి నువ్వు ఎవరు..? సీఈవోను ప్రశ్నించేవాళ్లు అంత కన్నా పెద్ద పోస్టులో ఉండాలి అందుకే నువ్వు ఎవరు..? అంటూ దీప అడిగితే.. మాలినికి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంటుంది. అప్పుడే సూరజ్‌ క్యాబిన్‌ లోంచి కాలింగ్‌ బెల్‌ వినిపించడంతో నీ సంగతి మళ్లీ వచ్చి చెప్తాను అంటూ సూరజ్‌ క్యాబిన్‌ లోకి వెళ్తుంది. మాలినిని చూసి సూరజ్‌ కూడా నువ్వెవరు అంటూ అడిగితే మాలిని కోప్పడుతుంది. అందరూ నన్ను నువ్వెవరు అంటూ అడుగుతున్నారేంటి అంటూ ప్రశ్నిస్తుంది. సూరజ్‌ తాను పీఏను పిలిస్తే నువ్వెందుకు వచ్చావు నువ్వు ఎవరు మా అమ్మకు కదా అందుకే అడిగాను అంటూ మనకు ఇంకా ఎవరైనా శత్రువులు ఉన్నారా..? అని అడిగితే ఏం లేదని రెండు రోజుల్లో కొత్త పీఏ వస్తుందని చెప్తుంది మాలిని.

కార్తీక్‌, దీప స్కూటీ మీద వెళ్తూ.. రోడ్డు పక్కన కూర్చున్న జ్యోత్స్నను చూసి ఆగిపోతారు. దగ్గరకు వెళ్లి ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని అడిగితే.. తనను ఉద్యోగంలోంచి తీసేశారని చెప్తుంది ఎందుకు తీసేశారు అని అడిగితే సూరజ్‌ వాళ్లు బెదిరించడం వల్లే తనను జాబ్‌లోంచి తీసేశారు అంటూ జరిగింది అంతా చెప్తుంది. సరే ఇంటికి వెళ్దాం పద అని కార్తీక్‌ అంటే ఇంటికి వచ్చి ఏం చేస్తాను.. రేపటి నుంచి మళ్లీ జాబ్‌ కోసం తిరగాలి కదా అదేదో ఇప్పుడే చేస్తాను అంటుంది జ్యోత్స్న.

Advertisement

రోడ్లు పట్టుకుని ఎక్కడని తిరుగుతావు నాకు తెలిసిన వాళ్ల దగ్గర ఎవరికైనా చెప్పనా అంటే వద్దు బావ నాకు మీ సాయంతో జాబ్‌ వచ్చిందంటే తాత మిమ్మల్ని తిడతాడు. తాతకు నేను శత్రువును అవుతాను. తాత ఆలోచనలో ఏముందో ఏమో తన కుటుంబం కోసం ఏం ఆలోచిస్తున్నాడే ఏమో అంటూ జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. గేటు దాటి బయట కాలు పెట్టాలంటే కారు కావాలనే జ్యోత్స్న ఇవాళ కాలి నడకన వెళ్తుంది. ఏంటి బావ ఇది అంటూ దీప బాధపడుతుంది. సరే ఇంటికి వెళ్దాం  పద అంటూ ఇంటికి వెళ్లగానే.. గేటు దగ్గర పారిజాతం కంగారుపడుతూ కనిపిస్తుంది. ఏంటని కార్తీక్‌ అడిగితే మీ తాత చాలాసేపటి నుంచి కనిపించడం లేదని చెప్తుంది. దీప, కార్తీక్‌ కంగారు పడతారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అల్లా మీద ఒట్టు..టీమిండియాను వ‌రుణుడు కూడా కాపాడ‌లేడు, సెమీ ఫైనల్స్ లోనే ఎలిమినేట్

Karthika Deepam 2 Serial Today Episode September 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్స్నలను కెపేలో చూసిన దక్షిణమూర్తి        

ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి..చిరు శ్రీకాంత్ సినిమా నాని పై అప్డేట్!

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

కొడుకు బతకాలంటే రూ. 26 కోట్లు కావాలి.. దాతలు ముందడుగు వేస్తే, కాటేసిన సైబర్ రాక్షసులు!

Intinti Ramayanam Today Episode: బాబు కిడ్నాప్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవని ప్లాన్ సూపర్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించిన భద్ర.. వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Big Stories

Advertisement
×